కళ్యాణ్ కృష్ణ కురసాల

తెలుగు సినీ దర్శకుడు, రచయిత

కళ్యాణ్ కృష్ణ కురసాల తెలుగు సినీ దర్శకుడు, రచయిత. అతను నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్నినాయ‌న సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ సినిమా తరువాత నాగ చైతన్య తో రారాండోయ్ వేడుక చూద్దాం సినిమా తీయడం జరిగింది. తాజాగా ఈ దర్శకుడు రవితేజతో నేల టికెట్టు సినిమా తీయడం జరిగింది.[1] 2015 సంక్రాంతి కానుకగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయ‌న చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో నాగ్ తండ్రి కొడుకులుగా నటించి మెప్పించారు.

కళ్యాణ్ కృష్ణ కురసాల
Kalyan Krishna Kurasala.jpg
జననం
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయతభారతీయురాలు
వృత్తిసినీ దర్శకుడు
తల్లిదండ్రులుకురసాల సత్యనారాయణ, కృష్ణవేణి
బంధువులుకురసాల కన్నబాబు, కురసాల సురేష్‌బాబు

దర్శకత్వం వహించిన చిత్రాలుసవరించు

  1. సోగ్గాడే చిన్నినాయనా (2016)[2]
  2. రారండోయ్ వేడుక చూద్దాం (2017)
  3. నేల టికెట్ (2018)
  4. బంగార్రాజు (2021)
సంవత్సరం శీర్షిక దర్శకుడు రచయిత గమనికలు
2016 సోగ్గాడే చిన్ని నాయనా   మాటలు దర్శకత్వ రంగ ప్రవేశం
2017 రారండోయ్ వేడుక చూద్దాం   కథ & మాటలు
2018 నేల టిక్కెట్టు   కథ & మాటలు
2022 బంగార్రాజు   కథ సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్

వ్యక్తిగత జీవితంసవరించు

కళ్యాణ్ కృష్ణ సోదరులు మొత్తం ముగ్గురు కాగా, పెద్దాయన కురసాల కన్నబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయి జగన్మోహనరెడ్డి క్యాబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇక రెండో ఆయన సురేష్,  గతంలో విశాఖపట్నంలో ‘ఈనాడు’ రిపోర్టర్‌గా పని చేసిన అయన ఆ తర్వాత రోజుల్లో జర్నలిజం వృత్తిని వదిలిపెట్టి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి బాగా సంపాదించారు. సురేష్ జూలై 2019న మరణీంచాడు.[3]

మూలాలుసవరించు

  1. Sreedhar (2018-05-19). "ఆయనే అదనపు ఆకర్షణ, అనుభవం కలిగిన హీరోయిన్ లా నటించింది- కళ్యాణ్ కృష్ణ (ఇంటర్వ్యూ)". telugu.filmibeat.com. Retrieved 2020-07-15.
  2. Dundoo, Sangeetha Devi (2016-01-16). "'Soggade' charms all the way". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-07-15.
  3. "సినీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇంట తీవ్ర విషాదం". Cinema Politics (in ఇంగ్లీష్). Retrieved 2020-07-15.

బాహ్య లంకెలుసవరించు