ఓం పురి

భారతీయ నటుడు

ఓం పురి ఒక అంతర్జాతీయ భారతీయ నటుడు. బాలీవుడ్ సినిమాల్లోనే గాక హాలీవుడ్,, కొన్ని పాకిస్థాన్ సినిమాల్లో కూడా నటించాడు. పలు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు.[1]ఇబ్రహీం అల్కాజీ వద్ద శిక్షణ పొందాడు.[2]

ఓం పురి
OmPuriSept10TIFF.jpg
2010 టొరంటో సినిమా వేడుకల సందర్భంలో ఓంపురి
జననం
ఓం రాజేశ్ పురి

(1950-10-18)1950 అక్టోబరు 18 [1]
అంబాలా, పంజాబ్
మరణం2017 జనవరి 6(2017-01-06) (వయస్సు 66)[1]
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1976 – 2017
జీవిత భాగస్వామినందిత (m. 1993)
పిల్లలుఇషాన్ పురి

2017, జనవరి 6 శుక్రవారం ఉదయం గుండెపోటుతో తన స్వగృహంలో మరణించాడు.

వార్తలలో ఓం పురిసవరించు

బాలీవుడ్ నటుడు ఓం పురికి ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత కొద్దికాలంగా ఓంపురికి, ఆయన భార్య నందితకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నందితా ముంబైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. నందితా పిటిషన్ విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

నందితాకు భరణం కింద ప్రతినెలకు 1.25 లక్షల రూపాయలు.. కుమారుడికి 50 వేల రూపాయలను చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా వైద్య, విద్య ఖర్చుల కోసం పత్రినెల 1.15 లక్షలు చెల్లించాలని ఓం పురికి ఆదేశించింది. ఆదాయ వనరుల లేమి ఉన్నందున్న.. నందితా లీగల్ ఖర్చుల కింద 25 వేల రూపాయలు కూడా ఓంపురి చెల్లించాలని తీర్పులో పేర్కోంది. ఇవియే కాకుండా నందితా కోసం చెల్లిస్తున్న ఇన్పూరెన్స్ ప్రీమియం, మెడిక్లెయిమ్ పాలసీలు, విద్యుత్, టెలిఫోన్ బిల్లులు, సొసైటీ మెయింటెనెన్స్ చార్జీలను ఓంపురి చెల్లిస్తున్నారు.

వ్యక్తిగత విభేదాల కారణంగా తాము ఇద్దరం కలిసి జీవించడానికి వీలు లేనందున తమకు విడాకులు మంజూరు చేయాలని 2012 లో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో తాను గృహిణి అని.. తనకు జీవించనడానికి ఆదాయ వనరులు లేనందున ఇంటిరిమ్ మెయింటెనెన్స్ చెల్లించాలని నందిత పిటిషన్ దాఖలు చేశారు. ప్రతినెల ఓంపురికి 35 లక్షల నుంచి 45 లక్షల రూపాయల ఆదాయం ఉందని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ నందితా పేర్కొన్నారు.[3]

సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 "బాలీవుడ్‌ నటుడు ఓంపురి కన్నుమూత". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 6 జనవరి 2017. Retrieved 6 జనవరి 2017. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (help)
  2. "Profile: "I Was Recognised For My Genius"". The Outlook. 18 December 1996.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-08. Retrieved 2013-10-07.
"https://te.wikipedia.org/w/index.php?title=ఓం_పురి&oldid=3584587" నుండి వెలికితీశారు