అష్టనాగములు లలో ఒకడు:

జననం మార్చు

కశ్యపుడు, అతని మూడవ భార్య కద్రువ కు వాసుకి, తక్షకుడు, అనంతుడు, కర్కోటకుడు, కాళియుడు, పద్మ, మహాపాదుడు, శంఖుడు, పింగళుడు జన్మించారు. తల్లి కారణంగా నాగులకు ‘కద్రుజ’ అనే పేరు వచ్చింది.[1]

       (అ.) 1. అనంతుడు, 2. శేషుడు, 3. వాసుకి, 4. కర్కాటకుడు, 5. తక్షకుడు, 6. శంఖపాలుడు, 7. మహాపద్ముడు, 8. పద్ముడు.
       (ఆ.) 1. అనంతుడు, 2. తక్షకుడు, 3. వాసుకి, 4. శంఖపాలుడు, 5. పద్ముడు, 6. కర్కోటకుడు, 7. క్రోకుడు, 8. కాలుడు. [వివేకచింతామణి]
       (ఇ.) 1. అనంతుడు, 2. శేషుడు, 3. తక్షకుడు, 4. కర్కోటకుడు, 5. శంఖపాలుడు, 6. భూధరుడు, 7. కులికుడు, 8. మహాపద్ముడు.

మహాభారతము నందు ఉపోద్ఘాతము ముగింపబడిన వెనుక ఈనాగులచరిత్ర మొదట చెప్పబడినది. కశ్యపుడను నార్యునకు కద్రువ, వినతయను నిరువురు భార్యలుగలరు. వీరిరువును తోబుట్టువులు. వీరికింగల యభిమతంబుల చొప్పున కద్రువకు సహస్రనాగములు జనించినవి. వినతకు గరుడుడు జన్మించెను. కద్రువకు జనించిన సహస్రనాగములకు బుట్టిన సంతతియే లోకమునందలి నాగకులముగానున్నది. ఈ నాగులలో బ్రముఖముగా నుండినవారు శేషుడు, వాసుకి, ఇరావంతుడు, తక్షకుడు, కర్కోటకుడు, కాళీయుడు, ఐలుడు, ఇలాపాత్రుడు, నీలుడు, అనీలుడు, నహుషుడు మొదలగువారు. (అనంతుడు, వాసుకి, తక్షకుడు, శంఖపాలుడు, కుళికుడు, పద్ముడు, మహాపద్ముడు, కర్కోటకుడు వీరినే అష్టనాగములు అని మన గ్రంథములు పేర్కొనుచున్నవి.) కద్రువ వినతకు జేసిన యపకారమునుబట్టి వినతకు బుట్టిన గరుత్మంతుడు నాగకులమునకెల్లను వైరియయ్యెను. దీనికిదోడు మాతృశాపముగూడ నాగులకు సంభవించెను.

మూలాలు మార్చు

  1. సాక్షి, ఫ్యామిలీ (15 July 2016). "నేడు వరల్డ్ స్నేక్ డే". Sakshi. Archived from the original on 28 May 2017. Retrieved 30 June 2020.