ఐనవోలు (హన్మకొండ జిల్లా)

తెలంగాణ, హన్మకొండ జిల్లా లోని ఐనవోలు మండల కేంద్రం

అయినవోలు, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, ఐనవోలు మండలం లోని గ్రామం.[1]

అయినవోలు
—  రెవిన్యూ గ్రామం  —
ఐనవోలు గ్రామపంచాయితి కార్యాలయం
ఐనవోలు గ్రామపంచాయితి కార్యాలయం
ఐనవోలు గ్రామపంచాయితి కార్యాలయం
అయినవోలు is located in తెలంగాణ
అయినవోలు
అయినవోలు
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°52′00″N 79°32′49″E / 17.8667594°N 79.5469271°E / 17.8667594; 79.5469271
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ జిల్లా
మండలం ఐనవోలు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,441
 - పురుషుల సంఖ్య 3,797
 - స్త్రీల సంఖ్య 3,644
 - గృహాల సంఖ్య 1,840
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది వరంగల్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో.ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని వర్ధన్నపేట మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లాలో, కొత్తగా ఏర్పాటు చేసిన ఐనవోలు మండలం లోకి చేర్చారు. [2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది. [3]

గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1840 ఇళ్లతో, 7441 జనాభాతో 1840 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3797, ఆడవారి సంఖ్య 3644. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1766 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 126. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 578303[4].పిన్ కోడ్: 506310.

చరిత్ర

మార్చు

సా.శ. 1118లో త్రిభువనమల్ల బిరుదాంకితుడైన, పశ్చిమ చాళుక్య రాజు, ఆరవ విక్రమాదిత్యుడు, దండనాయకుడైన సూరయ్య (అయ్యన్నమరస) కు అయ్యనవోలు సూరేశ్వర దేవుని నిత్యారాధనకు, బిక్షుకుల నిత్యాన్నదాన నిమిత్తం భూదానం చేసినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఈ అయ్యనచే నిర్మింపబడి అయ్యన్నప్రోలుగా పిలువబడి, ప్రస్తుతం ఐనవోలుగా రూపాంతరం చెందింది.మైలారదేవుని ఆలయాన్ని కాకతీయ రాజు రెండ ప్రోలుని కుమారుడు రుద్రదేవుడు నిర్మించాడని సిద్ధేశ్వర చరిత్ర వల్ల తెలుస్తున్నది.[5] ఆలయానికి తూర్పు, దక్షిణ దిశలలో రెండు కీర్తితోరణాలను కాకతీయ రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణానికి పూర్వమే ఇక్కడ నిర్మింపజేశాడు. అందుకు తార్కాణంగా ఇదే శైలిలో నిర్మింపబడిన కాకతీయ కీర్తితోరణాలను ఈ నాటికీ మనం ఓరుగల్లు కోటకు నాలుగు దిక్కులా చూడవచ్చును. అయితే ఓరుగల్లులోని కీర్తితోరణాల శిల్పనిర్మాణ శైలి, సౌందర్యం చాలా పరిణతి చెంది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంతటి శిల్పసౌందర్యం ఐనవోలు తోరణాలలో మనకు కనిపించదు. అయితే, ఐనవోలు దేవాలయానికి శిలాతోరణాలను నిర్మించడం వెనుక ఒక కథను ఉటంకిస్తారు. అదేమంటే, కాకతీయ ప్రోలరాజు ఒకరోజున వేయిస్తంభాల దేవాలయంలో, నిద్రలో ఉన్న తనకుమారుడు రుద్రదేవుణ్ణి పుత్రవాత్సల్యంతో స్పృశించగా, మగతనిద్రలో ఉన్న రుద్రదేవుడు, తనను ఎవరో శత్రువులు చంపడానికి వచ్చినారని భావించి, తన మొలలోఉన్న కైజారును తీసి రుద్రదేవుణ్ణి పొడుస్తాడు. తండ్రి చావుకు కారకుడనైనానన్న పాపభీతితో ఐనవోలు ఆలయానికి శిలాతోరణాలను నిర్మింపజేశాడు. ఈ అంశం,1935వ సం.లో మారేమండ రామారావు సంపాదకత్వంలో వెలువడిన కాకతీయ సంచికలో పేర్కొనబడింది.

ఐనవోలు మల్లన్న

మార్చు
 
ఐనవోలు మల్లికార్జునస్వామి

ఇక్కడ కాకతీయులు కట్టించిన మల్లికార్జునస్వామి ఆలయం అయినవోలు మల్లన్న దేవాలయంగా ప్రసిద్ధి చెందినది.12వ శతాబ్దంలో మైలార లేదా మల్లారి దేవుని ఆలయంగా నిర్మింపబడిన ఈ ఆలయం, ఆ తరువాతి కాలంలో మల్లన్న, మల్లికార్జునఆలయంగా రూపాంతరం చెందింది. సా.శ.1369 లో ఐనవోలు ఆలయ ప్రాంగణంలోని ఒక స్తంభంపై రేచర్ల పద్మనాయక వంశానికి చెందిన సింగమనాయకుని కుమారుడు, అనపోత చెక్కించిన సంస్కృతాంధ్ర దాన శాసనంలో మల్లరి వృత్తాంతము వర్ణించబడిండి. అర్జునున్ని కాపాడటానికి శివుడు ఒక శబరుని వేషం ధరించి, మల్ల అనే రాక్షసున్ని సంహరించాడు. అలా మల్ల+అరి=మల్లరి అన్న పేరు తెచ్చుకున్నాడు. మల్లరి అనే పేరు కాలక్రమంలో మైలార అయ్యింది.[6]

స్వామివారి రూపం భీకరంగా పది అడుగుల ఎత్తుతో, విశాల నేత్రాలతో, కోరమీసాలతో ఉంటుంది. చతుర్భుజాలు కలిగి నాలుగు చేతులలో ఖడ్గం, త్రిశూలం, ఢమరుకం, పానపాత్ర ఉంటాయి. ఇరువైపులా దేవేరులు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుదీరి ఉంటారు. కుడి పాదం క్రింద మల్లన్న చేతిలో హతులైన రాక్షసులు మణి-మల్లాసురుల శిరస్సులుంటాయి. ఈస్వామివారిని మల్లన్న, మల్లికార్జునస్వామి, ఖండేల్ రాయుడు అని పిలుస్తారు. ఆలయంలో ఉన్న శివలింగం అర్థప్రాణవట్టంపై ఉంది. ఇది అరుణ వర్ణంలో ఉంటుంది. కుజ గ్రహానికి అధిష్టాన దైవతం. శివలింగంపై పార్థప్రహారం స్పష్టంగా కనిపిస్తుంది.[7]

బ్రహ్మోత్సవాలు

మార్చు

స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతియేటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరుగుతాయి. ఇవి పాంచాహ్నిక దీక్షతో, అయిదు రోజులపాటు వరుసగా అశ్వవాహనం, నందివాహనం, పర్వతవాహనం, రావణవాహనాలను అధిరోహించి చివరిరోజున రథారూఢుడై పురవీధి సేవకు బయలుదేరుతాడు. అయిదవరోజున ప్రాతః కాలంలో అగ్నిగుండాల కార్యక్రమం అనంతరం వసంతోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించి, శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలను ముగిస్తారు. ప్రతీ మాసశివరాత్రి రోజున మహాన్యాసపూర్వకరుద్రాభిశేకం, శాంతికల్యాణం, రుద్రహోమం జరుగుతాయి.

ప్రధానంగా మల్లన్న యాదవుల, కురుమల ఇష్టదైవం. ఇది ప్రముఖమైన జానపదుల జాతర. సంక్రాంతి పర్వదినం నుండి ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాల్లో జరుగుతుంది. 'బోనం' అనే ప్రత్యేక వంటకాన్ని కొత్త కుండలో వండి స్వామివారికి నివేదిస్తారు. అనంతరం 'ఒగ్గు పూజారులు 'గా వ్యవహరింపబడే కురుమ పూజారులు, ఢమరుకాన్ని వాయిస్తూ, నేలపై రంగురంగుల ముగ్గులనువేసి, జానపద బాణీలో స్వామివారి కథాగానాన్ని చేస్తారు. దీన్ని పట్నం వేయడం అంటారు. ఇది భక్తులు వారి శైలిలో నిర్వహించే స్వామివారికళ్యాణం. ప్రతీ మాస శివరాత్రిరోజున నజరుపట్నం, మహాశివరాత్రి రోజున పెద్దపట్నం కార్యక్రమాలను ఒగ్గు పూజారీలు నిర్వహిస్తారు.[8]

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల వరంగల్లోను, ఇంజనీరింగ్ కళాశాల బొల్లికుంటలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ వరంగల్లో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల వరంగల్లో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

ఐనవోలులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక అలోపతి ఆసుపత్రిలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో8 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఆరుగురు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

ఐనవోలులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

ఐనవోలులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 86 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 17 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 12 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 212 హెక్టార్లు
  • బంజరు భూమి: 707 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 806 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1170 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 555 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

ఐనవోలులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 555 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

ఐనవోలులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

ప్రత్తి, వరి, మొక్కజొన్న

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-11-18. Retrieved 2018-01-25.
  2. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. 3.0 3.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  5. The Andhra Pradesh journal of archaeology, Volume 2, Issue 1
  6. The History of Sacred Places in India as Reflected in Traditional literature p.106
  7. నమస్తే తెలంగాణ, వరంగల్ పట్టణం (13 January 2020). "భక్తుల కొంగుబంగారం ఐనవోలు మల్లన్న". ntnews. Archived from the original on 13 October 2020. Retrieved 13 October 2020.
  8. ఈనాడు, సండే మ్యాగజిన్. "జానపదుల జాతర చూసొద్దాం". www.eenadu.net. Archived from the original on 13 October 2020. Retrieved 13 October 2020.

బయటి లింకులు

మార్చు