ఓం ప్రకాష్ రావత్

ఓం ప్రకాష్ రావత్ (జననం 1953 డిసెంబరు 2) మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ 1977 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. ఆయన 22వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారు.[1][2] అంతకు ముందు భారత ఎన్నికల కమీషనరుగా, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కి సెక్రటరీగా కూడా పనిచేసాడు .

ఓం ప్రకాష్ రావత్
Rawat taking charge as the Chief Election Commissioner of India, in January 2018
22 వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరు
In office
2018 జనవరి 23 – 2018 డిసెంబరు 1
అధ్యక్షుడురాం నాథ్ కోవింద్
అంతకు ముందు వారుఅచల్ కుమార్ జ్యోతి
తరువాత వారుసునీల్ అరోరా
బభారత ఎన్నికల కమిషను
In office
2015 ఆగస్టు 14 – 2018 జనవరి 22
భారత ప్రభుత్వంలో కార్యదర్శి
In office
2012 మార్చి 3 – 2013 డిసెంబరు 31
వ్యక్తిగత వివరాలు
జననం
ఓం ప్రకాష్ రావత్

(1953-12-02) 1953 డిసెంబరు 2 (వయసు 71)
Uttar Pradesh, India
కళాశాలబెనారస్ హిందూ యూనివర్సిటీ (BSc, MSc)
వృత్తిఐ ఎ ఎస్ అధికారి
పురస్కారాలుAn awardee of state government's 'recognition of forest rights' in 2009.

చదువు

మార్చు

రావత్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి (BHU) నుండి భౌతిక శాస్త్రంలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ [3][4][5] చేసాడు. 1989 లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో సామాజిక అభివృద్ధి ప్రణాళికలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసాడు.[3][4][5]

కెరీర్

మార్చు

ఐఏఎస్ అధికారిగా

మార్చు

రావత్ భారత ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం రెండింటికీ ప్రిన్సిపల్ సెక్రటరీ (వాణిజ్యం, పరిశ్రమలు), మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ (మహిళా, శిశు అభివృద్ధి) ప్రిన్సిపల్ సెక్రటరీ (గిరిజన సంక్షేమం) వంటి వివిధ హోదాల్లో పనిచేశాడు. నర్మదా వ్యాలీ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్, మధ్యప్రదేశ్ ఎక్సైజ్ కమీషనర్, మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో నర్సింగపూర్, ఇండోర్ జిల్లాల కలెక్టర్‌గా, యూనియన్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ సెక్రటరీగా, భారత ప్రభుత్వంలో రక్షణ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసాడు.[3][4][5] మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, అటవీ హక్కుల చట్టం, 2006 అమలులో అత్యుత్తమ, వినూత్నమైన కృషికి గాను ప్రధానమంత్రి పురస్కారాన్ని అందుకున్నాడు.

పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ సెక్రటరీ

మార్చు

రావత్‌ను 2012 మార్చిలో క్యాబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ యూనియన్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ సెక్రటరీగా నియమించింది, అతను 2012 మార్చి 3 న పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[3][4] ఆయన హయాంలో, 2013 ఏప్రిల్‌లో కార్పొరేట్ సామాజిక బాధ్యతపైన, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సుస్థిరతపైనా మార్గదర్శకాలు అభివృద్ధి చేసారు. ఈ కొత్త విధానం భారతీయ కంపెనీల చట్టం (2014 ఫిబ్రవరి) సవరణకు పూర్వగామిగా మారింది. ఈ చట్టంతో దేశంలో, పెద్ద సంస్థలు తమ లాభాల్లో కనీసం 2 శాతాన్ని సామాజిక బాధ్యతాయుత కార్యకలాపాలకు ఖర్చు చేయడం తప్పనిసరి అయింది.

భారత ఎన్నికల కమీషనర్

మార్చు
 
2015 ఆగస్టులో భారత ఎన్నికల కమిషనర్‌గా రావత్ బాధ్యతలు స్వీకరించారు

2015 ఆగస్టు 14 న రావత్, ఎన్నికల కమిషనరుగా పదవీ బాధ్యతలు చేపట్టాడు.[6][7] ఆయన పదవీకాలంలో, బీహార్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాష్ట్రపతి, ఎన్నికలు జరిగాయి. ఆయన భారత ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి.

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్

మార్చు

అచల్ కుమార్ జ్యోతి పదవీ విరమణ తర్వాత, రావత్ తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా 2018 జనవరి 21 న ప్రకటించారు.[8][9] 2018 జనవరి 23 న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో ఎన్నికలు జరిగాయి. అతను 65 సంవత్సరాల వయస్సులో 2018 డిసెంబరు 1 న పదవీ విరమణ చేసాడు.[10]

మూలాలు

మార్చు
  1. "President Kovind appoints Sunil Arora as new Chief Election Commissioner". The Indian Express. 2018-11-26. Retrieved 2 July 2020.
  2. "O P Rawat new CEC, former finance secretary Lavasa named EC". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-01-22. Retrieved 2018-02-14.
  3. 3.0 3.1 3.2 3.3 "Om Prakash Rawat - Executive Record Sheet". Department of Personnel and Training, Government of India. Retrieved 2 September 2017. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. 4.0 4.1 4.2 4.3 "Sh. Om Prakash Rawat takes over as new Election Commissioner of India" (PDF). Election Commission of India. 14 August 2015. Retrieved 5 September 2017. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":3" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. 5.0 5.1 5.2 "Election Commissioner - Shri Om Prakash Rawat". Election Commission of India. Retrieved 2 September 2017.
  6. "Om Prakash Rawat appointed as the new Election Commissioner". India Today. 13 August 2015. Retrieved 2 September 2017.
  7. "Sh. Om Prakash Rawat Takes Over as New Election Commissioner of India". Business Standard. 15 August 2015. Retrieved 2 September 2017.
  8. Bose, Abhimanyu, ed. (21 January 2018). "Om Prakash Rawat Appointed New Chief Election Commissioner". NDTV. New Delhi. Retrieved 21 January 2018.
  9. "OP Rawat to be next Chief Election Commissioner, to succeed AK Joti". Daily News and Analysis. New Delhi. 21 January 2018. Retrieved 21 January 2018.
  10. "Sunil Arora takes over as Chief Election Commissioner, will oversee 2019 polls". 2018-12-02.