విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (IATA: VGA, ICAO: VOBZ) విజయవాడ నగరం నుండి పదహారవ (16) నంబరు జాతీయ రహదారి అయిన కోల్‌కత, చెన్నై మార్గములో 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. కృష్ణా జిల్లాలో గన్నవరం, కేసరపల్లి గ్రామాల మధ్య ఉంది. ఈ విమానాశ్రయమును రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలములో బ్రిటీషు ప్రభుత్యము ఏర్పాటు చేసింది. దీని సుదీర్ఘ రన్‌వే (విమాన రహదారి) సముద్రమట్టం కంటే 82 అడుగుల ఎత్తులో, 11 వేల అడుగులు పొడవు కలిగినది కావున, అతి పెద్దవి, వెడల్పు కలిగిన భారీ విమానాలు దిగుటకు అనుకూలమయిన విమానాశ్రయం.[3] ఈ ప్రాంతం నుండి ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదల కారణంగా, భారతదేశం విమానాశ్రయాల అథారిటీ వారు విమానాశ్రయానికి అభివృద్ధి, మౌలిక వసతులలో మార్పులు చేపట్టారు.[4]
విజయవాడ విమానాశ్రయం | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
![]() | |||||||||||
సంగ్రహము | |||||||||||
విమానాశ్రయ రకం | ప్రజాసేవ | ||||||||||
యజమాని | AAI | ||||||||||
కార్యనిర్వాహకుడు | ఎయిర్ పోర్ట్స్ అధారిటీ అఫ్ ఇండియా | ||||||||||
సేవలు | అమరావతి | ||||||||||
ప్రదేశం | గన్నవరం,ఆంధ్రప్రదేశ్, | ||||||||||
ఎత్తు AMSL | 82 ft / 25 m | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 16°31′44″N 80°47′45″E / 16.52889°N 80.79583°ECoordinates: 16°31′44″N 80°47′45″E / 16.52889°N 80.79583°E | ||||||||||
వెబ్‌సైటు | https://www.aai.aero/en/airports/vijayawada | ||||||||||
పటం | |||||||||||
రన్‌వే | |||||||||||
| |||||||||||
గణాంకాలు (ఏప్రిల్ 2017 – మార్చి 2018) | |||||||||||
| |||||||||||
2017, ఆగస్టులో ఈ విమానాశ్రయమును అంతర్జాతీయముగా ప్రకటింపబడింది. సింగపూర్ కు మొదటి అంతర్జాతీయ విమాన సేవ 2018 డిసెంబరు 4 నుండి ప్రారంభించబడింది. జూలై 2019లో రాష్ట్రప్రభుత్వం రాయితీ తొలగించడంతో రద్దయినది.[5] కార్గో సేవలు ఆగస్టు, 2018 నుండి అందుబాటులోకి వచ్చాయి. హజ్ యాత్రకు ఇక్కడి నుండి నేరుగా వెళ్ళే సదుపాయం భారత ప్రభుత్వం 2020 నుండి అందిచనుంది.
చరిత్రసవరించు
కింగ్‌ఫిషర్ ఎయిర్ ఎయిర్ లైన్స్ సంస్థ వారు, ఒకటి హైదరాబాదు మరియొకటి బెంగుళూరుకు రెండు విమానాలతో మాత్రమే పనిచేసేది.[4][6] జెట్ ఎయిర్‌వేస్ వారు ఒక 62 సీట్లు ఎటిఆర్ 72-500 (ATR 72-500) రకం విమానం వారానికి ఆరు రోజులు నేరుగా హైదరాబాదుకు చేరుకునేందుకు సౌలభ్యం ఉంది,[7], అదనంగా బెంగుళూరుకు ఒక విమాన ప్రయాణం సేవలు ప్రారంభించారు.[3] జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక ఇబ్బందులవల్ల మూసివేయబడింది. ఎయిర్ కోస్తా, ఒక ప్రాంతీయ దేశీయ వైమానిక సంస్థ విజయవాడ తన కార్యాచరణ కేంద్రంగా, చెన్నై నిర్వహణ కేంద్రంగా 14వ తారీఖు, అక్టోబరు, 2013 సం. నుండి విమాన ప్రయాణ సేవలు ప్రారంభించింది. 2017లో ఎయిర్ కోస్తా తన ప్రయాణసేవలను ఆపివేయడమైనది. ఇప్పడు ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, స్పైస్ జెట్, ఇండిగో, ట్రూజెట్ విజయవాడకు సేవలందిస్తున్నాయి. విమానశ్రయంలో ఇంధనం సేవలు హిందుస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ అందిస్తోంది.
వాయు మార్గాలు (ఎయిర్ లైన్స్) , గమ్యస్థానాలుసవరించు
ఎయిర్ ఇండియా సంస్థ అక్టోబర్ 30, 2011 రోజున హైదరాబాదు మీదుగా ఢిల్లీకి 122 సీట్లు సామర్థ్యం కలిగిన A-319 ఎయిర్ బస్ సర్వీసు ప్రారంభించారు.[8] విజయవాడ నుండి చికాగో, న్యూయార్క్, టొరంటో ప్రదేశములకు, వెళ్ళే ప్రయాణీకులు హైదరాబాదు మీదుగా న్యూ ఢిల్లీ చేరి అక్కడ విమానం మారవలసి ఉంది ఒకే సరాసరి టికెట్ విజయవాడ నుండి గమ్యస్థానము వరకు జారీ చేయబడుతుంది.[9][10] ప్రైవేట్ విమానయాన సంస్థలు అయిన స్పైస్‌జెట్ వారు హైదరాబాదు నుండి విజయవాడకు సరాసరి, మధ్యన, నేరు విమాన ప్రయాణ సేవలు ప్రారంభించారు. స్పైస్‌జెట్ సంస్థ 2011 సెప్టెంబరు 28 రోజున హైదరాబాదుకు 78 సీట్లు గల క్యూ 400 (Q-400) రకం విమానం రోజువారీగా ప్రారంభించారు.
ప్రయాణీకుల రద్దీ , విమాన సర్వీసులుసవరించు
Year | Passenger traffic | Aircraft movement | ||
---|---|---|---|---|
Passengers | Percent change |
Aircraft movements |
Percent change | |
2017–18 | 746,392[1] | +19.9% | 11,999 [2] | +16.1% |
2016–17 | 622,354[11] | +56.1% | 10,333[12] | +54.8% |
2015–16 | 398,643[13] | +71.9% | 6,676[14] | +43.9% |
2014–15 | 231,931[13] | NA | 4,639[14] | NA |
విమానయాన సంస్థలు | గమ్యస్థానాలు |
---|---|
ఎయిర్ ఇండియా | ఢిల్లీ , హైదరాబాదు(Resumes 27 October 2019)[15] |
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ | ముంబై[16] |
స్పైస్‌జెట్ | బెంగుళూరు , హైదరాబాదు, చెన్నై, ముంబై(ends 30 September 2019) |
ఇండిగో | బెంగుళూరు , హైదరాబాదు, ఢిల్లీ(ends 04 Sep 2019), చెన్నై, పుదుచ్చేరి[17] |
ట్రూజెట్ | కడప , హైదరాబాదు[18] |
ప్రమాదాలు , ఘటనలుసవరించు
- 1980 ఆగస్టు 28 నాడు, వికెర్స్ విస్కౌంట్ యొక్క హన్స్ ఎయిర్ VT- DJC విమానం లాండింగ్ సమయములో మూడు సార్లు బౌన్స్ తర్వాత నోస్‌వీల్ బాగు చేసేందుకు కూడా పనికి రానంతగా ఆర్థికంగా దెబ్బతిని కుప్పకూలింది.[19]
గ్యాలరీసవరించు
ఎయిర్ కోస్టా విమానం (2017కు ముందు)
మూలాలుసవరించు
- Airport information for VOBZ at World Aero Data. Data current as of October 2006.
సూచనలుసవరించు
- ↑ 1.0 1.1 "Traffic News for the month of March 2018: Annexure-III" (PDF). Airports Authority of India. p. 2. Archived from the original (PDF) on 4 ఫిబ్రవరి 2017. Retrieved 5 May 2018. Check date values in:
|archive-date=
(help) - ↑ 2.0 2.1 "Traffic News for the month of March 2018: Annexure-II" (PDF). Airports Authority of India. p. 2. Retrieved 5 May 2018.[permanent dead link]
- ↑ 3.0 3.1 RAMESH SUSARLA. "Extended airport runway trial begins in Vijayawada". The Hindu. Retrieved August 30, 2011.
- ↑ 4.0 4.1 "More flights from Vijayawada". The Times of India. Retrieved Oct 22, 2011.
- ↑ "గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇక డొమెస్టిక్ ఎయిర్‌పోర్టు?". సమయం. Archived from the original on 2019-08-24.
- ↑ "Another pvt airliner to operate from Gannavaram". The Times of India. Retrieved Mar 14, 2011.
- ↑ "Jet Airways launches direct flight to Hyderabad six days a week". The Hindu. Retrieved Mar 28, 2011.
- ↑ "Air India launches Delhi-Vijayawada flight". Moneycontrol. Retrieved Oct 27, 2011.
- ↑ "ILS equipment calibrated at Gannavaram Airport". The hindu. Retrieved January 28, 2012.
- ↑ "Air India's new link between Delhi and Vijayawada". Airindia.com. Retrieved Oct 28, 2011.
- ↑ "Traffic News for the month of March 2017: Annexure-III" (PDF). Airports Authority of India. p. 2. Archived from the original (PDF) on 28 April 2017. Retrieved 24 May 2017.
- ↑ "Traffic News for the month of March 2017: Annexure-II" (PDF). Airports Authority of India. p. 2. Archived from the original (PDF) on 28 April 2017. Retrieved 24 May 2017.
- ↑ 13.0 13.1 "Traffic News for the month of March 2016: Annexure-III" (PDF). Airports Authority of India. p. 2. Retrieved 5 May 2018.
- ↑ 14.0 14.1 "Traffic News for the month of March 2016: Annexure-II" (PDF). Airports Authority of India. p. 2. Retrieved 5 May 2018.
- ↑ "Air India springs a nasty surprise". The Hindu. July 21, 2018.
- ↑ "Air India Express connects Vijayawada and Mumbai". The Hindu Business Line. January 19, 2018.
- ↑ "SpiceJet's Flights Schedule and Information for domestic and international flights". spicejet.com. Retrieved 2019-02-02.
- ↑ "ROUTE MAP". www.trujet.com. December 2018. Archived from the original on 2017-09-10. Retrieved 2019-08-24.
- ↑ "Accident description". Aviation Safety Network. Retrieved 8 October 2009.
బయటి లింకులుసవరించు
Wikimedia Commons has media related to Vijayawada Airport. |