కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె

భాషాప్రవీణ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె (1936 ఫిబ్రవరి 1 - 2016 జనవరి 11) రచయిత, తెలుగు పండితులు.

కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె
జననంకరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె
(1936-02-01)1936 ఫిబ్రవరి 1
చిత్తూరు జిల్లా తలుపులపల్లె గ్రామం
మరణం2016 జనవరి 11(2016-01-11) (వయసు 79)
చిత్తూరు జిల్లా మదనపల్లె
నివాస ప్రాంతంమదనపల్లె
ఇతర పేర్లుభాషాప్రవీణ
వృత్తితెలుగు పండితులు
ప్రసిద్ధిమదనపల్లె రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శి
పదవి పేరుభాషాప్రవీణ
మతంహిందూ
భార్య / భర్తహేమావతి
పిల్లలువిద్యాసాగర్
వినయ సాగర్
అరుణశ్రీ
కరుణశ్రీ
తండ్రికుమారస్వామి పిళ్ళె
తల్లికృష్ణమ్మ

జీవిత విశేషాలు

మార్చు

1936, ఫిబ్రవరి 1చిత్తూరు జిల్లా తలుపులపల్లె గ్రామంలో కృష్ణమ్మ కుమారస్వామి దంపతులకు జన్మించారు. ఉన్నత పాఠశాల విద్య మదనపల్లె, పలమనేరులలోనూ, ఇంటర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి, భాషాప్రవీణ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పొందారు. ఆపై చిత్తూరు జిల్లాలోఅనేక ఉన్నతపాఠశాలల్లో తెలుగు పండితులుగా పనిచేసి 1994 లో కలిచెర్లలో పదవీ విరమణ చేసారు.

వారు సంస్కృతంలో రాసిన కలిచెర్ల పట్టాభిరామ సుప్రభాతం, సీతాష్టకం, పోలేరిమాతాస్తోత్రాలను నేటికీ చిత్తూరులోని పలు దేవాలయాల్లో సుప్రభాత సమయాన వేస్తారు. ఆయన తెలుగు పద్యకావ్యం "విషాద మాథవి"కి ముందుమాట రాసిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య "పద్య విద్య తెలిసిన కవి" అని ప్రశంసించారు. తరువాతి పద్యకావ్యం "చరిత్రకెక్కిన మారణహోమం" అత్యాధునిక స్త్రీవాద భావాలతో కూడిన ఈ రెండు గ్రంథాలకూ మూల కథలు మహాభారతంలోనివి. మరో పద్యకావ్యం "ఒక రాఘవరెడ్డికథ" మావోయిస్టులకూ, పోలీసులకూ మధ్యన నలిగిపోయే అటవీ ప్రాంతాల ప్రజల దీనగాథ. దీనినే "మర్రిమాను సాక్షిగా" పేరిత సాంఘిక నవలా రూపంలో వెలువరించారు.

"ఓరుగల్లు-వీరగల్లు" పద్యకావ్యం, "చండాలుడు" పౌరాణిక నవల, ఆధ్యాత్రిక గ్రంథం "శ్రీశంకరాచార్యులట కవితా వైభవం" వెలువరించిన పిళ్ళైని ఆకాశానికి ఎత్తిన చారిత్రక నవల మాత్రం "బోయకొట్టములు పండ్రెండు". ఇక, తెలుగు మీద అపారమైన అభిమానంతో తెలుగు భాష స్థితిగతులమీద "వెలుగు తగ్గిన తెలుగు", "తెలుగు ఎప్పుడు? ఎక్కడ? ఎలా?" రాశారు. ఇంకా కథలు, నాటకాలు, వ్యాసాలు లెక్కలెనన్ని వెలువరించిన వీరు ఒక నడిచే గ్రంథాలయం లాంటి వారని ఆయన్ని ఎరిగిన వారందరికీ తెలుసు.

వారి చొరవతోనే నిద్రావస్థలో ఉన్న మదనపల్లె చేతన కళాపరిషత్ కాస్తా మదనపల్లె రచయితల సంఘం (మరసం) గా మార్పు చెంది నిరవధికంగా సాహిత్య కార్యక్రమాలు మొదలు పెట్టింది. అని రచయిత టి.ఎస్.ఎ.కృష్మూర్తి గుర్తుచేసుకున్నారు.

రచనలు

మార్చు

సంస్కృతం

మార్చు
  • కలిచెర్ల శ్రీ పట్టాభిరామ సుప్రభాతం
  • యక్షప్రశ్నోపాఖ్యానం
  • ఘోషయాత్ర

తెలుగు

మార్చు

పద్యకావ్యాలు

మార్చు
  • విషాద మాధవి
  • చరిత్రకెక్కిన మారణహోమం
  • ఒక రాఘవరెడ్డి కథ
  • ఓరుగల్లు - వీరగల్లు

నాటకాలు

మార్చు
  • దివిలో కవిసమ్మేళనం
  • అన్వేషణ - అంభి
  • ఆ నవ్వే
  • జింకపిల్ల
  • గుండె ఊసులాడింది

నవలలు

మార్చు

వ్యాస సంపుటులు

మార్చు
  • ఈ పద్యం నేర్చుకుందామా!
  • వెలుగు తగ్గిన తెలుగు

పురస్కారాలు, బిరుదులు, గుర్తింపు

మార్చు
  • 9వ ఆటా మహాసభల కథల పోటీలో రూ. 7000 పారితోషికం అందుకున్న కథకు రచయిత
  • 9వ ఆటా మహాసభల వ్యాసాల పోటీలో రూ. 15000 పారితోషికం అందుకున్న వ్యాసం రచయిత

వీరు 2016, జనవరి 11వ తేదీ మదనపల్లెలో మృతిచెందారు.

మూలాలు

మార్చు
  1. శ్రీనివాసరావు, కారుసాల (జూన్ 16, 2014). "జిల్లా సాహితీ ప్రియులను అలరించేచారిత్రక నవల బోయ కొట్టములు పన్నెండు". ప్రజాశక్తి. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 8 December 2014.

బయటి లంకెలు

మార్చు