కంకర (Crushed stone - క్రష్డ్ స్టోన్) అనేది సాధారణంగా ఒక రాక్ మైనింగ్ ద్వారా తీసిన పెద్ద రాళ్ళను లేదా బండలను పగులగొట్టడం ద్వారా లేదా నలగగొట్టడం ద్వారా కావలసిన పరిమాణంలోకి చిన్న ముక్కలుగా ఉత్పత్తి చేయబడిన నిర్మాణ సముదాయం యొక్క ఒక రూపం. పెద్ద రాళ్ళను సుత్తి, సమ్మెట వంటి పరికరాలను ఉపయోగించి పగులగొట్టడం ద్వారాను, కంకరమిల్లు (క్రషర్) వంటి యంత్ర పరికరాలతో గ్రైండ్ చేయడం ద్వారా చిన్న ముక్కలుగా చేస్తారు. ఇది రోడ్లు, రైల్వేలు, వంతెనలు, భవనాలు, ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో సహా నిర్మాణంలో విస్తృతంగా ఉపయోగించే పదార్థం. రాతి గనులలో ఉన్న అతి పెద్ద రాతి బండలను పేల్చివేయడం ద్వారా చిన్న రాళ్ళగా వెలికితీసి వాటిని నిర్మాణాల కొరకు అవసరమైన సైజులలోకి వీటిని క్రషర్ వంటి యంత్రపరికరాల ద్వారా తయారు చేస్తారు. అవసరాలను బట్టి కంకరను 1/4 అంగుళాల కంటే తక్కువ నుండి కొన్ని అంగుళాల అంగుళాల వ్యాసం వరకు వివిధ పరిమాణాలలో తయారు చేసి వాటిని గ్రేడులుగా వర్గీకరిస్తారు. కొన్ని సాధారణ రకాల కంకర రాయిలో సున్నపురాయి, గులక, గ్రానైట్, ట్రాప్ రాక్, గ్రావెల్ ఉన్నాయి. నిర్మాణ కంకరకు ఉపయోగించే రాయిని తెలుగులో కన్నేరాయి అంటారు. కంకర రాయి అనేది నిర్మాణాలలో ఉపయోగించే ఒక మన్నికైన, గట్టిదైన, విలువయిన రాయి, ఇది వివిధ నిర్మాణ అనువర్తనాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది.

నిర్మాణములలో ఉపయోగించే 20 మిల్లీమీటర్ల కంకర.
పెన్సిల్వేనియా సమీపంలో ఉన్న కంకర రాళ్ల క్వారీ.
టన్నెల్ ఎ అప్రోచ్ స్ట్రక్చర్ యొక్క ఉపపునాదికి 6-అంగుళాల కంకరను వేసి కుదించుచున్నారు.
రైలు మార్గంలో పరచిన కంకర

ఉపయోగాలు

మార్చు
  • కోణీయ కంకర పక్కారోడ్డు వేయు రహదారి నిర్మాణానికి కీలకమైన పదార్థం, ఇది దాని బలం కోసం స్వకీయమైన రాళ్ల కోణీయ ముఖాల ఇంటర్‌లాకింగ్‌పై ఆధారపడి ఉంటుంది.[1]
  • గోడలు కట్టుటకు ఉపయోగించే రాతిముక్కలుగా
  • రైల్‌రోడ్ ట్రాక్ బ్యాలస్ట్‌గా
  • ఫిల్టర్ రాయిగా
  • తారు రోడ్డు వేసేందుకు, కాంక్రీటులో మిశ్రమ పదార్థంగా.[2]
  • ల్యాండ్‌స్కేపింగ్‌లో గ్రౌండ్‌కవర్‌గా, నడకదారులకు, భూకోత నియంత్రణకు, నీటి సంరక్షణకు, కలుపు పెరగకుండా ఉండేందుకు, అందంగా కనిపించేందుకు కంకరను ఉపయోగిస్తారు. ఇది తరచుగా రాక్ గార్డెన్స్, కాక్టస్ గార్డెన్స్‌లో ఉపయోగించబడుతుంది.[3]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Max Lay (1998). Handbook of Road Technology (Transportation Studies). Washington, DC: Taylor & Francis. p. 28. ISBN 90-5699-159-0. The strength and stiffness of the course of compacted angular stone came from the mechanical interlock which developed between individual pieces of stone. The principle is still used in modem road construction and since 1820 McAdam's name has been remembered by the term macadam used to describe the courses of unbound angular stone which he introduced.
  2. Cunningham, William D.; McKetta, John J. (1976). Encyclopedia of chemical processing and design. New York, N.Y: Marcel Dekker. p. 284. ISBN 0-8247-2605-7. Crushed stone can be used without binder for a variety of construction or industrial applications, or it may be mixed with a matrix binding material, such as bituminous or portland cement.
  3. Cornell University: Gardening Resources - mulches. accessed 5.10.2011
"https://te.wikipedia.org/w/index.php?title=కంకర&oldid=4339292" నుండి వెలికితీశారు