కడప విమానాశ్రయం
కడపలో 1953 నుంచి విమానాశ్రయం వున్నా సౌకర్యాలు తక్కువగా వుండేవి. 1060 ఎకరాల్లో విస్తరించటం, ఆధునీకరించిన ఈ విమానాశ్రయం నుండి 2015 జూన్ 7 న కార్యకలాపాలు మరలా ప్రారంభమయ్యాయి.
కడప విమానాశ్రయం | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | పౌరసేవ | ||||||||||
కార్యనిర్వాహకత్వం | భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ | ||||||||||
ప్రదేశం | కడప | ||||||||||
ఎత్తు AMSL | 430 ft / 131 మీ. | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 14°30′36″N 078°46′22″E / 14.51000°N 78.77278°E | ||||||||||
పటం | |||||||||||
రన్‌వే | |||||||||||
| |||||||||||
ఆధునీకరణ , పునః ప్రారంభము
మార్చుకడపలో అన్ని సౌకర్యాలతో విమానాశ్రయాన్ని నిర్మించాలని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి రూ. 33 కోట్లను ఒకే విడతగా విడుదల చేశారు. 1060 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించేందుకు ప్రణాళిక రచించారు. రెండు విడతల్లో విమానాశ్రయం నిర్మాణపు పనులను చేపట్టారు. కడప విమానాశ్రయాన్ని 2015 జూన్ 7 ఆదివారం ఉదయం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించాడు. అనంతరం అప్పటి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, సైన్స్ అండ్‌టెక్నాలజీశాఖ మంత్రి సుజనాచౌదరి జ్యోతి ప్రజ్వలన చేశారు.[2] విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు నేతలు ప్రత్యేక విమానంలో వచ్చారు. మొదటి సర్వీసుగా ఎయిర్ పెగాసెస్ సంస్థకు చెందిన ఏటీఆర్ 72 విమానం బెంగుళూరు నుంచి ఉదయం 10.40 కి బయలుదేరి 11.30 గంటలకు కడపలో ల్యాండ్ అయినది. 11.50 గంటలకు కడపలో టేకాఫ్ తీసుకుని 12.35 గంటలకు బెంగళూరు చేరినది. మొదటి సారిగా బెంగుళూరు నుండి ఎయిర్ పెగసస్ విమానయాన సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది. వారంలో మూడుసార్లు బెంగుళూరు నుండి కడపకు విమానాలు నడుపుతామని ఈ సంస్థ ప్రకటించింది.
నిర్మాణము
మార్చుకడప విమానాశ్రం 1953లో 669.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 1980వ దశకంలో వాయుదూత్, కడప నుండి హైదరాబాదుకు కొంతకాలం పాటు విమాన సర్వీసులను నడిపింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు నిరుపయోగంగా పడి ఉన్న ఈ విమానాశ్రయాన్ని 2000 దశకం చివరిలో విస్తరించే ప్రయత్నాలు ప్రారంభించారు. విస్తరణ మొదటి విడత పనులను రూ.21 కోట్లతో 2008 జూన్‌లో చేపట్టారు. 2009 డిసెంబరుకు పనులను పూర్తి చేశారు. 6వేల అడుగుల రన్‌వే, ఆఫ్రాన్, టాక్సీతో పాటు 1060 ఎకరాల పరిధికి రక్షణ గోడ నిర్మించారు. రెండో విడత పనులను 2010 అక్టోబరు 10న చేపట్టారు. రూ. 13 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో టెర్మినల్ బిల్డింగ్ తో పాటు ఏటీసీ ( ఏయిర్ ట్రాఫిక్ సర్వీసు), పవర్ హౌస్, లింకు రోడ్డులు, కార్‌పార్కింగ్, సివిల్, ఎలక్ట్రికల్ పనులను చేపట్టారు. రెండో విడత పనులు 2011 డిసెంబరుకే పూర్తి కావాల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో గడువు వాయిదా పడింది. టెర్మినల్ బిల్డింగ్‌తో పాటు అన్ని పనులు పూర్తయ్యాయి.టెర్మినల్‌కు దగ్గరలోనే కారుపార్కింగ్‌ను నిర్మించారు. ఇన్‌వే, అవుట్‌వే లింకు రోడ్లను పూర్తి చేశారు.
విమానయాన సంస్థలు
మార్చుకడప విమానాశ్ర యాన్ని దేశీయ విమానాశ్రయంగానే ప్రభుత్వం అనుమతించింది. దీంతో ఏటీఆర్-72 సర్వీసులు మాత్రమే నడుస్తాయి. ఏటీఆర్-72 రకం విమానాల్లో 75 మంది ప్రయాణీకులకు మాత్రమే సౌకర్యం ఉంటుంది.
మార్గాలు
మార్చువిజయవాడ, రాజమండ్రి, చెన్నై, హైద్రాబాదు, మైసూరు, రాజమండ్రి నగరాలకు ట్రూజెట్ సేవలందిస్తోంది.[3]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ http://www.aai.aero/allAirports/cuddapah.jsp Archived 2012-01-29 at the Wayback Machine Cuddapah Airport at the Airports Authority of India
- ↑ "Air Pegasus connects Bengaluru with Kadapa in Andhra". Business Standard. 7 June 2015. Retrieved 7 June 2015.
- ↑ "Trujet Schedule" (PDF). 2019-08-23. Archived from the original (PDF) on 2019-08-23. Retrieved 2019-08-23.