2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ ఎన్నికలు 2018 డిసెంబరు 7న జరిగాయి.[3] ఈ ఎన్నికలలో పాల్గొన్నవాటిలో మొదటి శాసనసభలోని అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి, భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీలు ప్రధానమైనవి.[4] గతంలో అధికారంలోఉన్న తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని ఓడించడానికి నాలుగు ప్రతిపక్ష పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీ, సి.పి.ఐ పార్టీలు కలసి "మహా కూటమి"గా ఏర్పడి పోటీ చేసాయి.[5]
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎన్నిక ఫలితాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
నేపధ్యం
మార్చుతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి శాసస సభలో అత్యధిక సీట్లు పొందిన తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదు సంవత్సరాల కాలపరిమితి దాటడానికి తొమ్మిది నెలల ముందు (2018 సెప్టెంబరు 6) న అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని చంద్రశేఖరరావు ప్రభుత్వం నిర్ణయించింది.[3] చిరకాల ప్రత్యర్థులైన తెలుగుదేశం పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ లు కూటమిగా ఏర్పడడానికి ఈ ఎన్నికలు దోహదపడ్డాయి. మొదటి సారిగా ప్రత్యర్థులైన తె.దే.పా, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ జనసమితి, సి.పి.ఐ లతో కలసి "ప్రజాకూటమి"గా ఏర్పడ్డాయి.
ఎన్నికల విధానంలో మార్పులు
మార్చుభారత ఎన్నికల కమిషన్ "వోటర్-వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్" (VVPAT) యంత్రాలను తెలంగాన లోని శాసనసభ ఎన్నికలలో 32,574 పోలింగు స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.[6] 2018 అక్టోబరు 12న తుది ఎన్నికల ఓటర్ల జాబితా ప్రచురించిన దానిప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2,80,64,680 ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో 2.82 కోట్లు ఉంది. ప్రస్తుత ఎన్నికలలో ఓటర్లు గతంలో కంటే తక్కువగా ఉన్నారు.[7] సుమారు 2600 హిజ్రాలకు ఓటు హక్కు లభించింది.[8]
క్రమ సంఖ్య | ఓటర్ల వర్గం | ఓటర్ల జనాభా |
---|---|---|
1 | పురుషులు | 1.38 కోట్లు |
2 | స్త్రీలు | 1.35 కోట్లు |
3 | ఇతరులు | 2,663 |
- | మొత్తం ఓటర్లు | 2,80,64,680 |
ఎన్నికల షెడ్యూల్
మార్చుఎన్నికల తేదీ 2018 డిసెంబరు 7, ఫలితాల ప్రకటన 2018 డిసెంబరు 11.[9]
సంఘటన | తేదీ | రోజు |
నామినేషన్ల తేదీ | 2018 నవంబరు 12 | సోమవారం |
నామినేషన్ల చివరితేదీ | 2018 నవంబరు 19 | సోమవారం |
నామినేషన్ల పరిశీలన తేదీ | 2018 నవంబరు 20 | మంగళవారం |
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ | 2018 నవంబరు 22 | గురువారం |
పోలింగు తేదీ | 2018 డిసెంబరు 7 | శుక్రవారం |
ఓట్ల లెక్కింపు తేదీ | 2018 డిసెంబరు 11 | మంగళవారం |
ఎన్నిల ప్రక్రియ పూర్తి కావలసిన తేదీ | 2018 డిసెంబరు 13 | గురువారం |
పార్టీలు, పొత్తులు
మార్చుకూటమి/పార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసిన సీట్లు | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
తెలంగాణ రాష్ట్ర సమితి | కె. చంద్రశేఖర రావు | 119 | ||||||||
ప్రజా కూటమి | భారత జాతీయ కాంగ్రెస్ | నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి | 94 | 119 | ||||||
తెలుగుదేశం పార్టీ | ఎల్. రమణ | 14 | ||||||||
తెలంగాణ జన సమితి | కోదండరాం | 8 | ||||||||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | చాడ వెంకట్ రెడ్డి | 3 | ||||||||
భారతీయ జనతా పార్టీ | కె. లక్ష్మణ్ | 118 | ||||||||
బహుజన్ సమాజ్ పార్టీ | ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ | 106 | ||||||||
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | తమ్మినేని వీరభద్రం | 26 | ||||||||
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | అక్బరుద్దీన్ ఒవైసీ | 8 |
పోలింగు శాతం
మార్చు2014,2018 శాసన సభ ఎన్నికలలో నమోదైన పోలింగు శాతం వివరాలు[10]
వరుస సంఖ్య
నియోజకవర్గం 2014 2018 వరుస సంఖ్య
నియోజకవర్గం 2014 2018 వరుస సంఖ్య
నియోజకవర్గం 2014 2018 01 సిర్పూర్ 78.88 85.93 41 దుబ్బాక 52.53 85.99 81 నాగర్ కర్నూల్ 73.28 82.42 02 చెన్నూరు (ఎస్.సి) 72.73 82.32 42 గజ్వేల్ 83.98 88.63 82 అచ్చంపేట 70.92 81.02 03 బెల్లంపల్లి (ఎస్.సి) 73.85 83.10 43 మేడ్చల్ 60.81 60.43 83 కల్వకుర్తి 80.70 86.71 04 మంచిర్యాల 64.62 73.17 44 మల్కాజ్ గిరి 51.58 53.08 84 షాద్ నగర్ 79.94 87.56 05 ఆసిఫాబాదు (ఎస్.టి) 77.10 86.00 45 కుత్బుల్లాపూర్ 48.36 55.84 85 కొల్లాపూర్ 74.04 82.72 06 ఖానాపూర్ (ఎస్.టి) 73.77 80.50 46 కూకట్పల్లి 49.42 57.73 86 దేవరకొండ 76.12 85.98 07 ఆదిలాబాదు 63.88 81.68 47 ఉప్పల్ 49.86 51.54 87 నాగార్జునసాగర్ 79.70 86.44 08 బోధ్ (ఎస్.టి) 73.91 85.23 48 ఇబ్రహీంపట్నం 78.19 76.04 88 మిర్యాలగూడ 79.13 84.57 09 నిర్మల్ 76.89 79.27 49 ఎల్.బి.నగర్ 47.26 49.33 89 హుజూర్ నగర్ 81.18 85.96 10 ముథోల్ 78.76 83.79 50 మహేశ్వరం 53.78 55.08 90 కోదాడ 84.36 88.67 11 ఆర్మూర్ 73.61 76.41 51 రాజేంద్రనగర్ 59.40 56.82 91 సూర్యాపేట 78.86 86.06 12 బోధన్ 75.40 81.09 52 శేరిలింగంపల్లి 47.90 48.51 92 నల్గొండ 73.86 84.13 13 జుక్కల్ (ఎస్సీ) 76.43 85.29 53 చేవెళ్ళ 78.73 78.67 93 మునుగోడు 82.01 91.07 14 బాన్సువాడ 76.43 86.29 54 పరిగి 70.74 75.63 94 భువనగిరి 84.97 90.53 15 ఎల్లారెడ్డి 78.92 86.08 55 వికారాబాద్ 69.68 73.70 95 నకిరేకల్ 79.27 88.53 16 కామారెడ్డి 71.44 78.24 56 తాండూర్ 70.87 76.96 96 తుంగతుర్తి 77.69 85.91 17 నిజామాబాదు (అర్బన్) 51.85 61.77 57 ముషీరాబాద్ 54.77 51.34 97 ఆలేరు 86.10 91.33 18 నిజామాబాదు రూరల్ 72.16 78.85 58 మలక్‌పేట 47.66 42.74 98 జనగాం 79.89 85.58 19 బాల్కొండ 73.65 79.40 59 అంబర్‌పేట 55.10 55.85 99 స్టేషన్ఘనపూర్ 80.43 87.99 20 కోరుట్ల 68.33 75.55 60 ఖైరతాబాద్ 53.51 53.66 100 పాలకుర్తి 84.87 88.50 21 జగిత్యాల 71.57 78.28 61 జూబ్లీహిల్స్ 50.16 45.61 101 డోర్నకల్ 85.89 88.88 22 ధర్మపురి (ఎస్.సి) 74.30 79.96 62 సనత్ నగర్ 52.84 52.18 102 మహబూబాబాద్ 80.36 84.73 23 రామగుండం 91.76 71.75 63 నాంపల్లి 49.03 44.02 103 నర్సంపేట 87.78 90.06 24 మంథని 80.81 85.14 64 కార్వాన్ 55.57 51.76 104 పరకాల 84.70 89.28 25 పెద్దపల్లి 75.73 83.85 65 గోషామహల్ 55.35 58.61 105 వరంగల్(పశ్చిమ) 56.81 58.29 26 కరీంనగర్ 57.88 68.16 66 చార్మినార్ 56.18 40.18 106 వరంగల్(తూర్పు) 71.79 72.86 27 చొప్పదండి (ఎస్.సి) 73.08 79.35 67 చాంద్రాయణగుట్ట 51.54 46.11 107 వర్ధన్నపేట 77.79 83.37 28 వేములవాడ 73.01 80.41 68 యాకుత్‌పుర 51.37 41.24 108 భూపాలపల్లి 79.59 82.13 29 సిరిసిల్ల 73.27 80.57 69 బహదూర్‌పుర 55.83 50.40 109 ములుగు 77.67 82.53 30 మానకొండూర్ 80.04 85.19 70 సికింద్రాబాద్ 56.96 49.05 110 పినపాక 78.30 81.88 31 హుజూరాబాద్ 77.12 84.00 71 కంటోన్మెంట్ 50.55 48.90 111 ఇల్లందు 79.21 82.09 32 హుస్నాబాద్ 80.34 83.13 72 కొడంగల్ 69.87 81.44 112 ఖమ్మం 69.04 73.98 33 సిద్దిపేట 74.18 79.00 73 నారాయణపేట 68.28 79.35 113 పాలేరు 90.04 90.99 34 మెదక్ 77.56 85.88 74 మహబూబ్‌నగర్ 66.07 73.84 114 మధిర 89.50 91.65 35 నారాయణ్ ఖేడ్ 77.33 83.89 75 జడ్చర్ల 76.09 82.11 115 వైరా 87.45 88.83 36 ఆందోల్ 79.45 88.96 76 దేవరకద్ర 71.67 84.56 116 సత్తుపల్లి 85.20 88.65 37 నర్సాపూర్ 85.77 90.53 77 మక్తల్ 67.28 77.64 117 కొత్తగూడెం 72.72 81.19 38 జహీరాబాద్ 70.72 80.91 78 వనపర్తి 70.29 81.65 118 అశ్వారావుపేట 85.92 87.85 39 సంగారెడ్డి 73.84 82.25 79 గద్వాల్ 80.49 83.41 119 భద్రాచలం 76.26 80.03 40 పటాన్చెరు 67.86 75.60 80 అలంపూర్ 75.50 82.31 మొత్తం 71.37 73.20
ఎగ్జిట్ పోల్స్
మార్చుపోలింగు సంస్థ | తె.రా.స | కాంగ్రెస్+ | భా.జ.పా | ఇతరులు | వనరులు |
---|---|---|---|---|---|
CNX - టైమ్స్ నౌ | 99 | 7 | 9 | [11] | |
ఇండియా టి.వి | 82-90 | 32-41 | 6-8 | 6-8 | [11] |
ఆక్సిస్ మై ఇండియా - ఇండియా టుడే, ఆజ్ తక్ | 79-91 | 21-33 | 1-3 | 4-7 | [11] |
రిపబ్లిక్ జన్ కీ బాత్ | 90-100 | 38-52 | 4-7 | 8-14 | [11] |
సి.వోటర్ - రిపబ్లిక్ టి.వి | 58-70 | 47-59 | 5 | 1-13 | [11] |
లగడపాటి రాజగోపాల్ సర్వే | 35 ( ) | 65 ( ) | 7 ( ) | 7 ( ) | [12] |
ఫలితాలు
మార్చుతెలంగాణ ఎన్నికలలో 88 చోట్ల విజయం సాధించి టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీ శ్రేణులతో భేటీ అయిన అనంతరం కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజ్‌భవన్‌కు వెళ్లాడు. గవర్నర్ నరసింహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు.
ఓటు భాగస్వామ్యం
మార్చుసీటు భాగస్వామ్యం
మార్చుపార్టీల వారీగా ఫలితాలు
మార్చుపార్టీలు, కూటములు | ఓట్లు | సీట్లు | ||||
---|---|---|---|---|---|---|
ఓట్లు | % | +/- | గెలిచినవి | +/- | ||
తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్) | 9700749 | 46.9 | 33.2 | 88 | 25 | |
భారత జాతీయ కాంగ్రెస్ | 5883111 | 28.4 | 16.7 | 19 | 2 | |
తెలుగుదేశం పార్టీ | 725845 | 3.5 | 29 | 2 | 13 | |
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) | 561089 | 2.7 | 1.2 | 7 | ||
భారతీయ జనతా పార్టీ | 1450456 | 7 | 2.9 | 1 | 4 | |
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) | 159141 | 0.8 | 1 | 1 | ||
బహుజన సమాజ్ పార్టీ (BSP) | 428430 | 2.1 | 0 | 2 | ||
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) | 83215 | 0.4 | 0.1 | 0 | 1 | |
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (CPM) | 91099 | 0.4 | 0.4 | 0 | 1 | |
ఇతరులు (IND) | 673694 | 3.3 | 1 | |||
మొత్తం స్థానాలు | 119 |
పార్టీ | తె.రా.స | కాంగ్రెస్ | తె.దే.పా | మజ్లిస్ | భా.జ.పా | ఇతరులు |
నాయకుడు | కల్వకుంట్ల చంద్రశేఖరరావు | ఎన్.ఉత్తమకుమార్‌రెడ్డి | ఎల్.రమణ | అక్బరుద్దీన్ ఒవైసీ | కె.లక్ష్మణ్ | ఇతరులు |
పొందిన సీట్లు | ||||||
88 / 119 |
19 / 119 |
2 / 119 |
7 / 119 |
1 / 119 |
2 / 119 |
ఎన్నికైన అభ్యర్థులు
మార్చుగత ఎన్నికలు
మార్చుగమనిక: 2014 శాసనసభ ఎన్నికలకు మునుపు తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భాగముగానుండెను.ఈ దిగువన ఇవ్వబడిన ఫలితములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో జరిగినవి
సంవత్సరము | శాసన సభ ఎన్నికలు | కాంగ్రెస్ | తె.దే.పా. | వై.కా.పా. | తె.రా.స. | భా.జ.పా. | వామ పక్షాలు | మజ్లిస్ | ప్రజారాజ్యం | ఇతరులు |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1983 | 7-వ శాసన సభ | 60 | 201 | -- | -- | 3 | 9 | - | -- | 21 |
1985 | 8-వ శాసన సభ | 50 | 202 | -- | -- | 8 | 22 | - | -- | 12 |
1989 | 9-వ శాసన సభ | 181 | 74 | -- | -- | 5 | 14 | 4 | -- | 15 |
1994 | 10-వ శాసన సభ | 26 | 216 | -- | -- | 3 | 34 | 1 | -- | 14 |
1999 | 11-వ శాసన సభ | 91 | 185 | -- | -- | 10 | 2 | 4 | -- | 5 |
2004 | 12-వ శాసన సభ | 185 | 47 | -- | 26 | 2 | 15 | 4 | -- | 4 |
2009 | 13-వ శాసన సభ | 156 | 92 | -- | 10 | 2 | 5 | 7 | 18 | 4 |
2014 | 14-వ శాసన సభ | 22 | 117 | 70 | 63 | 9 | 2 | 7 | -- | 4 |
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పిమ్మట జరిగిన మొట్టమొదటి ఎన్నికలు 2018 డిశంబరు. స్థానాల మొత్తము 119. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన స్థానాలు-60
సంవత్సరము | శాసన సభ ఎన్నికలు | తె.రా.స. | కాంగ్రెస్ | తె.దే.పా. | భా.జ.పా. | మజ్లిస్ | వామ పక్షాలు | వై.కా.పా | ఇతరులు |
---|---|---|---|---|---|---|---|---|---|
2014 | 1-వ శాసన సభ | 63 | 22 | 15 | 5 | 7 | 2 | 3 | 2 |
2018 | 2-వ శాసన సభ | 88 | 19 | 2 | 1 | 7 | 1 | -- | 1 |
మూలాలు
మార్చు- ↑ KCR to contest from Gajwel
- ↑ Congress ready to align with TDP in Telangana, says AICC in-charge
- ↑ 3.0 3.1 "KCR's early election gamble gives enough ammo to TRS".
- ↑ "Telangana elections: TOI does SWOT analysis of parties in fray".
- ↑ "Congress, TDP, Left form grand alliance to fight Telangana election". 2018-09-11.
- ↑ Rajeev, M. (2018-11-02). "Randomisation of poll equipment soon". The Hindu.
- ↑ "Purified Electoral Rolls: Poll Body Chief On Deleting Telangana Voters".
- ↑ "Only 2,600 transgenders in voters' list due to lack of documentation".
- ↑ "Election Commission Issues Notificatio for Telangana Assembly Elections".
- ↑ "poll percentagein telangana elections 2018".[permanent dead link]
- ↑ 11.0 11.1 11.2 11.3 11.4 "Election exit polls results 2018". Hindustan Times. 7 December 2018.
- ↑ "Lagadapati Rajagopal survey gives congress-alliance majority ."
- ↑ A. B. P. Desam (11 October 2023). "తెలంగాణలో గత ఎన్నికల ముఖచిత్రం-2014-18లో గెలిచిన స్థానాలు-పార్టీల ఓటు శాతం". Archived from the original on 5 March 2024. Retrieved 5 March 2024.