కన్యాశుల్కం (సినిమా)
1955 తెలుగు సినిమా
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవల్సిన విషయం నటుల నటన గురించి. ఎంతో ప్రసిద్ధి చెందిన కన్యాశుల్కం నాటకాన్ని సినిమాగా తీసి జనాన్ని మెప్పించటానికి ఎంతగానో ప్రయత్నం జరిగింది. ఈ చలన చిత్రంలో ముగ్గురి నటన బాగా చెప్పుకోతగ్గది. లుబ్దావధానులుగా, గోవిందరాజుల సుబ్బారావు, రామప్పపంతులుగా సి ఎస్.ఆర్, మధురవాణిగా సావిత్రి. ముగ్గురూ కూడి ఉన్న దృశ్యాలన్నీ కూడ నటనను అత్యున్నత స్థితికి తీసుకు వెళ్ళినవే. వీరితో పాటుగా,అగ్నిహోత్రావధానులుగా వేసిన విన్నకోట రామప్ప పంతులు కూడ నటనలో పొంకం చెడకుండా పాత్రకు న్యాయం చేశారు. నందమూరి తారక రామారావు,[1] ప్రతినాయకుడు వంటి, నాయక పాత్రను చక్కగా పోషించాడు.[2]
కన్యాశుల్కం (1955 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.పుల్లయ్య |
---|---|
నిర్మాణం | డి.ఎల్.నారాయణ |
తారాగణం | గోవిందరాజుల సుబ్బారావు, సి.యస్.ఆర్. ఆంజనేయులు, విన్నకోట రామన్నపంతులు, నందమూరి తారక రామారావు, వంగర వెంకటసుబ్బయ్య, సావిత్రి |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | వినోదా పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అయితే సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా సానుకూల స్పందన లభించలేదు.
తారాగణం
మార్చు- సావిత్రి ... మధురవాణి
- ఎన్.టి. రామారావు ... గిరీశం
- చిలకలపూడి సీతారామాంజనేయులు ... రామప్పంతులు
- గోవిందరాజులు సుబ్బారావు ... లుబ్ధావధానులు
- షావుకారు జానకి ... బుచ్చమ్మ
- విన్నకోట రామన్న పంతులు ... అగ్నిహోత్రావధానులు
- వంగర వెంకటసుబ్బయ్య ... కరటకశాస్త్రి
- గుమ్మడి వెంకటేశ్వరరావు ... సౌజన్యరావు పంతులు
- పి.హేమలత ... వెంకమ్మ
- సూర్యకాంతం ... మీనాక్షి
- ఛాయాదేవి ... పూటకూళ్ళమ్మ
- చదలవాడ ... పోలిసెట్టి
- సుభద్ర ... సుబ్బి
- మాస్టర్ కుందు ... వెంకటేశం
- పేకేటి శివరాం ... పోలీస్ కానిస్టేబుల్
- మాస్టర్ సుధాకర్ ... మహేశం
- కంచి నారాయణరావు ... "పుత్తడిబొమ్మ పూర్ణమ్మ"లో ముసలి పెళ్ళికొడుకు
పాటలు
మార్చు- ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే - పి.సుశీల
- ఇల్లు ఇల్లు అనియేవు ఇల్లు నాదనియేవు నీ ఇల్లు ఎక్కడే చిలకా - పద్మప్రియ
- కీచకవధ ( వీధీ భాగవతం) - రచన: సముద్రాల రాఘవాచార్య; గానం: పి. కృష్ణమూర్తి, పద్మప్రియ బృందం
- చేదాము రారే కల్యాణము చిలకా గోరింక పెళ్ళి సింగారం - పద్మప్రయ బృందం
- చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా - రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి; గానం: ఘంటసాల
- పుత్తడిబొమ్మా పూర్ణమ్మా ... మేలిమి బంగరు నెలతల్లారా - ఘంటసాల బృందం. రచన: గురజాడ అప్పారావు.
- పులస్యనవని (శ్లోకం) - ఘంటసాల ( గుమ్మడి మాటలతో)
- సరసుడ దరి చేరరా ఔరా సరసుడ దరి చేరరా సమయమిదే - ఎం.ఎల్. వసంతకుమారి
విడుదల
మార్చుస్పందన
మార్చుకన్యాశుల్కం సినిమాకు ప్రేక్షకుల నుంచి అంతగా సానుకూల స్పందన లభించలేదు.[3]
మూలాలు
మార్చు- ↑ "నూటపాతికేళ్ల కన్యాశుల్కం నాటకం". Sakshi. 2017-08-14. Archived from the original on 2017-09-16. Retrieved 2022-04-29.
- ↑ ఆంధ్రజ్యోతి. "ఎన్టీఆర్ 'కన్యాశుల్కం' 60 ఏళ్లు". Archived from the original on 28 సెప్టెంబరు 2015. Retrieved 24 August 2017.
- ↑ చల్లా, రమణ (February 1956). ధనికొండ, హనుమంతరావు (ed.). "పరిశ్రమ జాతకం". చిత్రసీమ. 1 (2): 17–21.