కందుకూర్ రెవెన్యూ డివిజను

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం.

కందుకూర్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. రంగారెడ్డి జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం కందుకూర్ పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలోని మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

కందుకూర్ రెవెన్యూ డివిజను
కందుకూర్ ఊరి బోర్డు
కందుకూర్ ఊరి బోర్డు
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి

వివరాలు

మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]

పరిపాలన

మార్చు

కందుకూర్ డివిజన్‌లోని మండలాలు:[5]

క్ర.సం కందుకూర్ రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 సరూర్‌నగర్‌ మండలం 12 రెవెన్యూ గ్రామాలు
2 బాలాపూర్ మండలం 17 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
3 మహేశ్వరం మండలం 33 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
4 కందుకూర్‌ మండలం 30 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
5 కడ్తాల్ మండలం 15 రెవెన్యూ గ్రామాలు
6 ఆమన‌గల్ మండలం 9 రెవెన్యూ గ్రామాలు
7 తలకొండపల్లి మండలం 20 రెవెన్యూ గ్రామాలు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Suryapet district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 11 October 2016. Retrieved 2022-10-19.
  3. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-10-19.
  4. "DIVISIONS | RangaReddy District Government of Telangana | India". Archived from the original on 2021-11-27. Retrieved 2022-10-19.
  5. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-10-19.