కందికుంట వెంకట ప్రసాద్

కందికుంట వెంకట ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కదిరి నుండి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1]

కందికుంట వెంకట ప్రసాద్
కందికుంట వెంకట ప్రసాద్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు పెడబల్లి వెంకట సిద్దారెడ్డి
నియోజకవర్గం కదిరి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
ముందు జొన్న రామయ్య
తరువాత అత్తర్ చాంద్ బాషా
నియోజకవర్గం కదిరి

వ్యక్తిగత వివరాలు

జననం 1 జనవరి 1967
కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు రఘురామప్ప
జీవిత భాగస్వామి యశోద దేవి
నివాసం 3-5, రామస్వామి ఆలయం పక్కన, హిందూపూర్ రోడ్, కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

కందికుంట వెంకట ప్రసాద్ 2004లో రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కదిరి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత టీడీపీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బత్తల వెంకటరమణపై 14977 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై ఆ తరువాత 2014, 2019 లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు.[2]

వెంకట ప్రసాద్ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కదిరి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి బి.యస్.మక్బూల్ పై 6265 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. EENADU (30 March 2024). "అనంత తెదేపా అభ్యర్థుల ఖరారు". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  3. Prajasakthi (18 April 2024). "కదిరిలో 'కందికుంట' మార్క్‌". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  4. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kadiri". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.