కర్ణాటక రాజులు

(కర్నాటక రాజులు నుండి దారిమార్పు చెందింది)

సుప్రసిద్ద చరిత్రకారుడైన బుద్ధరాజు వరహాల రాజు గారు తన శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అను పుస్తకంలో ఆంధ్ర దేశంలో తూర్పు చాళుక్య, కోట, పరిచ్చెద, విష్ణుకుండిన, కాకతీయ వంటి తెలుగు క్షత్రియ సామ్రాజ్యాల పతనానంతరము ఆత్రేయ, పశుపతి, విశ్వామిత్ర, భరద్వాజ గోత్రముల వారు కర్ణాటక రాష్ట్రంలో దత్త మండలానికి వలసవెళ్ళారని, అనాటినుండి కర్ణాటక క్షత్రియులుగా (లేదా అరసులు) పిలువబడుతున్నారని వ్రాసిరి. భరద్వాజ గోత్రపు క్షత్రియుల జాడ మాత్రము తెలియరాకున్నది. గోత్ర నామములు, ఆచార వ్యవహారములను బట్టి కర్ణాటక రాజుల పూర్వీకులు హోయసాలులు, పశ్చిమ చాళుక్యులు, కదంబులు, హంపి విజయనగర రాజులు అయివుండవచ్చునని పలు చరిత్రకారుల ఊహ. కర్ణాటక రాజులు కర్ణాటక రాష్ట్రంలోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాల్లోను, నెల్లూరు జిల్లాల్లోనూ, గోదావరి జిల్లాల్లో కొద్దిపాటిగా కనిపిస్తారు. వీరిని కర్ణాటకలో అరసు అని, ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ రాజులు అని పిలుస్తారు. భారతీయ రిజర్వేషన్ సిష్టమ్ ప్రకారం కర్ణాటక రాష్ట్రంలో వీరు O.B.C విభాగానికి చెందుతారు.[మూలాలు తెలుపవలెను]

వి జ య న గ ర సామ్రాజ్యము

మార్చు

హంపి-విజయనగర సామ్రాజ్య రాజుల్లో అరవీటి వంశమువారు ఆత్రేయస, కౌషిక/విశ్వామిత్ర గోత్రమునకు చెందినవారని సదాశివ రాయలు (1542-1570) శిలాశాసనములు తెలుపుచున్నవి.[1] వీరు కర్ణాటకలోని విజయనగరమును రాజధానిగా ఏర్పాటు చెసుకున్నప్పటికీ, తదుపరి ఆంధ్ర ప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన పెనుగొండ అను ఊరును రాజధానిగా చెసుకొని దశాబ్దాలపాటు తెలుగు నాడును పాలించారు. వీరు గుంటూరు జిల్లాలోని కొండవీడు రెడ్డి రాజులను ఓడించి కొండవీడును రాజధానిగా చెసుకుని రాజమహేంద్రవరం వరకు పాలించారు, వీరిని హైదరాబాదు నిజాములు ఓడించి కొండవీడును స్వాధీనపరచుకున్నారు. ( ఆవిర్భావం -1336& పతనం -1646)

    • సంగమ వంశము
  • మొదటి హరిహర రాయలు 1336-1356
  • మొదటి బుక్క రాయలు 1356-1377
  • రెండవ హరిహర రాయలు 1377-1404
  • విరూపాక్ష రాయలు 1404-1405
  • రెండవ బుక్క రాయలు 1405-1406
  • మొదటి దేవ రాయలు 1406-1422
  • రామచంద్ర రాయలు 1422
  • వీర విజయ బుక్క రాయలు 1422-1424
  • రెండవ దేవ రాయలు 1424-1446
  • మల్లికార్జున రాయలు 1446-1465
  • రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
  • ప్రౌఢ రాయలు 1485
    • సాళువ వంశము
  • సాళువ నరసింహ దేవ రాయలు 1485-1491
  • తిమ్మ భూపాలుడు 1491
  • రెండవ నరసింహ రాయలు 1491-1505
    • తుళువ వంశము
  • తుళువ నరస నాయకుడు 1491-1503
  • వీరనరసింహ రాయలు 1503-1509
  • శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
  • అచ్యుత దేవ రాయలు 1529-1542
  • సదాశివ రాయలు 1542-1570
    • ఆరవీటి వంశము
  • అళియ రామ రాయలు 1542-1565
  • తిరుమల దేవ రాయలు 1565-1572
  • శ్రీరంగ రాయలు 1572-1586
  • వెంకట II 1586-1614
  • శ్రీ రంగ రాయలు 2 1614-1614
  • రామదేవ 1617-1632
  • వెంకట III 1632-1642
  • శ్రీరంగ III 1642-1646

విజయనగరం సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావనియెల్లా తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము.

  • పలు చరిత్రకారుల అభిప్రాయాల మేరకు కాకతీయ రాజ్యములో ధాన్యాగార అధ్యక్షులుగా ఉన్న హరిహర రాయ, బుక్కరాయలు కాకతియ రాజ్య పతనానంతరం కర్నాటకలోని హంపి వెల్లి అక్కడ విజయ నగర సామ్రాజ్యమును స్థాపించి 4 దశాబ్దాల పాటు దక్షిణ భారతదేశమును పాలించి కీర్తి ప్రతిష్ఠలు పొందారు.
  • మరికొందరు చరిత్ర కారుల అభిప్రాయము ప్రకారము వీరు కోట రాజ్య సైన్యాధ్యక్షులుగా యుండి తదుపరి హంపినకు పయనమయ్యి అక్కడ విజయ నగర సామ్రాజ్య స్థాపన గావించారని తెలియుచున్నది (గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొంతమంది ధనుంజయ గోత్రీకులు, ఆత్రేయ గోత్ర ఋషి ప్రవరను వాడుకొనుట జరుగుచున్నది -"శ్రీమదాత్రేయ,అత్యనానస ధనుంజయ త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గొత్ర:" ->దండు, కొండూరి, దంతలూరి, రేనాటి.)

గోత్రాలు, గృహనామాలు

మార్చు

విశ్వామిత్ర / కౌశిక గోత్రము:

ఋషిప్రవర: విశ్వామిత్ర, దేవరత, ఔద్వాల

గృహనామాలు:

దాలవాయి, సిద్ధిరాజు, పోచరాజు, సింహాద్రి, కస్తూరి, తిమ్మరాజు, వరదరాజు.

ధనుంజయ గోతము

గుంటుమడుగు, చెలమగుంట, కాశి, వడ్లమూడి, వానపాల, నందిమండలం, అరవీటి, రాచకొండ, పాండురాజు,

ఆత్రేయ గోత్రము:

సప్తర్షులలో ఆత్రేయ మహర్షి ప్రముఖమైనటువంటి వాడు, నవగ్రహములలో ముఖ్యుడు, మానవులకు ఆప్త బంధువు అయినటువంటి చంద్రుడు ఆత్రేయ మహర్షి యొక్క పుత్రుడు.అందుకే ఆత్రేయ గోత్రం చంద్ర వంశంలో ప్రముఖమైనది.

ఆత్రేయస గోత్రీకులకు 3 ఋషి ప్రవరలు ఉన్నాయి.

1.శ్రీమద్ వైశ్వామిత్ర, మధుచ్చంధో, ఆత్రేయత్ర, యార్లేయ, ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర:

2.శ్రీ అఘమర్షణ మధుచ్చందో ఆత్రేయస త్రయార్షేయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర:

3.శ్రీమద్ ఆత్రేయ అర్యనాసన ఆత్రేయస, త్రయార్షేయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర:

రాజప్రవరులు : శ్రీ భారత్ పరీక్షిత్ విష్ణువర్ధన మహా రాజ, కోటహరిసీమ కృష్ణ రాజ వంశ:

ఆత్రేయస గోత్రీకుల గృహనామాలు:

1.ఆత్మకూరి, 2.గూడూరి, 3.మందపల్లి,4.నరహరి (నరపతి),5.సమ్మెట, 6.బొప్పరాజు, 7.బెదదకోట, 8.సామునూరు, 9.ఎర్రగుడి, 10.రొసిరాజు, 11.కొండూరి, 12.ఆల్లగడ్డ, 13.రాచకొండ,14.పాండురాజు, 15.కౌడి, 16.గొబ్బూరి, 17.దండు, 18.పోలేపల్లి, 19.సిద్ధిరాజు, 20.అయ్యపురాజు, 21.బొబ్బూరి, 22.వల్లభరాజు, 23కడపరాజు, 24.కడిమెల్ల, 25.రుద్రవరం, 26.వెంగమరాజు, 27.రేనాటి, 28.నంధ్యాల, 29.ఆర్వేటి, 30.గంధం, 31.కంపరాజు, 32.ఆనెగొంధె, 33.గణితం, 34.పూసపాటి, 35.మనువోలు, 36.పాయసం, 37.ఈశ్వరరాజు, 38.బులిరాజు, 39.శకునాల, 40.ఉమాపతి, 41.దుర్వాసుల, 42.కాశిరాజు, 43.సాళువ, 44.మలరాజు, 45.సిరిగిరి, 46.చిట్టారి, 47.కొండ్రాజు, 48.కాళహస్తి,49.మల్లపురాజు, 50.ఆకేటి, 51.చక్రవర్తుల, 52.దంతులూరి, 53.పోసలదీవి, 54.కొల్లూరు, 55.జగరాజు, 56.రాయదుర్గం, 57.వరదరాజు, 58.శంకుపల్లి.

ఆత్రేయస గోత్రీకులు (హ౦పి విజయనగర) 300 సంవత్సరాల పాటు, కర్నాటక, ఆంధ్రప్రదేశమును యేలినారు, వీరు సాళువ, ఆరవీడు వంశజులకు లకు చెందినవారు.వీరు (చంద్ర వంశీకులు).

భరద్వాజ గోత్రము:

భరద్వాజ గోత్రీకుల ఇంటిపేర్లు: 1.బోరుకాటి.

పశుపతి ఋషి గోత్రము:

గృహనామాలు:

అలుగునూరు, అనతరాజు, అంజిరాజు, అయ్యపరాజు, బాలరాజు, బయల్రాజు, బేతరాజు, బోగరాజు, బొంతరాజు, బుట్టమరాజు, చామర్తి, చేజెర్ల, చెన్నమరాజు, చెన్నపాయి, చెవురు, చిండ, చొక్కరాజు, చిబ్యాల, దాసనపు, దక్షిరాజు, దాలవాయి, దొమ్మరాజు, గాది, గౌరీపురం, గోవిందరాజు, గున్లపల్లి, హస్తి, ఇంకుల, జగదాభి, కల్వల (కలువల), కంపరాజు, కంచిరాజు, కత్రి, కొండూరు, కొచెర్ల, లింగరాజు, మేడిదరాజు, మధులూరు, నంద్యాల, నిమ్మరాజు, పద్మరాజు, పాతరపల్లి, పెద్దిరాజు, పెనుగొండ, రాఘవ, సంగమ, సంగరాజు, సోలరాజు, తిప్పరాజు, ఉమ్మలరాజు, వలవర్తి, వనిపంత, వెలిగండ్ల, వెంకటరాజు, యెడవల్లి, యల్లతురు, యర్రమరాజు.

(వ్యాసము విస్తరణలో ఉంది.)

ఇంకా చదవండి

మార్చు

లంకెలు

మార్చు
  1. Heras, Henry (1927). The Aravidu Dynasty of Vijayanagara. Studies in Indian History of the Indian Historical Research Institute. Richard Carnac Temple (preface). Madras: B.G. Paul & co., St. Xavier's College, Mumbai. LCCN 44039155. OCLC 779364. OL 6475823M. Retrieved 25 December 2014.