పింగళుడు
పింగళ (Devanagari: पिङ्गल piṅgala) ప్రాచీన భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన ప్రసిద్ధ గణిత గ్రంథం "చంధః శాస్త్రము" యొక్క రచయిత. ఈ గ్రంథం సంస్కృతంలో గల ప్రాచీన గ్రంథం. ఈయన భారత సాహిత్య చరిత్రలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త "పాణిని" లేదా ప్రముఖ గ్రంథం "మహాభాష్య" రచయిత "పతంజలి" యొక్క సోదరునిగా చెప్పబడుతోంది.[1]
పింగళుడు | |
---|---|
జననం | క్రీ.పూ 4 వ శతాబ్దం షలతుల, ఇండియా |
నివాసం | భారత దేశము |
జాతీయత | భారతీయుడు |
రంగములు | గణిత శాస్త్రము, సంస్కృత వ్యాకరణం |
ప్రసిద్ధి | "చందస్సు శాస్త్రము " రచయిత |
ప్రభావితం చేసినవారు | ఫిబోనాకి సంఖ్యలు, ద్విసంఖ్యా వ్యవస్థ, అంకగణిత త్రిభుజం |
"ఛందస్సు శాస్త్రము" ఎనిమిది అధ్యాయాలతో కూడినది. ఈ గ్రంథములో అన్ని అథ్యాయములలో గణిత భావనలు సూత్రములుగా వివరింపబడినవి. ఈ భావనలు పాఠ్యంగా విస్తరింపబడలేదు. ఈ గ్రంథం క్రీస్తు పూర్వానికి చివర్లో గానీ[2] లేదా క్రీస్తు శకానికి ముందుగా గానీ[3] రచింపబడు యుండవచ్చు. ఈ గ్రంథం వైదిక, సాంప్రదాయక విధానంలో సంస్కృతంలో వ్రాయబడింది. 10 వ శతాబ్దానికి చెందిన గణిత శాస్త్రవేత్త "హలాయుధ" ఈ గ్రంథమునకు భాష్యం వ్రాసాడు, ఈ గ్రంథాన్ని విస్తరించాడు.
ఛందః శాస్త్ర
మార్చుఈ గ్రంథంలో ద్విసంఖ్యామానం గూర్చి వివరణలు ఉన్నాయి. ఈ సంఖ్యా వ్యవస్థలో సంఖ్య లను వ్రాసే విధానం వివరించబడినది.[4] ఈ వివరణల ప్రకారం ద్విపద సిద్ధాంతం ఆధారంగా "కాంబినారోటిక్స్ "ను వివరించబడింది. హలాయుధుడు పాస్కల్ త్రిభుజం గూర్చి వివరణలు వ్రాసాడు. పింగళుడు ఫిబోనాకీ సంఖ్యలు (మాత్రమేరు) గూర్చి వివరించాడు. ఈ సంఖ్యలు ప్రస్తుతం "గోపాల హేమచంద్ర సంఖ్యలు"గా పిలువబడుతున్నాయి[5].ద్విస్ంఖ్యామానంలో సున్న యొక్క ఉపయోగాన్ని కొన్ని సార్లు తప్పుగా చెప్పబడింది.ఎందువలనంటే ప్రస్తుతం ద్విసంఖ్యామానంలో 0 లేదా 1 సంఖ్యలను వాడుతున్నాము. ఉదాహరణకు 1 0 (2) అనగా ద్విసంఖ్యామానంలో "2" అని అర్థము.
ప్రచురణలు
మార్చు- A. Weber, Indische Studien 8, Leipzig, 1863.
- Bibliotheca Indica, Calcutta 1871-1874, reprint 1987.
నోట్సు
మార్చు- ↑ Maurice Winternitz, History of Indian Literature, Vol. III
- ↑ R. Hall, Mathematics of Poetry, has "c. 200 BC"
- ↑ Mylius (1983:68) considers the Chandas-shāstra as "very late" within the Vedānga corpus.
- ↑ Van Nooten (1993)
- ↑ Susantha Goonatilake (1998). Toward a Global Science. Indiana University Press. p. 126. ISBN 978-0-253-33388-9.
యివికూడా చూడండి
మార్చుసూచికలు
మార్చు- Amulya Kumar Bag, 'Binomial theorem in ancient India', Indian J. Hist. Sci. 1 (1966), 68–74.
- George Gheverghese Joseph (2000). The Crest of the Peacock, p. 254, 355. Princeton University Press.
- Klaus Mylius, Geschichte der altindischen Literatur, Wiesbaden (1983).
- Van Nooten, B. (1993-03-01). "Binary numbers in Indian antiquity". Journal of Indian Philosophy. 21 (1): 31–50. doi:10.1007/BF01092744. Retrieved 2010-05-06.[permanent dead link]
యితర లింకులు
మార్చు- Math for Poets and Drummers, Rachel W. Hall, Saint Joseph's University, 2005.
- Mathematics of Poetry, Rachel W. Hall