కోరుట్ల శాసనసభ నియోజకవర్గం

కోరుట్ల శాసనసభ నియోజకవర్గం,జగిత్యాల జిల్లాలోని 5 శాసనసభ స్థానాలలో ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులుసవరించు

Year A. C. No. Assembly Constituency Name Type of A.C. Winner Candidates Name Gender Party Votes Runner UP Gender Party Votes
2018 20 కోరుట్ల జనరల్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పురుషుడు తెలంగాణ రాష్ట్ర సమితి జువ్వాడి నర్సింగరావు పురుషుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ
2014 20 కోరుట్ల జనరల్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పురుషుడు తెలంగాణ రాష్ట్ర సమితి 58890 జువ్వాడి నర్సింగరావు పురుషుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 38305
2010 ఉప ఎన్నికలు కోరుట్ల జనరల్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పు తెలంగాణ రాష్ట్ర సమితి 80495 జువ్వాడి రత్నాకర్ రావు పు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 23970
2009 20 కోరుట్ల జనరల్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పు తెలంగాణ రాష్ట్ర సమితి 41861 జువ్వాడి రత్నాకర్ రావు పు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 26316

1999 ఎన్నికలుసవరించు

1999 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి టి.వెంకట రమణారెడ్డి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.రాములుపై 11523 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.

2004 ఎన్నికలుసవరించు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మెట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతా పార్టీకి చెందిన కొమిరెడ్డి రాములు తన సమీప ప్రత్యర్థి అయిన ఇండిపెండెంట్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్ రావుపై 5598 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. కొమిరెడ్డి రాములుకు 31917 ఓట్లు రాగా, విద్యాసాగర్ రావుకుకి 26319 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలుసవరించు

2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మొదటిసారి కోరుట్ల నియోజకవర్గంగా శాసనసభ ఎన్నికలు జరిగాయి. ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్,బిజెపి,తెదేపా,తెరాస,పీఆర్పీ,బిఎస్పీ,పీపీఐ, లోక్ సత్తాలు బరిలో ఉన్నాయి. మహాకూటమి (తెరాస) అభ్యర్థిగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కాంగ్రెస్ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావుపై పోటీకి దిగారు. నియోజకవర్గంలో మొత్తం 1,91,853 ఓటర్లు ఉండగా, 1,29,293 ఓట్లు పోలవ్వగా, విద్యాసాగర్ రావుకు 41,861, రత్నాకర్ రావుకు 26,316 ఓట్లు రాగా 15,545 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 3,4 స్థానాలలో వరుసగా పీఆర్పీ, బిజెపిలు నిలిచాయి.

2010 ఎన్నికలుసవరించు

తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెరాస శాసనసభ్యులందరూ రాజీనామా చేయడంతో 2010లో ఉపఎన్నికలు జరిగాయి. అదే స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి రత్నాకర్ రావు, తెదేపా అభ్యర్థి శికారి విశ్వనాథం బరిలో ఉన్నారు. మొత్తం ఓట్లలో విద్యాసాగర్ రావుకు 80,495 మొత్తం ఓట్లు పోలవ్వగా, ప్రత్యర్థి అయిన జువ్వాడి రత్నాకర్ పై 56,525 ఓట్ల మెజారిటీతో రెండో సారి విజయం సాధించారు. 2009 ఎన్నికలతో పోలిస్తే దాదాపు నాలుగింతల అధిక మెజారిటీ ఓట్లతో విద్యాసాగర్ ను గెలిపించి తెలంగాణ వాదాన్ని చాటారు నియోజకవర్గ ప్రజలు. ఈ ఎన్నికల్లో పోటీ చేసినా తెదేపా పార్టీ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి కంటే 1074 ఓట్లు తక్కువ పొందడం గమనించాల్సిన విషయం.

ఇవి కూడా చూడండిసవరించు