హన్సిక మోత్వానీ

సినీ నటి
(హన్సిక నుండి దారిమార్పు చెందింది)

హన్సికా మోత్వాని (మరాఠీ: हंसीका मोटवानी), భారతీయ సినిమా నటి, మాజీ బాల్యనటి

హన్సికా మోట్వాని
2023లో హన్సికా
జననం (1991-08-09) 1991 ఆగస్టు 9 (age 33)
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2001–2004 (బాల నటి)
2007–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సోహైల్ ఖతురియా
(m. 2022)

వ్యక్తిగత జీవితం

మార్చు

ముంబాయిలో జన్మించిన హన్సికా మోత్వాని ప్రస్తుతం పొద్దర్ అంతర్జాతీయ పాఠశాల ఏ లెవెల్లో 12వ తరగతి చదువుతున్నది. హన్సిక తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తుళు భాషలు మాట్లాడగలదు. ఈమె తండ్రి ప్రదీప్ మోత్వానీ వ్యాపరస్తుడు, తల్లి మోనా మోత్వానీ ప్రసిద్ధి చెందిన చర్మవైద్యురాలు (డెర్మటాలజిస్ట్). వీరిద్దరూ విడాకులు తీసుకొన్నారు. ప్రస్తుతము హన్సిక సంరక్షణా బాధ్యతలను తల్లి మోనా చూసుకొంటున్నది.

వివాహం

మార్చు

హన్సిక మోత్వానీ 2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్‌ కతూరియాతో రాజస్థాన్‌ జైపూర్‌లో వివాహం జరిగింది.[1]

నట జీవితం

మార్చు
  • హన్సిక చాలా సీరియళ్లలోను, సినిమాల్లోనూ చిన్నతనంలోనే నటించింది. 2001 నుంచే షకలక బూమ్ బూమ్.. హమ్ దో హై.. వంటి సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది.
  • అవే కాకుండా హవా, కోయ్ మిల్ గయా, అబ్రక దబ్రా, జాగో.. వంటి సినిమాల్లో కూడా కనిపించింది.
  • 2007లో పూరీజగన్నాధ్ తీసిన 'దేశముదురు' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా అందరి దృష్టినీ తన వైపుకు సునాయాసంగా మళ్లించుకోగలిగింది.
  • తర్వాత 2008లో జూనియర్ ఎన్టీఆర్ పక్కన 'కంత్రీ'లో ఆడిపాడింది. రామ్‌తో 'మస్కా' చిత్రంలో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. తర్వాత ప్రభాస్ నటించిన 'బిల్లా' సినిమాలో 'ప్రియ'గా గెస్ట్ రోల్‌లో నటించింది.
  • 'జయీభవ'తో కల్యాణ్‌రామ్‌తో జతకట్టినా ఆ చిత్రం వూహించిన అంచనాలను చేరుకోలేకపోయింది. తర్వాత నితిన్‌తో 'సీతారాముల కల్యాణం'లో నటించింది. అది కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దాంతోతన దృష్టిని తమిళ పరిశ్రమ వైపు మళ్లించింది.
  • అలా 2011లో 'మాప్పిళ్త్లె' సినిమాతో తమిళంలో బోణీ కొట్టినా విజయం మాత్రం దక్కలేదు. అయినా వెనుకడుగేయకుండా హిట్ కోసం పట్టు బట్టి మరీ తమిళంలో సినిమాలు చేస్తూనే వచ్చింది.
  • తమిళంలో విజయ్ సరసన నటించిన 'వెలాయుధం' సినిమాతో విజయాన్ని అందుకుంది.
  • అటు తమిళంలో సినిమాలు చేస్తూనే ఇటు తెలుగు సినిమాల పైనా దృష్టి సారించింది. 'కందిరీగ', 'ఓ మై ఫ్రెండ్', 'దేనికైనా రెడీ..', 'సమ్‌థింగ్.. సమ్‌థింగ్..' వంటి సినిమాలతో తెలుగు ప్రజల్ని పలకరిస్తూ.. హిట్‌లను తన ఖాతాలో జమ చేసుకుంది.
  • కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలో కూడా 'ఆప్ కా సరూర్' సినిమాతో ఈ అమ్మడి లక్‌ని పరీక్షించుకుంది. అక్కడ కూడా హిట్ కొట్టడంతో 'మనీ హై తో హనీ హై' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.
  • తన అందంతో ఎందరో కుర్రకారు మనసుల్ని ఉర్రూతలూగించిన హన్సిక తను శింభుకే సొంతమని అప్పట్లో ఓపెన్‌గా చెప్పేసింది. తమ గురించి హల్‌చల్ చేస్తున్న పుకార్లన్నిటికీ 'మేం లవ్‌లో ఉన్నమాట నిజమే' అంటూ ఫుల్‌స్టాప్ పెట్టేసిందీ జంట. కానీ, ఆ బంధం కాస్తా బెడిసికొట్టడంతో.. నా దృష్టంతా కెరీర్‌పైనే అని ప్రకటించింది.
  • కేవలం నటన పరంగానే కాకుండా మానవత్వం ఉన్న మనిషిగా కూడా హన్సికని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి పుట్టిన రోజుకీ ఒక అనాథ అమ్మాయి లేదా అబ్బాయిని దత్తత తీసుకుని ఆదరిస్తుందట! అలా ఈమె దత్తత తీసుకున్న పిల్లల సంఖ్య 20కి పైగానే ఉంటుంది.
  • ఈమెకు పాలంటే అస్సలు నచ్చవట. ఏ మాత్రం తీరిక దొరికినా వంట చేయడానికి ఆసక్తి చూపిస్తుందట! అలాగే ప్రయాణం చేస్తూ లోకమంతా చుట్టిరావడమంటే చాలా ఇష్టమట. ఇంట్లో ఆమెకున్న పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ తన బ్రదరే అంటూ కితాబిచ్చేస్తోంది.
  • 2013లో విడుదలైన సింగం-2లో నటనకుగాను అందరి ప్రశంసలూ అందుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ తమిళంలో 'బిరియాని', 'వాలు', 'వెట్త్టె మన్నన్'.. వంటి ఆరు సినిమా ప్రాజెక్టులతో వూపిరి సలపనంత బిజీ బిజీగా ఉంది. 2014లో తెలుగులో కూడా ఒక సినిమా చేయడానికి అంగీకరించింది.

చిత్రసమాహారం

మార్చు

బాల్యనటిగా ధారావాహికలలో

మార్చు
  • హమ్ దో హైనా --- కరీనా, కోయల్
  • క్యోంకీ సాస్ భీ కభీ బహూ థీ --- సావ్రీ
  • షక లక బూమ్ బూమ్ --- కరుణ
  • దేశ్ మే నిక్లా హోగా చాంద్ --- టీనా

వ్యాపార ప్రకటనలు

మార్చు

సినిమాలు

మార్చు
సినిమాలు
సంవత్సరం పేరు పాత్ర భాష గమనికలు మూ
2003 హవా సాషా హిందీ బాల కళాకారుడు
కోయీ మిల్ గయా ప్రియా శర్మ
2004 జాగో శ్రుతి వర్మ
హమ్ కౌన్ హై? సారా విలియమ్స్
ఆబ్రా కా దాబ్రా పింకీ
2007 దేశముదురు వైశాలి తెలుగు ఫిలింఫేర్ ఉత్తమ మహిళా తొలిచిత్ర నటి అవార్డు - దక్షిణాది
ఆప్ కా సురూర్ రియా బక్షి హిందీ నామినేషన్ - ఉత్తమ మహిళా తొలి నటికి ఫిలింఫేర్ అవార్డు
2008 బిందాస్ ప్రీతి కన్నడ
కంత్రి వరలక్ష్మి తెలుగు
మనీ హై తో హనీ హై ఆషిమా కపూర్ హిందీ
2009 మస్కా మీనాక్షి

'మీను'

తెలుగు
బిల్లా ప్రియా అతిధి పాత్ర
జయీభవ అంజలి
2010 సీత రాముల కళ్యాణం లంకలో నందిని
2011 మాప్పిళ్ళై గాయత్రి తమిళం
ఎంగేయుమ్ కాదల్ కయల్విళి (లోలిత)
కందిరీగ శ్రుతి తెలుగు ఉత్తమ నటిగా SIIMA అవార్డుకు (తెలుగు) నామినేట్ అయింది
వేలాయుధం వైదేహి తమిళం
ఓ మై ఫ్రెండ్ రీతు తెలుగు
2012 ఒరు కల్ ఒరు కన్నడి మీరా తమిళం
డెనికైనా రెడీ షర్మిల తెలుగు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికైంది - తెలుగు
2013 సెట్టై మధుమిత తమిళం
థీయ వేలై సెయ్యనుం కుమారు సంజన
సింగం II సత్య
బిర్యానీ ప్రియాంక 25వ చిత్రం
2014 పాండవులు పాండవులు తుమ్మెద తేనె తెలుగు
మాన్ కరాటే యాజిని తమిళం
పవర్ నిరుపమ తెలుగు
అరణ్మనై సెల్వి తమిళం
మీఘమాన్ ఉష
2015 అంబాలా మాయ
రోమియో జూలియట్ ఐశ్వర్య (సుబ్బులక్ష్మి)
వాలు ప్రియ మహాలక్ష్మి
పులి యువరాణి మంథగిని
సైజు జీరో ఆమె స్వయంగా తెలుగు ద్విభాషా చిత్రం,

హాస్య పాత్ర

ఇంజి ఇడుప్పళగి తమిళం
2016 అరణ్మనై 2 మాయ తమిళం
పోక్కిరి రాజా సునీత
ఉయిరే ఉయిరే ప్రియా
మనితాన్ ప్రియా
2017 లక్కున్నోడు 'పాజిటివ్' పద్మ తెలుగు
బోగన్ మహాలక్ష్మి తమిళం
సింగం 3 సత్య ప్రత్యేక ప్రదర్శన
గౌతమ్ నందా స్పూర్థి తెలుగు
విలన్ డాక్టర్ శ్రేయ వెంకటేష్ మలయాళం
2018 గులేబాఘవలి విజి తమిళం
తుప్పక్కి మునై మైథిలి
2019 ఎన్టీఆర్: కథానాయకుడు జయ ప్రద తెలుగు ప్రత్యేక ప్రదర్శన
100 లు నిషా తమిళం
తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ రుక్మిణి తెలుగు
2022 మహా మహా తమిళం 50వ చిత్రం
2023 పార్ట్‌నర్ స్త్రీ కళ్యాణ్ / పేరులేని స్త్రీ ద్విపాత్రాభినయం
మై నేమ్ ఈజ్ శృతి శ్రుతి తెలుగు [2][3]
2024 105 మినిట్స్‌ జాను [4]
గార్డియ‌న్ అపర్ణ తమిళం [5][6]
2025 రౌడీ బేబీ † టిబిఎ చిత్రీకరణ
మనిషి † టిబిఎ పూర్తయింది
గాంధారి † టిబిఎ చిత్రీకరణ

టెలివిజన్

మార్చు
టెలివిజన్ కార్యక్రమాలు & పాత్రల జాబితా
సంవత్సరం పేరు పాత్ర భాష మూ
2001–2003 డెస్ మే నికల్లా హోగా చాంద్ టీనా హిందీ
2001 షాక లకా బూమ్ బూమ్ కరుణ / షోన
2002 క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ బావ్రీ విరానీ
సన్ పారి స్వీటీ
2003 కరిష్మా కా కరిష్మా టీనా
2004 జమీన్ సే ఆస్మాన్ తక్
2004–2005 హమ్ దో హై నా కరీనాకుమార్ / కోయెల్
2005 సెలబ్రిటీ ఫేమ్ గురుకుల్ ఆమె (పోటీదారు)
2010 సప్నా బాబుల్ కా...బిదాయి ముఖ్య అతిథి
2023 హన్సిక లవ్ షాదీ డ్రామా ఆమె స్వయంగా ఇంగ్లీష్
ఎంవై 3 మైత్రి తమిళం
2024 ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 న్యాయమూర్తి తెలుగు
టిబిఎ నాషా టిబిఎ తెలుగు చిత్రీకరణ

మ్యూజిక్ వీడియోలు

మార్చు
మ్యూజిక్ వీడియోల జాబితా
సంవత్సరం పేరు గాయకుడు(లు) భాష లేబుల్ మూ
2007 ఇష్క్ నా కర్ణ అగం కుమార్ నిగమ్ మరియు తులసి కుమార్ హిందీ టి-సిరీస్
2021 బూటీ షేక్ టోనీ కక్కర్ మరియు సోను కక్కర్ దేశీ మ్యూజిక్ ఫ్యాక్టరీ
మజా బి ప్రాక్ సారెగామా
2022 శ్రేయం పాగల్ సునిధి చౌహాన్ పంజాబీ వైఆర్ఎఫ్

అవార్డులు & నామినేషన్లు

మార్చు
సంవత్సరం అవార్డు వర్గం పని ఫలితం మూ
2003 ఇండియన్ టెల్లీ అవార్డులు ఉత్తమ బాలనటి - మహిళా డెస్ మే నికల్లా హోగా చాంద్ గెలిచింది
2008 53వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ మహిళా అరంగేట్రం ఆప్ కా సురూర్ నామినేట్ అయ్యారు
55వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ మహిళా అరంగేట్రం - సౌత్ దేశముదురు గెలిచింది
2012 1వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ నటి - తెలుగు కందిరీగ నామినేట్ అయ్యారు
నటి - ప్రత్యేక ప్రశంస (తెలుగు) గెలిచింది
ఉత్తమ మహిళా అరంగేట్రం - తమిళం మాప్పిళ్ళై గెలిచింది
ఉత్తమ నటి - తమిళం ఎంగేయుమ్ కాదల్ నామినేట్ అయ్యారు
2013 2వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఒరు కల్ ఒరు కన్నడి గెలిచింది
60వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి - తెలుగు డెనికైనా రెడీ నామినేట్ అయ్యారు
2014 3వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ నటి - తమిళం థీయ వేలై సెయ్యనుం కుమారు నామినేట్ అయ్యారు
2015 4వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు అరణ్మనై గెలిచింది
2018 7వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు సంవత్సరపు శైలి చిహ్నం గెలిచింది
2022 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు దక్షిణ భారత సినిమాలో దశాబ్దపు అత్యుత్తమ చిత్రం గెలిచింది

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (5 December 2022). "కళ్యాణ వైభోగమే". Archived from the original on 5 December 2022. Retrieved 5 December 2022.
  2. TV9 Telugu (15 October 2021). "హన్సిక ప్రధాన పాత్రలో మై నేమ్ ఈజ్ శృతి.. ఊహించని మలుపులతో ఉండబోతున్న మూవీ." Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Sakshi (5 November 2023). "నా మనసుకు దగ్గరైన కథ ఇది". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  4. Andhrajyothy (31 December 2023). "సింగిల్‌ షాట్‌... సింగిల్‌ క్యారెక్టర్‌". Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.
  5. "ఏడాది తర్వాత ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే". Eenadu. 24 April 2025. Archived from the original on 24 April 2025. Retrieved 24 April 2025.
  6. "Aha: ఓటీటీలో హన్సిక మోత్వానీ గార్డియన్..." Chitrajyothy. 24 April 2025. Archived from the original on 24 April 2025. Retrieved 24 April 2025.

బయటి లింకులు

మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో హన్సిక మోత్వానీ పేజీ