కనకమామిడి స్వామిగౌడ్

కనకమామిడి స్వామిగౌడ్ (జ. 1954 జూలై 5) రాజకీయ నాయకుడు, తెలంగాణ శాసన మండలి తొలి ఛైర్మన్. టి.ఎన్.జి.వో. మాజీ అధ్యక్షుడుగా,[1] తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గా పనిచేశాడు.[2][3][4] తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశాడు. స్వామి గౌడ్ 2020 నవంబరు 25 న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5] 2022 అక్టోబరు 21న భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.

కనకమామిడి స్వామిగౌడ్
కనకమామిడి స్వామిగౌడ్


వ్యక్తిగత వివరాలు

జననం (1954-07-05) 1954 జూలై 5 (వయసు 70)
కిస్మత్‌పూర్ గ్రామం, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి మనోరమ
సంతానం కిరణ్ గౌడ్
వృత్తి తెలంగాణ శాసన మండలి మాజీ ఛైర్మన్.

జననం - విద్యాభ్యాసం

మార్చు

స్వామిగౌడ్ 1954, జూలై 5న నర్సమ్మ, లక్ష్మయ్య దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని కిస్మత్‌పూర్ గ్రామంలో జన్మించాడు. బీఎస్సీ వరకు చదివాడు.

వివాహం

మార్చు

మనోరమతో వివాహం జరిగింది. వీరికి కొడుకు కనకమామిడి కిరణ్ గౌడ్ , ఇద్దరు కూతుళ్లు.

ఉద్యోగ, రాజకీయ జీవితం

మార్చు

రాజేంద్రనగర్ లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో అటెండర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. 1969 ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, బుల్లెట్ గాయానికి గురయ్యాడు. 1977లో దివిసీమలో వరదలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్లి ప్రజలకు సహకారం అందించాడు.[6] తెలంగాణ మలిదశ ఉద్యమంలో టీఎన్జీవో నాయకుడుగా, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌గా కీలకభూమిక పోషించడంతోపాటు, ప్రభుత్వోద్యోగులు చేసిన 42 రోజుల సమ్మెకు సకల జనుల సమ్మెగా పేరు పెట్టి ముందుండి నడిపించాడు. 2012 జూలైలో పదవీ విరమణ చేసి, నవంబరులో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, పొలిట్ బ్యూరో సభ్యులుగా ఎంపికయ్యాడు. కరీంనగర్ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుండి తెలంగాణ శాసన మండలికి ఎన్నికయ్యాడు.[7] టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో 2014 జూలై 2న తెలంగాణ శాసన మండలి తొలి ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[8] ఆయన 2017లో గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.[9] ఆయన శాసనమండలి ఛైర్మన్‌గా 2 జూలై 2014 నుండి 2019 మార్చి 29 వరకు పని చేశాడు.

స్వామి గౌడ్ 25 నవంబర్ 2020న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[10] ఆయన 2022 అక్టోబర్ 21న బిజెపి పార్టీకి రాజీనామా చేసి[11] టీఆర్‌ఎస్‌లో చేరాడు.[12] ఆయన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యాడు.[13]

మూలాలు

మార్చు
  1. "K Swamy Goud MLC Profile". 5 July 2016.
  2. B. Chandrashekhar (2012-10-22). "States / Andhra Pradesh : Naidu's padayatra enters 'T' sans opposition". The Hindu. Retrieved 2012-11-16.
  3. BV Shiva Shankar (2012-11-09). "Eying monopoly on Telangana, KCR vetoes; T-JAC meeting postponed - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2013-01-27. Retrieved 2012-11-16.
  4. Telangana Non-Gazetted Officers Association president
  5. Sakshi (25 November 2020). "టీఆర్‌ఎస్‌కు షాక్‌.. కమలం గూటికి స్వామిగౌడ్‌‌". Sakshi. Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
  6. నేటిఏపి.కాం. "చప్రాసీ నుంచి మండలి చైర్మన్ వరకు- స్వామిగౌడ్ ప్రస్థానం!". www.netiap.com. Retrieved 23 February 2017.[permanent dead link]
  7. Janamsakshi (26 February 2013). "ఎమ్మెల్సీ ఎన్నికల్లో జై తెలంగాణ". Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. పోరుతెలంగాణ. "తెలంగాణ తొలి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్". porutelangana.in. Archived from the original on 27 May 2016. Retrieved 22 February 2017.
  9. Suryaa (9 November 2017). "మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు సభ్యుల అభినందనలు". telangana.suryaa.com. Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
  10. Sakshi (25 November 2020). "బీజేపీలో చేరిన స్వామిగౌడ్." Archived from the original on 15 జనవరి 2022. Retrieved 15 January 2022.
  11. 10TV Telugu (21 October 2022). "కమలానికి షాక్.. బీజేపీకి మరో నేత గుడ్‌బై.. టీఆర్ఎస్‌లో చేరనున్న స్వామి గౌడ్!". Archived from the original on 21 October 2022. Retrieved 21 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  12. V6 Velugu (21 October 2022). "టీఆర్‌ఎస్‌లో చేరిన స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌". Archived from the original on 21 October 2022. Retrieved 21 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. Eenadu (6 April 2024). "పార్లమెంటు నియోజకవర్గాల్లో భారాస సమన్వయకర్తల నియామకం". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.

ఇతర లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.