కన్నాయిగూడెం మండలం
కన్నాయిగూడెం మండలం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాకు చెందిన మండలం.[1]
కన్నాయిగూడెం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, కన్నాయిగూడెం స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ములుగు జిల్లా |
మండల కేంద్రం | కన్నాయిగూడెం (కన్నాయిగూడెం మండలం) |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 373 km² (144 sq mi) |
జనాభా | |
- మొత్తం | 11,216 |
- పురుషులు | 5,483 |
- స్త్రీలు | 5,733 |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 139 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] అపుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది. [3][4] ప్రస్తుతం ఈ మండలం ములుగు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 7 నిర్జన గ్రామాలు.ఈ మండల ప్రధాన పరిపాలనా కేంద్రం, కన్నాయిగూడెం.
కొత్త మండలంగా ఏర్పాటుసవరించు
లోగడ కన్నాయిగూడెం గ్రామం వరంగల్ జిల్లా, ఏటూరునాగారం మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కన్నాయిగూడెం గ్రామాన్ని ఏటూరు నాగారం మండలంలోని (1+24) గ్రామాలను విడగొట్టి కొత్త మండల కేంధ్రంగా, కొత్తగా ఏర్పాటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు రెవిన్యూ డివిజను పరిధి క్రింద నూతన మండల కేంధ్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[5].
జయశంకర్ జిల్లా నుండి ములుగు జిల్లాకుసవరించు
2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. మరో 8 మండలాలతో పాటు కన్నాయిగూడెం మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[6]
గణాంకాలుసవరించు
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 373 చ.కి.మీ. కాగా, జనాభా 11,216. జనాభాలో పురుషులు 5,483 కాగా, స్త్రీల సంఖ్య 5,733. మండలంలో 3,002 గృహాలున్నాయి.[7]
మండలం లోని గ్రామాలుసవరించు
రెవెన్యూ గ్రామాలుసవరించు
గమనిక:నిర్జన గ్రామాలు ఏడు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ https://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2019-02-27.
- ↑ "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.