సోగ్గాడే చిన్నినాయనా

2016 తెలుగు సినిమా

సోగ్గాడే చిన్నినాయనా నాగార్జున కథానాయకుడిగా నటించగా 2016 సంక్రాంతికి విడుదలైన చిత్రం. కళ్యాణ్ కృష్ణ కురసాలకు దర్శకుడిగా ఇది తొలి చిత్రం. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన హిట్ పాట సోగ్గాడే చిన్నినాయనా...కు రీమిక్స్ పాట కూడా ఉంది. ఈ సినిమాకు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డు వచ్చింది.

సోగ్గాడే చిన్నినాయనా
దర్శకత్వంకళ్యాణ్ కృష్ణ కురసాల
రచనపి.రామ్మోహన్
నిర్మాతఅక్కినేని నాగార్జున
తారాగణంఅక్కినేని నాగార్జున,
లావణ్య త్రిపాఠీ
ఛాయాగ్రహణంపి.ఎస్.వినోద్,
ఆర్.సిద్ధార్థ
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
అన్నపూర్ణా సినీ స్టూడియోస్
విడుదల తేదీ
15 జనవరి2016
దేశంభారతదేశం
భాషతెలుగు
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల

చిత్ర కథ మార్చు

గోదావరి జిల్లాల్లోని శివపురం గ్రామంలో బంగార్రాజు (నాగార్జున) పిల్ల జమీందారు[1]. ఆ సోగ్గాడి భార్య సత్యభామ (రమ్యకృష్ణ).ఆమె కడుపుతో ఉన్నప్పుడు యాక్సిడెంట్‌లో బంగార్రాజు చనిపోతాడు. భర్తలానే పుట్టిన కొడుకు రాము (నాగార్జున) ను అతి జాగ్రత్తగా పెంచుతుంది సత్యభామ. రాము భార్య సీత (లావణ్యా త్రిపాఠీ). అమెరికాలో టాప్ ఫైవ్ డాక్టర్స్‌లో ఒకడిగా స్థిరపడ్డ రామూకి పనే లోకం. భార్య మీద ప్రేమను కూడా పైకి వ్యక్తం చేయలేని అమాయకుడు. దాంతో, విడాకులకు సిద్ధమై, సత్యభామకు చెప్పడం కోసం ఇండియాలోని ఊరికొస్తారు. వీటికన్నిటికీ మొగుడు బంగార్రాజు కారణమని తల్లి నిందిస్తుంది. అప్పుడు యముడి అనుమతితో తండ్రి ఆత్మ భూలోకానికి వస్తుంది. ఈ ఫ్రెండ్లీ ఘోస్ట్ ఇక్కడ భార్యకు మాత్రమే కనపడుతూ, వినపడుతూ కొడుకు కాపురం చక్కదిద్దడానికి ప్రయత్నిస్తుంది.

పాటలు

నీ నవ్వే హాయ్ గా , శ్రేయా ఘోషల్, ధనంజయ్ , రచన: బాలాజీ .

డిక్క డిక్క డుం డుమ్ , నాగార్జున , దనంజయ్ , మోహన భోగరాజు , రచన: భాస్కర భట్ల రవికుమార్.

సోగ్గాడే చిన్ని నాయన , సత్య యామిని , నూతన మోహన్, వినాయక్ , రచన: అనంత శ్రీరామ్

వస్తానే వస్తానే , హరిహరన్ , కౌసల్య , రచన: రామజోగయ్య శాస్త్రి .

అద్దిర బన్నా , అనుదీప్ దేవ్, అరుణ్, ధనంజయ్ , రఘురాం , సంపత్, ప్రకాష్, లోకేష్ , రచన: కృష్ణకాంత్ .

ఉంటాలే ఉoటాలే , మాళవిక , రచన: రామజోగయ్య శాస్త్రి.

తారాగణం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • మూలకథ: పి.రామ్మోహన్
  • చిత్రానువాదం: సత్యానంద్
  • కళ: ఎస్.రవీందర్
  • ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, సిద్దార్థ్
  • కూర్పు: ప్రవీణ్ పూడి
  • సంగీతం: అనూప్ రూబెన్స్
  • నిర్మాత: అక్కినేని నాగార్జున
  • రచన - దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల

మూలాలు మార్చు

  1. "సాక్షి దినపత్రిక - సంక్రాంతి సోగ్గాడు - సమీక్ష - రెంటాల జయదేవ". Archived from the original on 2016-01-24. Retrieved 2016-01-23.

బయటి లంకెలు మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సోగ్గాడే చిన్నినాయనా