కంచి వాసుదేవరావు తెలుగు రచయిత. ఆయన ఆరు దశాబ్దాల పాటు తెలుగునాట వార, మాస, దిన పత్రికలలో పాత్రికేయునిగా పనిచేసారు. [1][2]

జీవిత విశేషాలుసవరించు

ఆయన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 1930, జూన్ 6న జన్మించారు. మచిలీపట్నం హిందూ కళాశాలలో చదివారు. తర్వాత విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో డిప్లొమా ఇన ఫార్మసీ చేశారు. అయినా విద్యార్హతకు తగిన వృత్తిలో కాక, చిన్ననాటి నుంచి తనను ప్రభావితం చేసిన జాతీయోద్యమ పరిస్థితుల ప్రభావంతో, పత్రికా రచయితగా జీవితం ప్రారంభించారు.[1]

పత్రికా రంగంసవరించు

ఆయన 1957లో కృష్ణా పత్రిక కు సబ్ ఎడిటరుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌లో పనిచేశారు. తరువాత తన సహ విద్యార్థి, సుప్రసిద్ధ నటుడు, నాటక చరిత్రకారుడు మిక్కిలినేని సాహచర్యంతో విశాల ప్రపంచ దృక్పథంతో, కమ్యూనిజం, హిందూయిజం, గాంధీయిజం గురించిన అవగాహన పెంచుకున్నారు. మంచి సృజనాత్మకతతో 1946లోనే కథారచనకు శ్రీకారం చుట్టారు. ఆనాటి ‘ఆనందవాణి’లో తొలికథ ‘జాలి గుండె’ అచ్చయింది. ఆ స్ఫూర్తితో దాదాపు నూట యాభై వరకు కథలు, మూడు నవలలు రచించారు. వాటిలో "శాపగ్రస్తులు" నవల పాఠకాదరణ పొందినది. ఆయనకు మంచి రచయితగా, సాహిత్యవేత్తగా కూడా గుర్తింపు తెచ్చింది. 1957 నుండి 1967 వరకు "చుక్కాని" పత్రికకు సంపాదకునిగా పనిచేసారు. ఆయన "సమాచారం" పత్రికలో కొంతకాలం పనిచేసారు. 1976 నుంచి 1988 వరకు ఈనాడు విశాఖపట్నం యూనిట్‌లో సబ్‌ఎడిటర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు.[1]

ఆయన గ్రేటర్‌ విశాఖ నగర శివారు ఆరిలోవలో సాధారణ ఆవాసంలోనే జీవితం గడిపారు.

రచనలుసవరించు

 • వ్యక్తులూ వ్యక్తిత్వాలు [3]
 • తెలుగు పత్రికా రంగం - 1832-2002
 • మహాత్ముని జీవితంలో కడపటి సంవత్సరం - పత్రికలో ధారావాహిక.[4]

పురస్కారాలుసవరించు

 • జీవనసాఫల్య పురస్కారం
 • గంథం సీతారామాంజనేయులు స్మారక అవార్డు.
 • గంథం నాగ సుబ్రహ్మణ్యం స్మారక అవార్డు.
 • భోగరాజు నరసింహారావు స్మారక అవార్డు
 • జ్యేష్ట లిటరరీ అవార్డు
 • విశాఖ సీనియర్‌ జర్నలిస్ట్‌ అవార్డు

మరణంసవరించు

ఆయన 2016 మే 12 న మరణించారు.[5]

మూలాలుసవరించు

 1. 1.0 1.1 1.2 "ఆదర్శ పాత్రికేయుడు". బి.వి. అప్పారావు. ఆంధ్రజ్యోతి. 17 June 2016. Retrieved 18 June 2016.
 2. "Kanchi Vasudeva Rao feted". SPECIAL CORRESPONDENT. The HIndu. 18 June 2016. Retrieved 31 October 2011.
 3. మనో ఫలకాలపై మహనీయుల వ్యక్తిత్వాలు -శైలజామిత్ర 04/05/2013[permanent dead link]
 4. "nsight into Gandhi's thoughts". SPECIAL CORRESPONDENT. The Hindu. 18 June 2016. Retrieved 7 June 2016.
 5. Journalist Vasudevarao dead[permanent dead link]

ఇతర లింకులుసవరించు