కంచిపల్లి

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం లోని గ్రామం


కంచిపల్లి, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం . ఇది ఒక ముఖ్యమైన [1] ఈ గ్రామం సగటు భారత దేశానికి ఉదాహరణ.

కంచిపల్లి
రెవిన్యూ గ్రామం
కంచిపల్లి is located in Andhra Pradesh
కంచిపల్లి
కంచిపల్లి
నిర్దేశాంకాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926Coordinates: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగిద్దలూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం947 హె. (2,340 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,280
 • సాంద్రత240/కి.మీ2 (620/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08405 Edit this at Wikidata)
పిన్(PIN)523357 Edit this at Wikidata

గ్రామ చరిత్రసవరించు

ఈ గ్రామం మొదట కర్నూలు జిల్లాలో ఉండేది. అప్పట్లో గ్రామంలో ప్రధాన రహదారి వెంట కాలువలూ, రీడింగ్ రూం, సామూహిక మరుగు దొడ్లూ, పంచాయతీ కార్యాలయం నిర్మించారు, పాఠశాలను ఏర్పరిచారు. తారు, సిమెంట్ రోడ్లు లేకున్నా రహదారులను చక్కగా తీర్చి దిద్దారు. విద్యుత్తు సౌకర్యంగూడా ఏర్పాటు చేయటంతో ఈ చూడచక్కని పల్లెను, ప్రభుత్వం ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసింది. ఆ సమయంలో శ్రీ వేమిరెడ్డి పిచ్చి రంగారెడ్డి గ్రామ సర్పంచిగా ఉన్నారు. గిద్దలూరు ప్రాంతం ప్రకాశం జిల్లాలో కలిసిన తర్వాత గూడా గ్రామంలో అభివృద్ధివీచికలు కొనసాగాయి. అప్పుడు గూడా ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా ప్రకటించారు. అప్పటి సర్పంచ్ దప్పిలి శ్రీనివాసరెడ్డి రు.25 లక్షలతో సిమెంట్ రహదారులు ఏర్పరిచారు.ప్రస్తుతం గ్రామంలో బీ.సీ కాలనీలో ఒక్క రహదారి తప్ప మిగతా అన్ని వీధులలో జన్మభూమి పధకం ద్వారా సిమెంట్ రహదారులతో పాటు పక్కా కాలువలు నిర్మించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి, పైప్ లైన్లు వేసి గృహాలకు మంచినీటి సరఫరా చేస్తున్నారు.యస్.సీ కాలనీలో సిమెంట్ రహదారులు నిర్మించారు.గ్రామంలో ప్రధాన రహదారిని చట్రెడ్డిపల్లె నుండి కంచిపల్లె వరకూ సిమెంట్ రహదారిగా మార్చారు. [1]

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

ముండ్లపాడు 4.6 కి.మీ, అంబవరము 4.9 కి.మీ, నరవ 6.1 కి.మీ, కొమ్మునూరు 6.9 కి.మీ, గిద్దలూరు 7.5 కి.మీ.

సమీప పట్టణాలుసవరించు

గిద్దలూరు 6.6 కి.మీ, రాచెర్ల 16.6 కి.మీ, కొమరోలు 18.2 కి.మీ, బెస్తవారిపేట 34.2 కి.మీ.

సమీప మండలాలుసవరించు

ఉత్తరాన రాచెర్ల మండలం, తూర్పున కొమరోలు మండలం, దక్షణాన కలశపాడు మండలం, పశ్చిమాన మహానంది మండలం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

రంగారెడ్డి చెరువు:- వెంకటాపురం గ్రామ సమీప అడవిలో కురిసే వర్షాలకు ఎనుమలేరు వరద ప్రవాహంతో ఈ చెరువు నిండుతుంది. ఈ చెరువుకు 175 ఎకరాల ఆయకట్టు ఉంది. 2013 తరువాత ఈ చెరువు 2016 సెప్టెంబరు-26కి నిండి అలుగు పారినది. ఈ చెరువు నిండటంతో కంచిపల్లె గ్రామంతోపాటు, సమీప గ్రామాలయిన రాజుపేట, కృష్ణంశెట్టిపల్లె గ్రామాలలో గూడా భూగర్భజలాలు అభివృద్ధి చెందుతవి. [2]

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,463.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,284, మహిళల సంఖ్య 1,179, గ్రామంలో నివాస గృహాలు 580 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 947 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 2,280 - పురుషుల సంఖ్య 1,128 - స్త్రీల సంఖ్య 1,152 - గృహాల సంఖ్య 620
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు

[1] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-26; 4వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2016, సెప్టెంబరు-27; 5వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=కంచిపల్లి&oldid=3119128" నుండి వెలికితీశారు