ఒలింపిక్ చిహ్నం
(ఒలింపిక్ చిహ్నాలు నుండి దారిమార్పు చెందింది)
ఒకదానితో ఒకటి గొలుసువలె కలిసిన ఐదు రింగులు ఒలింపిక్ క్రీడల చిహ్నం. ఐదు రింగుల అర్థం ఐదు ఖండాలు : 1. యూరప్, 2. ఆసియా, 3. ఆఫ్రికా, 4. ఆస్ట్రేలియా, 5. అమెరికా. ఐదు రింగులు వరుసగా నీలం, పసుపుపచ్చ, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉంటాయి. ఈ ఐదు రింగులు ప్రజల క్రీడా స్ఫూర్తికి సౌభ్రాతృత్వానికి చిహ్నం.
ఒలింపిక్ పతాకం
మార్చుఒలింపిక్ పతాకం క్రీస్తుశకం 1913లో బేరన్ పియరీ డీ కౌబర్టీన్ సలహాపై రూపొందించబడి, క్రీస్తుశకం 1914లో పారిస్లో ఆవిష్కరింపబడింది. అయితే సా.శ. 1920లో జరిగిన అంటెవెర్ప్ ఒలింపిక్ క్రీడలలో ప్రప్రథమంగా ఎగుర వేయబడింది. ఒలింపిక్ పతాకం తెల్లని పట్టుగుడ్డ మీద ఒకదానితో ఒకటి కలిసిన ఐదు రింగులు ఉంటాయి.