కత్తి కార్తీక
కత్తి కార్తీక ( భైరగౌని కార్తీక) తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాత, నటి, రేడియో జాకీ, ఆర్కిటెక్. కార్తీక వి6 ఛానల్ లో "దిల్ సే కార్తీక" కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందింది. 'బిగ్ బాస్ తెలుగు' రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నది.[1][2][3]
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుకార్తీక హైదరాబాదులోనే పుట్టిపెరిగింది. పదవ తరగతి వరకు సికింద్రాబాదులోని సెయింట్ ఆన్స్ హైస్కూల్ ఉన్నత విద్యను చదివిన కార్తీక, లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రీనీచ్ లో మాస్టర్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి, లండన్ లోనే ఆర్కిటెక్ గా రెండు సంవత్సరాలు పనిచేసింది.
వృత్తి జీవితం
మార్చుకార్తీక తొలుత రేడియో జాకీ గా పని చేసింది, తరువాత వి6 ఛానల్ లో వ్యాఖ్యాతగా చేరి మంచి పేరు సంపాదించుకుంది. తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.[4][5][6] మైక్ టీవిలో చేరి ముచ్చట విత్ కార్తీక అనే కార్యక్రమం చేసింది. 2017లో హైదరాబాదులోని బంజారా హిల్స్ లో బి స్టూడియోస్ పేరుతో సొంతంగా ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోను ప్రారంభించింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక టివి ఛానల్ లో చేరి తనదైన శైలిలో రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూలు చేసింది. 2019లో టీమ్ టీవి పేరిట యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది.
టీవి రంగం
మార్చుసంవత్సరం | కార్యక్రమం | పాత్ర | ఛానల్ | ఫలితాలు |
---|---|---|---|---|
2013-14 | వీకెండ్ విత్ కార్తీక | వ్యాఖ్యాత | ||
2013-15 | కత్తి కార్తీక ఎక్సక్లూసివ్ | వ్యాఖ్యాత | వి6 న్యూస్ | |
2017 | బిగ్ బాస్ 1 | పోటిదారులు | స్టార్ మా | 9వ స్థానం - 42వ రోజు ఎలిమినేట్ అయ్యింది |
2018 | ముచ్చట విత్ కత్తి కార్తీక | వ్యాఖ్యాత | మైక్ టీవి |
రాజకీయ జీవితం
మార్చుకత్తి కార్తీక 2020 నవంబరు 3న జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో మొదట స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించి, తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి పోటీచేసి ఓటమి పాలయ్యింది.[7] ఆమె నవంబర్ 2020లో భారతీయ జనతా పార్టీలో చేరింది.[8] కత్తి కార్తీక్ 2022 జూన్ 16న హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరింది.[9] ఆమె 2023 జులై 14న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (టీ-పీసీసీ) ప్రచార కమిటీ కార్యనిర్వాహక కమిటీలో సభ్యురాలిగా నియమితురాలైంది.[10]
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసింది. ఆమె 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించినా టికెట్ దక్కకపోవడంతో ఆమె నవంబర్ 17న ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరింది.[11]
మూలాలు
మార్చు- ↑ "Bigg Boss Telugu: Jr NTR's TV show begins today, here is the list of celebrities who may enter the house". The Indian EXPRESS. Retrieved 2017-07-17.
- ↑ https://www.firstpost.com/entertainment/bigg-boss-telugu-kathi-karthika-leaves-house-in-double-elimination-dhanraj-delighted-to-be-out-3981987.html
- ↑ ఆంధ్రజ్యోతి, సినిమా కబుర్లు (30 August 2017). "తారక్ అన్నకు ముఖం మీదే చెప్పేశా: కత్తి కార్తీక". Archived from the original on 12 September 2019. Retrieved 12 September 2019.
- ↑ https://telanganatoday.com/melange-nature-tradition
- ↑ https://telanganatoday.com/bathukamma-songs-rule-roost-internet
- ↑ https://timesofindia.indiatimes.com/tv/news/telugu/madhu-priya-kathi-karthika-and-eight-other-contestants-to-share-all-about-their-life-on-lakshmi-manchus-new-show-maharani-today/articleshow/62581726.cms
- ↑ News18 Telugu (10 November 2020). "Dubbaka By Pole Kathi Karthika: దుబ్బాక ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీక." Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (22 November 2020). "బీజేపీలోకి బిగ్‌బాస్ ఫేం కత్తి కార్తీక..!". Sakshi. Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ Sakshi (16 July 2022). "కాంగ్రెస్ పార్టీలోకి కత్తి కార్తీకగౌడ్". Archived from the original on 15 July 2023. Retrieved 15 July 2023.
- ↑ Andhra Jyothy (15 July 2023). "పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా పొంగులేటి". Archived from the original on 15 July 2023. Retrieved 15 July 2023.
- ↑ "Telangana Election: BRS పార్టీలో చేరిన కత్తి కార్తీక.. కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఫైర్". web.archive.org. 2023-11-17. Archived from the original on 2023-11-17. Retrieved 2023-11-17.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)