ట్రూజెట్
ట్రూజెట్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న ఒక భారతీయ ప్రాంతీయ విమానయాన సంస్థ .
ట్రూజెట్ | ||
---|---|---|
IATA 2T [1] | ICAO TRJ[1] | కాల్ సైన్ TRUJET [2] |
స్థాపన | 14 మార్చి 2013 | |
మొదలు | 12 జులై 2015 | |
Ceased operations | జులై 2020 | |
Hub | రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్) | |
Fleet size | 5 | |
Destinations | ||
Parent company | టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రవేట్ లిమిటెడ్[3] | |
కంపెనీ నినాదం | ట్రూలీ ఫ్రెండ్లీ (Truly Friendly) | |
ముఖ్య స్థావరం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | |
ప్రముఖులు |
|
చరిత్ర
మార్చు21 జూలై 2014 నాడు ఈ విమానయాన సంస్థ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి విమానసేవలకు అభ్యంతరం లేదు అనే ధృవపత్రం పొందింది. [5] దీని యజమాని టర్బో మేఘా ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్. ఫిబ్రవరి 2015 లో ట్రూజెట్ బ్రాండ్ పేరును ప్రారంభించింది. [6] [7] ఎటిఆర్(ATR) 72 విమానాలను ఉపయోగించి రెండవ స్థాయి నగరాల మధ్య సంపర్కాన్ని అందించే తక్కువ-ధర సంస్థగా ట్రూజెట్ స్థాపించబడింది. [8] ప్రధానంగా మధ్యతరగతి ప్రయాణికులు, యాత్రికులు ఈ సంస్థ సేవలను పొందుతారు. ట్రూజెట్ 7 జూలై 2015 న పౌరవిమానయాన సంస్థ సంచాలకుల నుండి విమానయాన సేవలందించు సంస్థగా ధృవీకరణ పత్రాన్ని పొందింది. [9] ఈ సంస్థ తన హైదరాబాద్ కేంద్రం నుండి తిరుపతికి విమానంతో 2016 జూలై 12 న కార్యకలాపాలు ప్రారంభించింది. [10] [11]
అద్దెకిచ్చిన వారు చెల్లింపులు నిలిచినందున 12 జులై 2020 నాడు సంస్థ ఏడు ఎటిఆర్ 72 విమానాలలో ఐదింటిని స్వాధీనపరచుకున్నారు. [12]
గమ్యస్థానాలు
మార్చుమే 2019 నాటికి, ట్రూజెట్ ఈ క్రింది గమ్యస్థానాలకు సేవలందిస్తుంది: [13] [14]
రాష్ట్రం | గమ్యస్థానం | విమానాశ్రయం | గమనికలు |
---|---|---|---|
మధ్య ప్రదేశ్ | ఇండోర్ | దేవి అహిల్యాబాయి హోల్కర్ విమానాశ్రయం | |
రాజస్థాన్ | జైసాల్మెర్ | జైసాల్మెర్ విమానాశ్రయం | |
ఆంధ్ర ప్రదేశ్ | కడప | కడప విమానాశ్రయం | |
రాజమండ్రి | రాజమండ్రి విమానాశ్రయం | ||
తిరుపతి | తిరుపతి విమానాశ్రయం | ||
విజయవాడ | విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం | ||
గోవా | వాస్కో డా గామా | గోవా అంతర్జాతీయ విమానాశ్రయం | |
కర్ణాటక | మైసూరు | మైసూరు విమానాశ్రయం | |
బళ్లారి | జిందాల్ విజయనగర విమానాశ్రయం | ||
బెంగుళూరు | కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం | ||
మహారాష్ట్ర | ఔరంగాబాద్, మహారాష్ట్ర | ఔరంగాబాద్ విమానాశ్రయం | |
ముంబై | ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం | ||
నాందెడ్ | నాందెడ్ విమానాశ్రయం | ||
నాసిక్ | నాసిక్ విమానాశ్రయం | ||
జలగావ్ | జలగావ్ విమానాశ్రయం | ||
కొల్హాపూర్ | కొల్హాపూర్ విమానాశ్రయం | ||
తమిళనాడు | చెన్నై | చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం | కేంద్రం |
కోయంబత్తూరు | కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయం | ||
సేలం | సేలం విమానాశ్రయం | ||
తెలంగాణ | హైదరాబాదు | రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం | కేంద్రం |
గుజరాత్ | అహమ్మదాబాద్ | సర్దార్ వల్లభభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం | |
పోర్‌బందర్ | పోర్‌బందర్ విమానాశ్రయం | ||
కాండ్ల | కాండ్ల విమానాశ్రయం |
ఫ్లీట్
మార్చుఆగష్టు 2018 నాటికి, ట్రూజెట్ ఈ క్రింది విమానాలను నడుపుతుంది: [8]
విమానాల | సేవలో | ఆదేశాలు | ప్రయాణీకులు | గమనికలు |
---|---|---|---|---|
ATR 72-500 | 3 | 5 | 72 | |
ATR 72-600 | 2 | - | 70 | |
మొత్తం | 05 | 15 |
ప్రస్తావనలు
మార్చు- ↑ 1.0 1.1 "TruJet". ch-aviation. Retrieved 25 February 2017.
- ↑ "JO 7340.2G Contractions" (PDF). Federal Aviation Administration. 5 January 2017. p. 3–1–101. Retrieved 8 June 2017.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Trujet to add three more aircraft, will invest Rs 500 crore". Deccan Chronicle. 11 July 2015.
- ↑ "Shortage of pilots". Business line. Retrieved 15 May 2018.
- ↑ Krishnamoorthy, Suresh (22 July 2014). "Ramcharan Tej forays into airline biz". The Hindu. Retrieved 22 July 2016.
- ↑ "India's Turbo Megha Airways to become TruJet on launch". ch-aviation. 23 February 2015. Retrieved 22 July 2016.
- ↑ Kesireddy, Raji (19 February 2015). "Turbo Megha Airways may start regional airline TruJet in 2 months, post final approval". The Economic Times. Retrieved 22 July 2016.
- ↑ 8.0 8.1 T. E., Narasimhan (29 July 2015). "Trujet builds a budget brand". Business Standard. Retrieved 22 July 2016.
- ↑ "With DGCA nod, Trujet becomes the latest to enter domestic skies". The Indian Express. 8 July 2015. Retrieved 22 July 2016.
- ↑ "India's TruJet commences operations". ch-aviation. 14 July 2015. Retrieved 22 July 2016.
- ↑ Reddy, U. Sudhakar (14 February 2015). "Ram Charan's airlines to start services from April". Deccan Chronicle. Retrieved 22 July 2016.
- ↑ "End of runway for TruJet". The Hindu Business Line. Retrieved 15 July 2020.
- ↑ "By 2020, Nashik likely to be one of India's busiest airports" (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-01-19.
- ↑ "Route map". Archived from the original on 2017-09-10. Retrieved 2019-08-23.
బాహ్య లింకులు
మార్చుMedia related to ట్రూజెట్ at Wikimedia Commons
- Official website