కదలడు వదలడు
శ్రీ లక్ష్మీనారాయణ కంబైన్స్ బ్యానర్‌పై ఎన్టీఆర్, జయలలిత హీరో హీరోయిన్లుగా రూపొందించిన జానపద చిత్రం కదలడు వదలడు. ఈ సినిమా 1969, జూలై 9న విడుదలయ్యింది.
కదలడు వదలడు (1969 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.విఠలాచార్య |
---|---|
నిర్మాణం | గుత్తా సుబ్బారావు, కుదరవల్లి సీతారామస్వామి |
రచన | వేటూరి సుందరరామ్మూర్తి |
చిత్రానువాదం | బి.విఠలాచార్య |
తారాగణం | నందమూరి తారక రామారావు, జయలలిత, జి. రామకృష్ణ, విజయలలిత, సత్యనారాయణ, ధూళిపాళ, ముక్కామల, మిక్కిలినేని, బాలకృష్ణ, త్యాగరాజు, రామదాస్, పి.హేమలత, ఛాయాదేవి, రాజేశ్వరి, శ్యామల, బాలమణి, ఝాన్సీ |
సంగీతం | టి.వి. రాజు |
నృత్యాలు | చిన్ని-సంపత్ |
గీతరచన | సి.నారాయణరెడ్డి, వేటూరి, కొసరాజు, దాశరథి |
ఛాయాగ్రహణం | హెచ్.ఎస్.వేణు |
కళ | బి.నాగరాజన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ నారాయణ కంబైన్స్. |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ధూళిపాల - అనంగపాలుడు
- హేమలత - వినతాదేవి
- ఛాయాదేవి - సరితాదేవి
- మాస్టర్ విశ్వేశ్వర్ - యువరాజు విక్రమ సింహుడు
- నందమూరి తారక రామారావు - విక్రమ సింహుడు
- ముక్కామల - చార్వాకుడు
- రామదాసు - భుజంగరాయలు
- త్యాగరాజు - డిండిమ వర్మ
- మిక్కిలినేని - వీరసేనుడు
- సత్యనారాయణ - కిరీటి
- రామకృష్ణ - వినోదవర్మ
- జయలలిత - మధుమతి
- బాలకృష్ణ - గజపతి
- ఝాన్సీ - చెలికత్తె
- రాజేశ్వరి
- మోదుకూరి సత్యం
సాంకేతిక వర్గం
మార్చు- రచన: వీటూరి
- కళ: బి నాగరాజన్
- కూర్పు: గోవిందస్వామి
- స్టంట్స్: శివయ్య
- సంగీతం: టీవీ రాజు
- నృత్యం: చిన్ని, సంపత్
- ఛాయాగ్రహణం: హెచ్‌ఎస్ వేణు
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి విఠలాచార్య
- నిర్మాతలు: కుదరవల్లి సీతారామస్వామి, గుత్తా సుబ్బారావు
కథ
మార్చుఅవంతీ రాజ్యప్రభువు అనంగపాలుడు (ధూళిపాళ). పట్టపురాణి వినుత దేవి (హేమలత). చిన్నరాణి సరితాదేవి (ఛాయాదేవి). యువరాజు విక్రమసింహుని (మాస్టర్ విశ్వేశ్వర్) పుట్టినరోజు సందర్భంగా మహా మంత్రి చార్వాకుడు (ముక్కామల), రాజుగారి బావమరిది, చిన్నరాణి సోదరుడు భుజంగరాయలు (రామదాసు), ఉప సేనాధిపతి డిండిమవర్మ (త్యాగరాజు) తమ పిల్లలచే యువరాజుకు బహుమతులు అందచేస్తారు. వాటిలో ఒక కీలుగుర్రం బొమ్మ ద్వారా యువరాజుకు ప్రమాదం జరగబోగా సేనాధిపతి వీరసేనుడు (మిక్కిలినేని) రక్షిస్తాడు. యువరాజును అంతం చేయడానికి దుష్టులు చార్వాకుడు, భుజంగరాయలు, డిండిమవర్మలు కుట్ర పన్నుతారు. దాని ఫలితంగా వీరసేనునితో అక్రమ సంబంధం ఉందని పట్టపురాణిని అనుమానించిన మహరాజు, ఇద్దరికీ మరణదండన విధిస్తాడు. ఆ శిక్షనుంచి తప్పించుకొన్న వీరసేనుడు -మహారాణి, యువరాజును రాజ్యానికి దూరంగావుంచి కాపాడతాడు. ఒక సామాన్య యువకునిగా, సాహసవంతునిగా పెరిగి పెద్దవాడైన విక్రముడు.. తల్లి, సేనాపతి ద్వారా నిజం తెలుసుకొంటాడు. అవంతీ రాజ్యానికి వెళ్లి అక్కడ మంత్రి కుమారుడు కిరీటి (సత్యనారాయణ)తో తలపడి అతన్ని ఓడిస్తాడు. రాకుమారుడు (చిన్నరాణి కుమారుడు) వినోదవర్మ (రామకృష్ణ), భుజంగరాయలు కుమార్తె మధుమతి (జయలలిత)ని ప్రేమిస్తాడు. అంతకుముందే కనె్నతీర్థం వద్ద విక్రముని (ఎన్‌టి రామారావు) పరాక్రమం చూసి మెచ్చిన మధుమతి, అతనిపై ప్రేమ పెంచుకుంటుంది. వారిరువురూ పరస్పర అనురాగబద్ధులై ఉంటారు. మధ్యలో డిండిమవర్మ కుమార్తె సుకన్య (విజయలలిత) విక్రమునిపై ప్రేమ పెంచుకోవటం కథ పలు మలుపులు తిరుగుతుంది. కథ నడుస్తుండగా రాజ్య కుట్రలతో మహారాజు, చిన్నరాణి, భుజంగరాయలు బందీలవుతారు. సింహాసనం అధిష్టించి మధుమతిని వివాహం చేసుకోవాలనే కిరీటి ప్రయత్నాలను విక్రముడు పలు ఉపాయాలతో ఎదుర్కొంటారు. దుష్టుల ఆటకట్టించి మహారాజుకు తన తల్లి నిర్దోషిత్వం నిరూపిస్తాడు విక్రముడు. మధుమతిని చేపట్టి సింహాసనం అధిష్టించటంతో కథ సుఖాంతమవుతుంది.[1]
పాటలు
మార్చు- అందిస్తాను అందుకో మధువందిస్తాను అందుకో - పి.సుశీల , రచన: దాశరథి
- ఇక్కడ వాడే అక్కడ వాడే ఎక్కడచూసిన వాడే వాడే - సుశీల , రచన: సి నారాయణ రెడ్డి
- ఎండా వానా గాలి వెన్నెల ఏమన్నాయిరా పరోపకారం పరమార్ధం - ఘంటసాల బృందం . రచన: వీటూరి.
- ఓ ముద్దులొలికే ముద్దబంతి ముసిముసి నవ్వుల చేమంతి - ఘంటసాల, సుశీల . రచన: సి నారాయణ రెడ్డి.
- కట్కో కట్కో గళ్ళచీర పెట్కో పెట్కో పళ్ళిబొట్టు చుక్కలాంటి - ఘంటసాల, సుశీల . రచన: సి. నారాయణ రెడ్డి.
- కొమ్మా కొమ్మా కులికిన చోట నువ్వే నువ్వే కనుబొమ్మా కలిసిన - సుశీల , రచన: సి.నారాయణ రెడ్డి
- బుల్లెమ్మా సౌఖ్యమేనా ఏం బుల్లెమ్మా సౌఖ్యమేనా నీలినీలి కళ్ళలోన - ఘంటసాల, సుశీల. రచన:వీటూరి.
- వారే వారే చుం చుం , పి.సుశీల, రచన:కొసరాజు.
మూలాలు
మార్చు- ↑ సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (6 July 2019). "ఫ్లాష్ బ్యాక్ @50 కదలడు వదలడు". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 9 September 2019.
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)