ధర్మపురి అరవింద్

ధర్మపురి అరవింద్ (జ. 1976 ఆగస్టు 25) తెలంగాణ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంట్ సభ్యుడు. ఈయన నిజామాబాదు లోక్‌ సభ నియోజకవర్గం నుండి పోటీచేసి పార్లమెంటు సభ్యునిగా గెలుపొందాడు.[1] అతను 1995/96 లో హైదరాబాదులో ఫస్టు క్లాస్ క్రికెట్ మ్యాచ్ లలో ఆడాడు. [2] అతను నిజామాబాదు నుండి మూడు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ తరపున శాసనసభ్యునిగా ఎన్నికైన డి.శ్రీనివాస్ కు చిన్నకుమారుడు. [3][4]

ధర్మపురి అరవింద్

లోక్‌సభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
ముందు కల్వకుంట్ల కవిత (2014-2019)
నియోజకవర్గం నిజామాబాద్ తెలంగాణ

వ్యక్తిగత వివరాలు

జననం (1976-08-25) 1976 ఆగస్టు 25 (వయస్సు 45)
నిజామాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (బి.జె.పి)
వృత్తి పార్లమెంటు సభ్యుడు, వ్యాపారవేత్త

రాజకీయ జీవితంసవరించు

ఈయన తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె అయిన కె. కవితపై పోటీచేసి గెలుపొందాడు.[5]

చదువు వివాదంసవరించు

ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో త‌ప్పుడు వివ‌రాలు పొందుప‌రిచార‌ని, పీజీ చ‌ద‌వ‌కున్నా చదివిన‌ట్లు చూపించార‌ని టీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ప‌క్కాగా సేకరించారు. డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్ ద్వారా రాజ‌స్థాన్‌లోని జ‌నార్ధ‌న్ రాయ్ న‌గ‌ర్ రాజ‌స్థాన్ విద్యాపీఠ్ యూనివ‌ర్సిటీ నుంచి దూర విద్య ద్వారా ఎంఏ పొలిటిక‌ల్ సైన్స్ చ‌దివిన‌ట్లు అర్వింద్ త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో పొందుప‌రిచాడు. రాజ‌స్థాన్‌లోని స‌ద‌రు యూనివ‌ర్సిటీలో ధ‌ర్మిపురి అరవింద్ చ‌దివారా, లేదా అనేది ఆర్టీఐ ద్వారా అడిగారు టి.ఆర్.ఎస్ నేతలు. అయితే, ఆ పేరుతో త‌మ యూనివ‌ర్సిటీలో ఎవ‌రూ చ‌ద‌వ‌లేద‌నే స‌మాధానం వ‌చ్చింద‌ని టీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు[5].

మూలాలుసవరించు

  1. "My father has nothing to do with my joining BJP: D Aravind". The Hindu (in ఇంగ్లీష్). Special Correspondent. 29 June 2018. ISSN 0971-751X. Retrieved 1 February 2019.{{cite news}}: CS1 maint: others (link)
  2. "Dharmapuri Arvind". ESPN Cricinfo. Retrieved 16 April 2016.
  3. http://www.myneta.info/LokSabha2019/candidate.php?candidate_id=4828
  4. https://m.timesofindia.com/elections/candidates/arvind-dharmapuri
  5. 5.0 5.1 "ధ‌ర్మ‌పురి అరవింద్ చ‌దువుపై ర‌గ‌డ‌.. ప‌క్కాగా ఇరికిస్తున్న టీఆర్ఎస్‌". newssting. Retrieved 2020-05-21.

బాహ్య లంకెలుసవరించు