రాహుల్ సిప్లిగంజ్
రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా పాటల, జానపద పాటల గాయకుడు, రచయిత. తెలంగాణ యాసలో మగజాతి అనే జానపద పాటతో యూట్యూబ్ లో ప్రాచూర్యం పొందిన రాహుల్, 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడ పాటతో సినిమారంగంలోకి ప్రవేశించాడు.[1][2]
రాహుల్ సిప్లిగంజ్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | ఆగస్టు 22, 1989 |
మూలం | ధూల్ పేట, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
సంగీత శైలి | తెలుగు సినిమా పాటలు, జానపద గీతాలు |
వృత్తి | గాయకుడు, రచయిత |
క్రియాశీల కాలం | 2013–ప్రస్తుతం |
రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[3]
జననం
మార్చురాహుల్ 1989, ఆగస్టు 22న హైదరాబాదులోని ధూల్ పేటలో జన్మించాడు. లయోల హైస్కూల్ లో ఉన్నత విద్యను, నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తిచేశాడు.
వృత్తి జీవితం
మార్చుచిన్నపప్నటినుండి పాటలపై ఉన్న ఇష్టంతో సొంతంగా సాధన చేసేవాడు. వంటగదిలోని వస్తువులతో సంగీతం వాయిస్తూ పాటలు పాడడం గమనించిన రాహుల్ తండ్రి, పండిత్ విఠల్ రావు దగ్గరికి పంపించి సంగీతం నేర్పించాడు. సొంతంగా పాటల వీడియోలను రూపొందించి యూట్యూబ్ లో పెట్టేవాడు. వాటిని మంచి స్పందన వచ్చింది.[2]
మ్యూజిక్ వీడియోలు
మార్చు- హేయ్ పిల్లా (2013)
- ఎందుకో (2015)
- ఏం మాయలో (2015)
- మంగమ్మ (2015)
- మైసమ్మ (2015)
- ఏనది (2015)
- మాక్కికిరికిరీ (2016)
- పూర్ బాయ్ (2016)
- మగజాతి
- పొయినవా (2016)
- దావత్ (2017)
- గల్లీకా గణేష్ (2017)
- దుమారే (2017)
- జై బోలో ఎల్లమ్మ తల్లికి (2017)
సినిమారంగం
మార్చురాహుల్ 20 సంవత్సరాల వయసులో 2009లో జోష్ చిత్రం తొలిసారిగా పాడాడు. ఆ తరువాత దమ్ము సినిమాలో దమ్ము, వాస్తు బాగుందే, రచ్చ సినిమాలో సింగరేణి ఉంది, ఛల్ మోహన రంగా సినిమాలో పెద్దపులి వంటి పాటలతో గుర్తింపు పొందాడు.[4][5][6] 2018లో వచ్చిన రంగస్థలం సినిమాలో రాహుల్ పాడిన రంగ రంగ రంగస్థలానా పాటకు అత్యంత ప్రజాదరణ లభించింది.[7][8] కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలోని ఏ మెలికెల్ పాటలో స్పానిష్ భాగాన్ని పాడాడు.
చిత్రాలు
మార్చు- జోష్ (2009)
- దమ్ము (2012)
- ఈగ (2012)
- రచ్చ (2012)
- కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
- సుడిగాడు (2012)
- లై (2017)
- గ్యాంగ్ (2018, అనువాద చిత్రం)
- చల్ మోహన రంగా (2018)
- ఆర్ఎక్స్ 100 (2018)
- నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018)
- రంగస్థలం (2018)
- హుషారు (2018)
- మహర్షి (2019)
- మల్లేశం (2019)
- ఇస్మార్ట్ శంకర్ (2019)
- రామ చక్కని సీత (2019)
- ప్రెషర్ కుక్కర్ (2020)
- చావు కబురు చల్లగా (2021)
- మిషన్ ఇంపాజిబుల్ (2022)
- రంగమర్తాండ (2023)
- సూర్యాపేట జంక్షన్ (2023)
టీవిరంగం
మార్చుటెలివిజన్ రియాలిటీ కార్యక్రమమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 పోటీలో పాల్గొన్నాడు.
సంవత్సరం | కార్యక్రమం | పాత్ర | ఛానల్ | భాష | Exit | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|---|
2019 | బిగ్ బాస్ 3 | విజేత | స్టార్ మా | తెలుగు | రియాలిటీ టివీ సిరీస్ |
మూలాలు
మార్చు- ↑ Rahul Sipligunj makes the best of both worlds. The Hindu (12 April 2018). Retrieved on 23 August 2019.
- ↑ 2.0 2.1 The Hindu, Entertainment (Movies) (12 April 2018). "Rahul Sipligunj makes the best of both worlds" (in Indian English). Srivathsan Nadadhur. Archived from the original on 29 July 2018. Retrieved 23 August 2019.
- ↑ https://timesofindia.indiatimes.com/tv/news/telugu/natu-natu-wins-best-original-song-award-at-oscars-2023-rahul-sipligunj-and-kaala-bhairavas-performance-receives-loudest-cheer/articleshow/98595416.cms
- ↑ Nithiin: Music Review: Chal Mohan Ranga | Telugu Movie News – Times of India. Timesofindia.indiatimes.com (24 March 2018). Retrieved on 23 August 2019
- ↑ KITS Warangal culture fest on April 12, 13. Telanganatoday.com (6 April 2018). Retrieved on 23 August 2019
- ↑ Revanth, Rahul Sipligunj, Madhu Priya and Bhargavi to be the guests on Anchor Ravi and Sreemukhi's 'Comedy Nights' this Sunday – Times of India. Timesofindia.indiatimes.com. Retrieved on 23 August 2019
- ↑ Ranga Ranga Rangasthalana from Ram Charan’s Rangasthalam adds to Holi celebration. The Indian Express (2 March 2018). Retrieved on 23 August 2019
- ↑ Chal Mohan Ranga's Pedda Puli song review. Thehansindia.com (10 March 2018). Retrieved on 23 August 2019