కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున కోరుట్ల శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2018 - ఇప్పటి వరకు | |||
నియోజకవర్గం | కోరుట్ల, తెలంగాణ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నవంబర్ 10, 1953 రాఘవపేట, మల్లాపూర్ మండలం, జగిత్యాల జిల్లా | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | పాపారావు, సత్తమ్మ | ||
జీవిత భాగస్వామి | సరోజన | ||
సంతానం | డాక్టర్ సమత, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ | ||
నివాసం | కోరుట్ల, తెలంగాణ |
జననం
మార్చువిద్యాసాగర్ రావు 1953, నవంబరు 10న పాపారావు, సత్తమ్మ దంపతులకు జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం, రాఘవపేట అనే గ్రామంలో జన్మించాడు.
విద్యాభ్యాసం
మార్చుస్వగ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం, జగిత్యాలలో పదో తరగతి, నిజామాబాదు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్, హైదరాబాదులోని వివేకవర్ధిని కళాశాలలో బి.ఏ. పూర్తి చేశారు.
వ్యక్తిగత జీవితం
మార్చువిద్యాసాగర్ రావుకు సరోజనతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (సంజయ్),[3] ఒక కుమార్తె (సమత) ఉన్నారు.
రాజకీయ విశేషాలు
మార్చు1997లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1998లో మెట్‌పల్లి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2001లో ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ తరపున గెలుపొంది, జెడ్పీలో టిడిపి పక్ష నాయకుడిగా ఉన్నారు. 2002 నుంచి మూడేళ్ళ పాటు కరీంనగర్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా పని చేశారు. 2004 సాధారణ ఎన్నికల్లో టిడిపి, బిజెపి పొత్తు కారణంగా మెట్‌పల్లి అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీడీపీ మెట్‌పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న ఆయన, తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోవాలనే సంకల్పంతో 2008లో కెసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పునర్విభజనలో భాగంగా నియోజకవర్గంగా ఏర్పడిన కోరుట్ల నుంచి 2009లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి అప్పటి దేవాదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావుపై గెలుపొందారు. 2010 ఫిబ్రవరిలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2010 జూన్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి రత్నాకర్ రావుపై రెండవసారి భారీ మెజారిటీతో గెలుపొందారు.[4] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు పై 20,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5] 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు పై 31,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచాడు.[6][7] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[8]
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ, జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[9][10]
ఇతర పదవులు
మార్చువిద్యాసాగర్ రావు 15 సెప్టెంబర్ 2021న తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యునిగా నియమితుడై,[11][12][13] సెప్టెంబర్ 27న శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేశాడు.[14]
ఇతర వివరాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ Kalvakuntla Vidyasagar Rao. "Kalvakuntla Vidyasagar Rao". Myneta.info. Retrieved 28 April 2019.
- ↑ Sakshi (1 August 2022). "ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు". Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
- ↑ Kalvakuntla Vidyasagar Rao. "Korutla Assembly Elections". Archived from the original on 28 ఏప్రిల్ 2019. Retrieved 28 April 2019.
- ↑ Kalvakuntla Vidya Sagar Rao. "Kalvakuntla Vidya Sagar Rao". nocorreption.in. Retrieved 28 April 2019.
- ↑ Eenadu (9 November 2023). "విద్యాసాగర్‌రావుల హ్యాట్రిక్ విజయాలు". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ "Assembly Election result 2018: TRS' Kalvakuntla Vidyasagar Rao wins from Koratla constituency". www.timesnownews.com (in ఇంగ్లీష్). 2018-12-11. Archived from the original on 2019-03-01. Retrieved 2021-10-11.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2019-04-01 suggested (help) - ↑ Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 జూలై 2021. Retrieved 15 July 2021.
- ↑ Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
- ↑ Andhrajyothy (27 January 2022). "టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
- ↑ Eenadu (16 September 2021). "తితిదే బోర్డు సభ్యుడిగా ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు". Archived from the original on 11 జనవరి 2022. Retrieved 11 January 2022.
- ↑ TV9 Telugu (15 September 2021). "25 మందితో టీటీడీ పాలక మండలి.. తుది జాబితా ఖరారు చేసిన ఏపీ సర్కార్". Archived from the original on 4 January 2022. Retrieved 4 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV (16 September 2021). "తిరుమల నూతన పాలకమండలి.. సభ్యుల జాబితా ఇదే | List of members of the new governing body of Tirumala" (in telugu). Archived from the original on 16 September 2021. Retrieved 4 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Namasthe Telangana (27 September 2021). "టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.