ప్రధాన మెనూను తెరువు

గీతా మాధురి

నేపథ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి

[1]

గీతా మాధురి
GeetaMadhuri.jpg
జననంశొంఠి గీతా మాధురి
(1985-08-24) 1985 ఆగస్టు 24 (వయస్సు: 33  సంవత్సరాలు)
వృత్తిగాయని
అనువాద కళాకారిణి
టీవీ వ్యాఖ్యాత
క్రియాశీలక సంవత్సరాలు2006-ఇప్పటివరకు

శొంఠి గీతా మాధురి ఒక తెలుగు సినీ గాయని. తెలుగు సినిమాలలో అనేక శ్రావ్యమైన పాటలు పాడింది. నచ్చావులే(2008) సినిమాలో ఆమె పాడిన నిన్నే నిన్నే పాటతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. ఈ పాటకుగాను మొదటి నంది అవార్డు అందుకుంది. మాటీవిలో ప్రసారమైన సూపర్ సింగర్ అనే షో లో కూడా ఆమె పాల్గొంది.

నేపథ్యంసవరించు

గీతా మాధురి తల్లిదండ్రులు ప్రభాకర్, లక్ష్మిలకు ఆమె ఏకైక సంతానం. ఆమె తండ్రి ప్రభాకర్ ఎస్‌బీహెచ్ బ్యాంక్ లో పనిచేస్తున్నారు. వారిది గోదావరి ప్రాంతానికి చెందిన కుటుంబం. ఆమె చాలా చిన్న వయసులోనే హైదరాబాద్ కు మారిపోయారు. ఆమె ప్రాథమిక విద్య హైదరాబాద్, వనస్థలిపురం లోని లయోలా పాఠశాల లో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచే ఆమె సంగీతం అభ్యసించడం మొదలుపెట్టారు. లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో కచ్చర్లకోట పద్మావతి, రామాచారిల వద్ద చిన్న వయసు నుండే శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాలలో శిక్షణ పొందారు గీత. ఈటీవి లో ప్రసారమైన "సై సింగర్స్ ఛాలెంజ్ "లో ఆమె ఫైనలిస్ట్ గా నిలిచింది.

కులశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమలేఖ రాశా సినిమాలోని ఒక పాటతో ఆమె సినీ రంగప్రవేశం చేశారు.

వ్యక్తిగత జీవితంసవరించు

గీతా ఫిబ్రవరి 9 2014 లో కథానాయకుడు ఆనంద కృష్ణ నందును నాగోల్ లో వివాహం చేసుకున్నారు. నందు 100% లవ్(2011) సినిమాలో ఆజిత్ గా ప్రాచుర్యం పొందారు. వీరిద్దరూ కలసి అదితి అనే లఘు చిత్రం(షార్ట్ ఫిలిం)లో కథానాయకుడు, కథానాయికగా నటించారు.ఓ లఘుచిత్రంలో కలిసి నటించిన సందర్భంలో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువైపుల పెద్దలు ఈ ప్రేమకు అంగీకారం తెలిపారు.

ndi Award for Best Female Playback Singer|నంది ఉత్తమ నేపధ్యగాయని]] పురస్కారము.[2]

మూలాలుసవరించు

  1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; undefined అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. "Nandi awards 2008 announced - Telugu cinema news". Idlebrain.com. 2008-10-24. Retrieved 2012-02-29.
  3. "Santosham film awards 2009 - Telugu cinema function". Idlebrain.com. 2009-08-21. Retrieved 2012-02-29.
  4. "South Scope Awards Function". Supergoodmovies.com. 2010-09-20. Retrieved 2012-02-29.