ఒక లైలా కోసం

2014 సినిమా

ఒక లైలా కోసం 2014 అక్టోబరు 17న విడుదలైన తెలుగు చలన చిత్రం.

ఒక లైలా కోసం
సినిమా పోస్టర్
దర్శకత్వంవిజయ్ కుమార్ కొండా
రచనవిజయ్ కుమార్ కొండా[2]
నిర్మాతఅక్కినేని నాగార్జున
తారాగణంఅక్కినేని నాగ చైతన్య,
పూజా హెగ్డే
ఛాయాగ్రహణంఐ. ఆంద్రూ
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుషణ్ముఖ ఫిల్మ్స్
విడుదల తేదీ
17 అక్టోబరు 2014[1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్20 crore (US$2.5 million)

కథ మార్చు

కార్తీక్‌ (నాగ చైతన్య) తొలి చూపులోనే నందన (పూజ) ప్రేమలో పడతాడు. అయితే కార్తీక్‌పై నందనకి మొదట్లోనే బ్యాడ్‌ ఇంప్రెషన్‌ పడుతుంది. అతడిని అపార్థం చేసుకుని ద్వేషం పెంచుకుంటుంది. నందనని ఎలాగైనా మెప్పించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు కార్తీక్‌. ఈలోగా అనుకోకుండా ఇద్దరికీ పెళ్ళి కుదురుస్తారు వారి పెద్దలు. కార్తీక్‌ అంటే ఇష్టం లేకపోయినా తన తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక నందన పెళ్ళికి ఒకే అంటుంది. మరి పెళ్ళి జరిగేలోగా కార్తీక్‌ ఆమెకి తనపై ఉన్న ద్వేషాన్ని పోగొడతాడా అన్నదే మిగిలిన కథ [3][4]

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

సంగీతం మార్చు

ఈ చిత్ర సంగీతం 2014 ఆగస్టు 17న్ విడుదలైనది.[6][7]

స్పందనలు మార్చు

  • చాలా సింపుల్ లవ్ స్టోరీ ఇది. పైగా ఎంతో సాదా సీదాగా సాగిపోతుంది కథంతా. ఏ ఒక్క సన్నివేశంలోనూ 'భలే ఉంది' అనేపించే ఆస్కారమే లేకుండా పోయింది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ నందు.. కార్తీక్‌ను అపార్థం చేసుకుంటూనే ఉంటుంది. అతను తన ప్రేమను ఎంత గొప్పగా వ్యక్తం చేసినా ఆమెలో పరివర్తన రాదు. నాగచైతన్య లోని హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి మూడు నాలుగు యాక్షన్ సీన్స్ పెట్టినా అవి అతికించినట్టు ఉన్నాయి తప్పితే కథకు ఉపయోగపడలేదు. ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్దేలో చక్కని నటి ఉంది. కానీ ఈ పాత్రకు ఆమె సంపూర్ణ న్యాయం చేకూర్చలేకపోయింది. ఇక నాగచైతన్య నటనలో కొత్తదనం ఏం లేకపోయింది. ఓ చిన్న పాయింటుతో రెండు గంటల పది నిమిషాల సేపు ఆడియెన్స్‌ను థియేటర్లో కూర్చోపెట్టాలంటే ఎంతో హెూమ్వర్క్ చేయాలి. దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఆ పని చేసినట్టు ఎక్కడా అనిపించదు.[8] - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్, ఫిల్మ్ జర్నలిస్ట్

మూలాలు మార్చు

  1. http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Oka-Laila-Kosam-to-release-on-Oct-17/articleshow/44092315.cms
  2. 2.0 2.1 http://www.business-standard.com/article/news-ians/hope-to-beat-manam-with-oka-laila-kosam-vijay-kumar-konda-114101500253_1.html
  3. http://www.greatandhra.com/movies/reviews/oka-laila-kosam-review-cute-love-story-60654.html
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-20. Retrieved 2014-10-17.
  5. 5.0 5.1 http://www.rediff.com/movies/report/naga-chaitanya-oka-laila-kosam-is-a-romcom-south/20141015.htm
  6. http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Oka-Laila-Kosam-audio-to-be-launched-today/articleshow/40340202.cms
  7. https://www.youtube.com/watch?v=Z-uEyjqFPzY
  8. చంద్రం (27 October 2023). "ఒక లైలా కోసం యువకుడి ఆరాటం!". జాగృతి వారపత్రిక. Retrieved 19 February 2024.

బయటి లంకెలు మార్చు