కమలతో నా ప్రయాణం 2014లో విడుదలైన తెలుగు సినిమా.

కమలతో నా ప్రయాణం
(2014 తెలుగు సినిమా)
Kamalato Naa Prayanam.jpg
దర్శకత్వం నరసింహ నంది
నిర్మాణం సునీల్‌రెడ్డి, సిద్ధార్థ బోగో
తారాగణం శివాజీ,
వేద శాస్త్రి,
రోషన్ బాలు
సంగీతం కిషన్ కవాడియా
కూర్పు వి.నాగిరెడ్డి
భాష తెలుగు

కథసవరించు

దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన కథ “ఊరి చివరి ఇల్లు” ఆధారంగా 1949 ఒక గ్రామం చిత్రానికి జాతీయ అవార్డుతో పాటు నంది పురస్కారం అందుకున్న దర్శకుడు నరసింహ నంది రూపొందించిన చిత్రం “కమలతో నా ప్రయాణం”. 1950 నేపథ్యంలో జరిగే కథ ఇది. వేశ్య వృత్తిలో జీవించే కమల కథగా చిత్రం నడుస్తుంది. సత్యం (శివాజి) తన కుమార్తె కమల రాణికి కథ చెప్తూండగా సినిమా ప్రారంభమవుతుంది. అయోధ్యపురం శివార్లలలో ఉండే కమల (వేద శాస్త్రి అలియాస్ అర్చన) ఓ వేశ్య. తన మిత్రుడు ఆనందరావుకి సహాయం చేయటానికి బర్మా నుంచి వచ్చిన సత్యం వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో కమల ఇంట్లో ఓ రాత్రి గడపాల్సి వస్తుంది. ఆ రాత్రి వారి మధ్య ఓ అందమైన బంధం ఏర్పడుతుంది. దీంతో కమలను తనతోపాటు తీసుకుని బర్మాలో పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. అయితే మళ్లీ ఆ ఆలోచనను తను విరమించుకోవడంతో, మళ్లీ కమల ఒంటరిగా మిగిలిపోతుంది

విశేషాలుసవరించు

సాంకేతిక నిపుణుల వివరాలుసవరించు

  • మూలకథ - దేవరకొండ బాలగంగాధర తిలక్
  • ఛాయాగ్రహణం - ఎస్.మురళీ మోహన్ రెడ్డి
  • పాటలు - వనమాలి

పురస్కారాలుసవరించు

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2013 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం మురళీమోహన్ రెడ్డి[1] విజేత

మూలాలుసవరించు

  • వెబ్ మాస్టర్. "Nandi Awards 2012, 2013 : Winners List". Gulte.com. Retrieved 19 January 2018.