మన్నవ బాలయ్య

సినీ నటుడు
(బాలయ్య నుండి దారిమార్పు చెందింది)

మన్నవ బాలయ్య తెలుగు సినిమా నటుడు, నిర్మాత. ఎక్కువ సహాయ పాత్రలు పోషించాడు. కొన్ని సినిమాలకు కథ, పాటలు కూడా అందించాడు.

మన్నవ బాలయ్య
M balaiah.jpg
జననం (1930-04-09) 1930 ఏప్రిల్ 9 (వయస్సు: 90  సంవత్సరాలు)
చావపాడు గ్రామం, గుంటూరు జిల్లా
చదువుబి. ఇ, మెకానికల్ ఇంజనీరింగ్ (1952)
వృత్తిఅధ్యాపకుడు, నటుడు, నిర్మాత, రచయిత
తల్లిదండ్రులు
  • గురవయ్య (తండ్రి)
  • అన్నపూర్ణమ్మ (తల్లి)

జీవిత విషయాలుసవరించు

గుంటూరు జిల్లా వైకుంఠపురం (అమరావతి) శివారు గ్రామం చావపాడు లో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఏప్రిల్ 9, 1930లో జన్మించాడు[1].[2] బాలయ్య మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ 1952లో పూర్తి చేశాడు. 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌లలో లెక్చరర్‌గా పనిచేశాడు.

చిత్రరంగంసవరించు

మద్రాసు గిండీ కళాశాలలో చదువుకునే రోజుల్లో నాటకాల్లో నటించాడు. మిత్రుల ప్రోద్బలముతో చిత్రాల్లో నటించాలనే కోరిక గలిగి తాపీ చాణక్య సహకారముతో చిత్రసీమలో అడుగు పెట్టాడు. 1958లో ఎత్తుకు పై ఎత్తు సినిమాలో నాయక పాత్ర వేశాడు. తరువాత భాగ్యదేవత, కుంకుమరేఖ చిత్రాల్లో నటించాడు. భూకైలాస్ చిత్రంలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో శివునిగా నటించే అవకాశం వచ్చింది. అటు తరువాత చెంచులక్ష్మి, పార్వతీకల్యాణం నుండి నేటి వరకు 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాడు. 1970లో అమృతా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి నేరము-శిక్ష, అన్నదమ్ముల కథ, ఈనాటి బంధం ఏనాటిదో (1977) లాంటి మంచి చిత్రాలు నిర్మించాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము చెల్లెలి కాపురం చిత్రాన్ని ఉత్తమ చిత్రముగా ఎంపిక చేసి బంగారు నంది పురస్కారము బహూకరించింది. స్వీయ దర్శకత్వంలో పోలీస్ అల్లుడు (1994), ఊరికిచ్చిన మాట (1981) నిర్మించాడు. 1991లో మద్రాసు నుండి హైదరాబాదు వచ్చాడు. చిత్రాల్లో, టి.వి. సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు. 2000 సంవత్సరములో తీసిన "పల్లెవాసం-పట్నవాసం"కు ప్రభుత్వ ఉత్తమ సీరియల్ అవార్డ్ లభించింది. అంకురం చిత్రంలో నటనకు వంశీ-బర్కిలీ వారి ఉత్తమ క్యారెక్టర్ అవార్డ్ లభించింది. ఈనాటి బంధం ఏనాటిదో సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, పాటలు అందించాడు.[3]

నటించిన చిత్రాలుసవరించు

ఇతడు నటించిన సినిమాల పాక్షిక జాబితా

1950లుసవరించు

1960లుసవరించు

1970లుసవరించు

1980లుసవరించు

1990లుసవరించు

2000లుసవరించు

2010లుసవరించు

నిర్మించిన చిత్రాలుసవరించు

మూలాలుసవరించు

  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 50
  2. "హ్యాపీ బర్త్ డేస్ - ఆల్‌ రౌండర్‌ బాలయ్య ఆంధ్రప్రభ 2011 ఏప్రిల్ 8". Archived from the original on 2011-09-23. Retrieved 2011-07-16.
  3. Indiancinema, Movies. "Eenaati Bandam Yenaatido (1977)". www.indiancine.ma. Retrieved 12 August 2020.