ఒమ్మెవరం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

ఒమ్మెవరం, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.పటం

గ్రామం
పటం
Coordinates: 15°41′13″N 80°09′11″E / 15.687°N 80.153°E / 15.687; 80.153
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంనాగులుప్పలపాడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523186 Edit this on Wikidata


విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు - 2.

సాగు/త్రాగునీటి సౌకర్యం మార్చు

కోదండరామయ్య చెరువు.

గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికకల అత్తంటి సులోచన, సర్పంచిగా ఎన్నికైనారు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

  • శ్రీ సీతారామస్వామి ఆలయo -ఈ గ్రామములోని, వేల ఏళ్ళ చరిత్ర ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయ పునర్నిర్మాణం 2013 అక్టోబరు 24న ప్రారంభమైనది.నూతనంగా పునర్నిర్మించిన ఈ ఆలయంలో, శ్రీ హనుమత్, లక్ష్మణ సమేత శ్రీ సీతారామస్వామి వారల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015, జూన్-9వ తేదీ మంగళవారంనాడు ప్రారంభమైనది. మంగళవారం నాడు, మంగళ వాయిద్యాల మధ్య, యాగశాల ప్రవేశ కార్యక్రమం జరిగింది. 10వ తేదీ బుధవారం ఉదయం విఘ్నేశ్వరపూజ, మూలవిరాట్టులకుపంచ ఉదకాభిషేకాలు, ప్రత్యేకహోమం నిర్వహించారు. యాఙిక క్రతువు నిర్వహించారు. 11వ తేదీ గురువారం ఉదయం 8-29 గంటలకు, విగ్రహ ప్రతిష్ఠా కర్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి స్వామివారి శాంతికళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. రాత్రికి స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఈ గ్రామస్థులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
  • శ్రీ వీరేశ్వరస్వామివారి అలయం - ఈ గ్రామంలో కొలువైయున్న శ్రీ వీరేశ్వరస్వామివారి అలయంలో, లక్ష రూపాయల ఆలయ నిదులతో నిర్మించే ముఖమంటపానికి, 2014, మార్చి-9న భూమిపూజ చేశారు.
  • శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం -ఈ గ్రామంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖ శుక్ల దశమి నాడు వైభవంగా నిర్వహించెదరు. ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం, ద్వాదశి రోజున వసంతోత్సవం నిర్వహించెదరు.
  • శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం - ఈ ఆలయంలో స్వామివారి 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసం (మే నెల) లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికులేగాక, భక్తులు చుట్టుప్రక్కల గ్రామాల నుండి గూడా అధిక సంఖ్యలో విచ్చేసారు.
  • శ్రీ రేణుకమ్మ ఆలయం -ఈ ఆలయ 13వ వార్షిక వేడుకలు, 2014, జూలై-4, శుక్రవారం నాడు ప్రారంభమైనవి. ఆలయంలో అంకురారోహణ, తోరణబంధం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం జమదగ్ని మహర్షి, రేణుకమ్మ వారికి కళ్యాణం నిర్వహించారు. ఆదివారం నాడు, అమ్మవారికి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యంగా సమర్పించారు.
  • శ్రీ వేణుగోపాలస్వామివారి అలయం

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఒమ్మెవరం&oldid=3718351" నుండి వెలికితీశారు