కట్టమంచి

చిత్తూరు నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామం

కట్టమంచి, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్టం, చిత్తూరు జిల్లా, చిత్తూరు మండలంలోని గ్రామం. ఇది చిత్తూరు నగరపాలకసంస్థలో విలీనమైవ శివారు గ్రామం [1] [2] ఈ గ్రామం నీవా నది ఒడ్డున ఉంది. ఇది చిత్తూరు నుండి తిరుపతి, కడప, కర్నూలు నగరాలను కలిపే జాతీయ రహదారిపై ఉంది. కట్టమంచిలో మాట్లాడే భాష తెలుగు. ఇది ఒక పుణ్యక్షేత్రం.[3]

గ్రామ ప్రముఖులు

మార్చు
 
కట్టమంచి రామలింగారెడ్డి :సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది

కట్టమంచి రామలింగారెడ్డి, సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన కట్టమంచి రామలింగారెడ్డి ( 1880 డిసెంబరు 10 - 1951 ఫిబ్రవరి 24) ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు.1921 తరువాత రాజకీయాల్లో పాల్గొన్నాడు. 1922 లో ఒక స్థానానికి జరిగిన ఉపఎన్నికలో గెలిచి శాసనసభలో ప్రవేశించాడు. ఆ తర్వాత 2వ సారి చిత్తూరునుండి అత్యధిక మెజారిటీతో గెలుపొందాడు. 1921-25 మధ్య కాలంలో మద్రాసు కౌన్సిల్‌ సభ్యుడిగా ఉన్నాడు. జస్టిస్‌ పార్టీలో కీలక పాత్ర పోషించిన అతను తర్వాత యునైటెడ్‌ నేషనలిస్టు పార్టీలో చేరి డిప్యూటీ లీడర్‌గా వ్యవహరించాడు. 1935 లో కాంగ్రెస్‌ తరఫున మద్రాసు కౌన్సిల్‌కు ఎన్నికయ్యాడు. 1936 లో కొంతకాలంపాటు చిత్తూరు జిల్లా బోర్డు ఛైర్మన్‌గా పనిచేశాడు. శాసన సభలో సి.ఆర్.రెడ్డి ప్రసంగాలు చాలా గొప్పగా ఉండేవి.

చూడవలసిన ప్రదేశాలు

మార్చు
  • కులందేశ్వర దేవాలయం - ఇది శివునికి అంకితం చేసిన ప్రసిద్ధి చెందిన ఆలయం. [4]
  • శ్రీ సాయిబాబా మందిరం: సర్వమతాలకు ప్రతీకగా, వర్ణరంజిత కట్టడాలతో, "సబ్ కా మాలిక్ ఏక్ హై" అనే ప్రవచనానికి దీటుగా, ఈ మందిరం విరాజిల్లుతోంది. ఈ ఆలయ నిర్వాహకులైన శ్రీ సి.కె.బాబు దంపతుల ఆధ్వర్యంలో, నిర్మితమై, దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతోందీ ఆలయం.

మూలాలు

మార్చు
  1. Naidu, Pathipati Neerajakshula (12 June 1994). "Chola and Vijayanagara Art: A Comparative Study of Temples of Chittoor District". New Era Publications – via Google Books.
  2. "Municipal Corporation, Chittoore- Newsletter for the month of September 2015" (PDF). chittoor.cdma.ap.gov.in. Government of Andhra Pradesh.[permanent dead link]
  3. Rangarajan, Ad (4 June 2020). "More hotspots emerge in Chittoor, Kadapa" – via www.thehindu.com.
  4. https://books.google.co.in/books?id=GdjVAAAAMAAJ&q=kattamanchi&redir_esc=y

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కట్టమంచి&oldid=3980779" నుండి వెలికితీశారు