అచల్ కుమార్ జ్యోతి

అచల్ కుమార్ జ్యోతి (జననం 1953 జనవరి 23) 2017 జూలై 6 నుండి 2018 జనవరి 23 వరకు భారతదేశానికి 21వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసాడు. అతను గుజరాత్ కేడర్‌కు చెందిన 1975 బ్యాచ్ విశ్రాంత IAS అధికారి .

అచల్ కుమార్ జ్యోతి
21 వ భారత ప్రధాన ఎన్నికల కమిషనరు
In office
2017 జూలై 6 – 2018 జనవరి 23
అధ్యక్షుడుప్రణబ్ ముఖర్జీ, రాం నాథ్ కోవింద్
అంతకు ముందు వారుసయ్యద్ అంసీం అహ్మద్ జైది
తరువాత వారుఓం ప్రకాష్ రావత్
ఎనికల కమిషనరు
In office
2015 మే 13 – 2017 జూలై 5
అధ్యక్షుడుప్రణబ్ ముఖర్జీ
ప్రధాన ఎన్నికల కమిషను[[సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ ]]
గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
In office
2009 డిసెంబరు 31 – 2013 జనవరి 31
Chief MinisterNarendra Modi
వ్యక్తిగత వివరాలు
జననం
అచల్ కుమార్ జ్యోతి

(1953-01-23) 1953 జనవరి 23 (వయసు 71)
పంజాబ్
నివాసంన్యూ ఢిల్లీ
వృత్తిRetired IAS officer

చదువు

మార్చు

అచల్ కుమార్ జ్యోతి కెమిస్ట్రీలో గ్రాడ్యుయేట్ ( BSc ), పోస్ట్ గ్రాడ్యుయేట్ ( MSc ) డిగ్రీలు పొందాడు.[1]

కెరీర్

మార్చు

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పని చేయడంతో పాటు,[1][2][3] అచల్ కుమార్ జ్యోతి, ఆ నియామకానికి ముందు భారత ఎన్నికల కమిషన్‌లో ఎన్నికల కమిషనర్‌లలో ఒకరిగా పనిచేశాడి.[4] [5] [6] [7] [8]

అతను గుజరాత్ ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి (జనరల్ అడ్మినిస్ట్రేషన్), ప్రిన్సిపల్ సెక్రటరీ (ఫైనాన్స్), సర్దార్ సరోవర్ మేనేజింగ్ డైరెక్టర్ నర్మదా నిగమ్, సెక్రటరీ (పరిశ్రమలు), సెక్రటరీ (రెవెన్యూ), కార్యదర్శి (నీటి సరఫరా) వంటి కీలక పదవుల్లో కూడా పనిచేశాడు. గుజరాత్ ప్రభుత్వంలోని ఖేడా, పంచమహల్స్, సురేంద్రనగర్ జిల్లాల జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్‌గాను,[1][9][2] కేంద్ర ప్రభుత్వంలో కాండ్లా పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్‌గానూ పనిచేసాడు. [9]

అతను ఎన్నికల కమీషనర్‌గా 16 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను నిర్వహించాడు. వాటిలో ఐదు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉండగా నిర్వహించాడు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను కూడా నిర్వహించాడు.

2017 నవంబరు-డిసెంబరు లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ శాసనసభలకు జరిగిన ఎన్నికల సమయంలో జ్యోతి, గుజరాత్ ఎన్నికల తేదీలను ప్రకటించడంలో ఆలస్యం చేసాడు. అంతకు ముందు 2012 లో ఆ రెండు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో తేదీలను ఒకే రోజు ప్రకటించారు. గుజరాత్‌లో వరద సహాయక చర్యలు ఆలస్యం కావడమే దీనికి కారణమని జ్యోతి తర్వాత స్పష్టం చేసాడు. అయితే, వరద ప్రభావిత జిల్లాల అధికారులతో మాట్లాడిన NDTV, వరద సహాయక చర్యలు వారాల క్రితమే పూర్తయ్యాయని చెప్పింది. అతని వాదన అబద్ధమనీ తేలింది. [1] [2]

2017 డిసెంబరులో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఒక గుజరాతీ న్యూస్ ఛానెల్‌కి ఇంటర్వ్యూకు ఇవ్వడంతో మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రాహుల్ గాంధీకి భారత ఎన్నికల సంఘం (ECI) నోటీసు జారీ చేసింది. అనేక సందర్భాల్లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ప్రధాని, నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా (బిజెపి పార్టీ చీఫ్), అరుణ్ జైట్లీ (ఆర్థిక మంత్రి)లను ఇసిఐ పట్టించుకోలేదని భారత జాతీయ కాంగ్రెస్ పేర్కొంది.[10][11]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Achal Kumar Jyoti - Executive Record Sheet". Department of Personnel and Training, Government of India. Retrieved 1 September 2017.
  2. 2.0 2.1 "Chief Election Commissioner - Shri A K Joti". Election Commission of India. Retrieved 1 September 2017.
  3. "Achal Kumar Joti appointed as next Chief Election Commissioner". The Indian Express. 4 July 2017. Retrieved 2 September 2017.
  4. "Former Chief Secretary of Gujarat Achal Kumar Joti Appointed Next Chief Election Commissioner". The Wire. 4 July 2017. Retrieved 2 September 2017.
  5. "Achal Kumar Jyoti takes over as new Chief Election Commissioner". The Indian Express. 6 July 2017. Retrieved 2 September 2017.
  6. Borgohain, Sonalee, ed. (3 July 2017). "India's new Chief Election Commissioner Achal Kumar Jyoti to take charge on July 6". India Today. Retrieved 2 September 2017.
  7. "Achal Kumar Joti Appointed as Next Chief Election Commissioner". News18. 5 July 2017. Retrieved 2 September 2017.
  8. "Achal Kumar Joti appointed as CEC: Here's all you need to know about former chief secretary of Gujarat". Firstpost. 4 July 2017. Retrieved 2 September 2017.
  9. 9.0 9.1 "Shri Achal Kumar Joti takes over as new CEC" (PDF). Election Commission of India. 6 July 2017. Retrieved 5 September 2017.
  10. "Notice, not FIR, issued to Rahul Gandhi, says Election Commission". India Today (in అమెరికన్ ఇంగ్లీష్). New Delhi. 14 December 2017. Retrieved 21 January 2018.
  11. Sanyal, Anindita, ed. (14 December 2017). "What About PM, Asks Congress After Election Commission Notice To Rahul Gandhi". NDTV. New Delhi. Retrieved 21 January 2018.