ఓ మనిషి కథ

2014లో రాధాస్వామి ఆవుల దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం.

ఓ మనిషి కథ 2014, డిసెంబరు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఓం శివ్ ఫిలిమ్స్ పతాకంపై బాలా భాయ్ చో వాటియా నిర్మాణ సారధ్యంలో రాధాస్వామి ఆవుల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జగపతిబాబు, కళ్యాణి నటించగా విజయ్ కురాకుల సంగీతం అందించాడు.[1] మనిషిలో ఉండే మూడు గుణాలైన ఉత్తముడు, మధ్యముడు, అధముడు అనే వాటిని ఆధారం చేసుకొని ఈ చిత్రం రూపొందించబడింది.

ఓ మనిషి కథ
O Manishi Katha Movie Poster.jpg
ఓ మనిషి కథ సినిమా పోస్టర్
దర్శకత్వంరాధాస్వామి ఆవుల
కథా రచయితఆది గణేష్ (మాటలు)
రాధాస్వామి ఆవుల
(కథ/కథనం)
నిర్మాతబాలా భాయ్ చో వాటియా
తారాగణంజగపతిబాబు
కళ్యాణి
ఛాయాగ్రహణంజి. రంగనాథ్
ఎడిటర్కె. వెంకటేశ్వర్లు
సంగీతంవిజయ్ కురాకుల
ప్రొడక్షన్
కంపెనీ
ఓం శివ్ ఫిలిమ్స్
విడుదల తేదీ
2014 డిసెంబరు 19 (2014-12-19)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

పల్లెటూరులో చిన్న హోటల్ నడుపుకుంటూ జీవితం సాగిస్తున్న రాము (జగపతి బాబు), హోటల్ కు పాలు అమ్ముతున్న వ్యక్తి కూతురు సీతా మహాలక్ష్మి (కల్యాణి)ని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటాడు. సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. దాంతో సీత ఆత్మహత్య చేసుకుంటుంది. సీత ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి..? సీత ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని రాము ఏం చేశాడనేది మిగతా కథ.[2]

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • కథ, కథనం, దర్శకత్వం: రాధాస్వామి ఆవుల
  • నిర్మాత: బాలా భాయ్ చో వాటియా
  • మాటలు: ఆది గణేష్
  • సంగీతం: విజయ్ కూరాకుల
  • పాటలు: సుద్దాల అశోక్ తేజ
  • ఛాయాగ్రహణం: జి. రంగనాథ్
  • కూర్పు: కె. వెంకటేశ్వర్లు
  • నిర్మాణ సంస్థ: ఓం శివ్ ఫిలిమ్స్

పాటలుసవరించు

విజయ్ కూరాకుల సంగీతం అందించిన ఈ చిత్రానికి సుద్దాల అశోక్ తేజ పాటలను అందించాడు. ఈ చిత్రంలోని పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "నెమ్మదిగా నెమ్మదిగా"  దీపు, గీతా మాధురి 4:26
2. "సీతలేని రాముని కథ"  సురేష్ 3:34
3. "కలలా వచ్చి వెలుగే ఇచ్చి"  కృష్ణ చైతన్య 3:32
4. "ఏ మట్టితో చేసావురా బ్రహ్మ"  బాలాజీ 3:43
5. "అనాధకు రాఖీ కట్టి"  కృష్ణ చైతన్య 0:45
6. "కరుణకు నువ్వు చిరునామా"  బాలాజీ 0:42
మొత్తం నిడివి:
17:01

మూలాలుసవరించు

  1. The New Indian Express, Entertainment (Telugu) (15 December 2014). "O Manishi Katha ready". Archived from the original on 22 ఆగస్టు 2019. Retrieved 22 August 2019.
  2. The Hindu, Features (19 December 2014). "O Manishi Katha: Oft told tale". Y. Sunita Chowdhary. Archived from the original on 22 ఆగస్టు 2019. Retrieved 22 August 2019.

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఓ_మనిషి_కథ&oldid=3268907" నుండి వెలికితీశారు