కళావతి 2016లో విడుదలైన కామెడీ హర్రర్ సినిమా. తమిళ్ లో అరణ్మనై 2 పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో కళావతి పేరుతో దుబ్బింగ్ చేసి విడుదల చేశారు. గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్ నిర్మించిన ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించాడు. త్రిష, సిద్దార్థ్, సుందర్.సీ, హన్సిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 29 జనవరి 2016న విడుదలైంది.[1]

కళావతి
దర్శకత్వంసుందర్.సీ
రచనవెంకట్ రాఘవన్
సుందర్.సీ
స్క్రీన్ ప్లేసుందర్.సీ,
ఎసిబి. రామ దాస్
నిర్మాతఖుష్బూ
తారాగణంత్రిష
సిద్దార్థ్
సుందర్.సీ
హన్సిక
పూనమ్ బజ్వా
కోవై సరళ
ఛాయాగ్రహణంయుకె. సెంథిల్ కుమార్
కూర్పుశ్రీకాంత్.ఎన్.బి
సంగీతంహిప్హాప్ తమిజా
విడుదల తేదీ
29 January 2016 (2016-01-29)
సినిమా నిడివి
136 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కోవిలూర్ గ్రామంలో అమ్మవారి విగ్రహానికి కుంభాభిషేకం చేయడం కోసం ఆ ఊరి పెద్దలు సిద్ధమవుతారు. అందుకోసం ఆ విగ్రహానికి స్థానం భ్రంశం కలిగిస్తారు. దాంతో అప్పటివరకు అమ్మవారికి భయపడి ఎక్కడో దాక్కున్న ఆత్మలు ఒక్కసారిగా విజృంభిస్తాయి. దాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు స్వాములు కొన్ని ఆత్మలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఆ సమయంలో ఒక ఆత్మ ఆ ఊరి జమీందారు బంగళాలోకి వస్తుంది. ఇది తెలుసుకున్న మురళి(సిద్ధార్థ), కోడలు అనిత(త్రిష) ఊరికి వచ్చి అక్కడ ఏదో వుందనే విషయాన్ని ఇద్దరూ గ్రహిస్తారు. పట్టణం నుంచి వచ్చిన అనిత అన్నయ్య రవి(సుందర్ సి.) దాని గురించి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ఆత్మ జమీందారు కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? దానికి జరిగిన అన్యాయం ఏమిటి? ఆ ఆత్మ పగ తీర్చుకొని శాంతించిందా? దాన్ని ఆ బంగళా నుంచి పంపించేందుకు రవి ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు? అనేది మిగతా సినిమా కథ. [2]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • నిర్మాత:గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్
  • సమర్పణ: జవ్వాజి రామాంజనేయులు
  • దర్శకత్వం:సుందర్.సీ
  • రచన: వెంకట్ రాఘవన్, సుందర్.సీ
  • స్క్రీన్ ప్లే: సుందర్.సీ, ఎసిబి.రామ దాస్
  • సంగీతం: హిప్ హాప్ తమీజా
  • సినిమాటోగ్రఫీ: యుకె. సెంథిల్ కుమార్
  • ఎడిటింగ్: ఎన్.బి.శ్రీకాంత్
  • మాటలు: శశాంక్ వెన్నెలకంటి

మూలాలు

మార్చు
  1. The Times of India (28 October 2016). "Kalavathi Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 8 జూలై 2021. Retrieved 8 July 2021.
  2. Sakshi (29 January 2016). "'కళావతి' మూవీ రివ్యూ". Archived from the original on 8 జూలై 2021. Retrieved 8 July 2021.
  3. Sakshi (26 January 2016). "మేమిద్దరం స్నేహితులమే!". Sakshi. Archived from the original on 8 జూలై 2021. Retrieved 8 July 2021.