కనబడుటలేదు 2021లో విడుదల కానున్న క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ తెలుగు సినిమా.సరయు తలసిల సమర్పణలో ఎస్.ఎస్ ఫిల్మ్స్ - శ్రీ పాద క్రియేషన్స్ - షేడ్ స్టూడియోస్ బ్యానర్లపై సాగర్ మాచనూరు, సతీష్ రాజు, దిలీప్ కూరపాటి, డా.శ్రీనివాస్ కిషన్ అన్నపు, దేవీప్రసాద్ బలివాడ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఎం.బాలరాజు దర్శకత్వం వహించాడు. సునీల్, వైశాలీరాజ్, సుక్రాంత్ వీరెల్ల, హిమజ ప్రధాన పాతరాల్లో నటించారు. ఈ సినిమాట్రైలర్‌ను 2021 ఆగష్టు 8న విడుదల చేసి[1], సినిమాను ఆగష్టు 13న విడుదల చేయనున్నారు.

కనబడుటలేదు
దర్శకత్వంఎం.బాలరాజు
నిర్మాతసాగర్ మాచనూరు
సతీష్ రాజు
దిలీప్ కూరపాటి
డా.శ్రీనివాస్ కిషన్ అన్నపు
దేవీప్రసాద్ బలివాడ
నటవర్గంసునీల్, వైశాలీరాజ్, సుక్రాంత్ వీరెల్ల, హిమజ
ఛాయాగ్రహణంసందీప్ బద్దుల
కూర్పురవితేజ కూర్మన
సంగీతంమధు పొన్నస్
నిర్మాణ
సంస్థలు
ఎస్.ఎస్ ఫిల్మ్స్
శ్రీ పాద క్రియేషన్స్
షేడ్ స్టూడియోస్
విడుదల తేదీలు
13 ఆగష్టు 2021
దేశం భారతదేశం
భాషతెలుగు
కనబడుటలేదు సినిమా పోస్టర్

కథసవరించు

శిశిత, సూర్య ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే శిశితను ఆదిత్య అనే మరో అబ్బాయి ప్రేమిస్తాడు. వీరిద్దరి మధ్య ప్రేమ సంగతి కుటుంబంతో పాటు ఆదిత్యకు తెలుస్తోంది. దీంతో ఓ రోజు శిశిత, సూర్య ఇద్దరు ఇంటి నుంచి పారిపోదామని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలోనే శిశిత రైల్వే స్టేషన్‌కు వెళుతుంది. ఇంటి నుంచి బయలు దేరిన సూర్య మాత్రం స్టేషన్‌కు చేరుకోడు. ఆ రోజు నుంచి సూర్య కనబడకుండా పోతాడు. దీంతో ఈ కేసు మిస్టరీని చేధించడానికి డిటెక్టివ్‌ రామకృష్ణ (సునీల్‌) రంగంలోకి దిగుతాడు. ఈ కేసు ఛేదనలో డిటెక్టివ్‌ రామకృష్ణ కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?? సూర్య ఆచూకీని డిటెక్టివ్‌ రామకృష్ణ కనుగొన్నాడా ?? లేదా అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: ఎస్.ఎస్ ఫిల్మ్స్
  శ్రీ పాద క్రియేషన్స్
  షేడ్ స్టూడియోస్
 • నిర్మాతలు: సాగర్ మాచనూరు
  సతీష్ రాజు
  దిలీప్ కూరపాటి
  డా.శ్రీనివాస్ కిషన్ అన్నపు
  దేవీప్రసాద్ బలివాడ
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బాలరాజు
 • సినిమాటోగ్రఫీ:సందీప్ బద్దుల
 • ఎడిటింగ్: రవితేజ కూర్మన
 • పాటలు: చంద్ర బోస్, మధు నందన్ బి.పూర్ణ చారి
 • సంగీతం: మధు పొన్నస్

మూలాలుసవరించు

 1. Eenadu (10 August 2021). "Kanabadutaledu: ఈ కథలో హీరోల్లేరు అందరూ విలన్లే..! - telugu news kanabadutaledu trailer out now". Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.