ఏలేటి మహిపాల్ రెడ్డి
ఏలేటి మహిపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1985లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి అటవీశాఖ మంత్రిగా పని చేశాడు.
ఏలేటి మహిపాల్ రెడ్డి | |||
మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1985 - 1989 | |||
నియోజకవర్గం | ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1950 చౌట్‌పల్లి గ్రామం, కమ్మర్‌పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ![]() | ||
జీవిత భాగస్వామి | ఏలేటి అన్నపూర్ణ | ||
సంతానం | ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, ఏలేటి నాగార్జునరెడ్డి | ||
నివాసం | హైదరాబాద్ |
జననం, విద్యాభాస్యం సవరించు
ఏలేటి మహిపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, కమ్మర్‌పల్లి మండలంలోని చౌట్‌పల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు.
రాజకీయ జీవితం సవరించు
ఏలేటి మహిపాల్ రెడ్డి చౌట్‌పల్లి సర్పంచ్‌గా, భీమ్‌గల్ పంచాయతీ సమితి సభ్యులుగా పని చేసి, 1982లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శనిగరం సంతోష్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆయన 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శనిగరం సంతోష్ రెడ్డి పై గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1989లో ఎన్.టి.రామారావు మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా పని చేశాడు.ఏలేటి మహిపాల్ రెడ్డికి 1989లో టికెట్ దక్కలేదు.[1]
మరణం సవరించు
ఏలేటి మహిపాల్ రెడ్డి 1991 జనవరి 18న గుండె పోటుతో మరణించాడు. ఆయనకు భార్య ఏలేటి అన్నపూర్ణ, ఇద్దరు కుమారులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, ఏలేటి నాగార్జునరెడ్డి ఉన్నారు.
మూలాలు సవరించు
- ↑ Sakshi (13 November 2018). "సర్పంచ్ నుంచి చట్ట సభకు..!". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.