కల్వకుంట్ల సంజయ్

కల్వకుంట్ల సంజయ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయనను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో కోరుట్ల శాసనసభ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది.[2][3]

కల్వకుంట్ల సంజయ్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
3 డిసెంబర్ 2023 - ప్రస్తుతం
నియోజకవర్గం కోరుట్ల

వ్యక్తిగత వివరాలు

జననం (1976-10-18) 1976 అక్టోబరు 18 (వయసు 47)
రాఘవపేట, మల్లాపూర్ మండలం, జగిత్యాల జిల్లా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సరోజన
జీవిత భాగస్వామి దీప్తి
సంతానం ఆరుష్‌ (కొడుకు), సాషా (కూతురు)
నివాసం మెట్‌పల్లి
హైదరాబాద్‌, తెలంగాణ భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభ్యాసం

మార్చు

కల్వకుంట్ల సంజయ్ 1976 అక్టోబరు 18న తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం, రాఘవపేట గ్రామంలో కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సరోజన దంపతులకు జన్మించాడు. ఆయన 1991 నుండి 93లో గుంటూరులోని విజ్ఞాన్ కళాశాలలో జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం (BiPC) ఇంటర్మీడియట్‌, మైక్రోబయాలజీ & బయోకెమిస్ట్రీలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

సంజయ్ 1999లో బి.ఎం పటేల్ మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్, 2003లో ఎం.ఎస్  మైసూర్‌లోని జెఎస్ఎస్ మెడికల్ కాలేజీ నుండి ఆర్థోపెడిక్స్‌, 2005లో సౌత్ కోర్స్‌కి, ఆ తర్వాత సింగపూర్‌, ఆ తర్వాత డెన్మార్క్‌ లో వెన్నెముక శస్త్రచికిత్సలో స్పెషలైజేషన్ పూర్తి సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో ప్రాక్టీస్ మొలలు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచే వరకు చీఫ్ స్పైన్ కన్సల్టెంట్ గా పని చేశాడు.[4]

రాజకీయ జీవితం

మార్చు

కల్వకుంట్ల సంజయ్ తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించగా, ఆయన బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పై 10035 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5][6]

ఆస్తులు-కేసులు

మార్చు
  • 2023 ఎన్నికల అఫిడివిట్ ప్రకారం ఆస్తులు 62,41,98,700 రూపాయలు.[7]
  • ఇతనిపై ఎలాంటి కేసులు లేవు.[7]

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (6 November 2023). "కల్వకుంట్ల సంజయ్". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
  2. Namasthe Telangana (22 August 2023). "పాతకొత్తల మేళవింపుతో జాబితా". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  3. Eenadu (4 December 2023). "తొలి అడుగులోనే సంచలన గెలుపు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  4. Namaste Telangana (4 December 2023). "తొలిసారి అధ్యక్షా..!". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  5. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  6. News18 తెలుగు (4 December 2023). "అసెంబ్లీలో అధ్యక్షా అననున్న డాక్టర్లు.. ఎమ్మెల్యేలుగా 16 మంది వైద్యులు..!". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. 7.0 7.1 "Kalvakuntla Sanjay(BRS):Constituency- KORATLA(JAGTIAL) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2023-11-26.