కళ్ళు (సినిమా)

1988 సినిమా

కళ్ళు ఎం.వి.రఘు దర్శకత్వం వహించిన మొదటి సినిమా. గొల్లపూడి మారుతీరావు రచించిన 'కళ్ళు' నాటకం ఆధారంగా ఈ సినిమా తీశారు.[1] అంతేకాదు ఈ సినిమాను ఆస్కారు అవార్డుల నామినేషనుకు కూడా ఎంపికచేయబడింది.[1][2] ఈ సినిమాలో నటుడు చిరంజీవి తన కనిపించని పాత్రకు మాటలు అందించాడు.[2] కళ్ళు చిదంబరం పేరుకు ముందు ఉన్న కళ్ళు ఈ సినిమా నుండే వచ్చాయి. ఈ సినిమాలో 'తెలారింది లెగండోయ్... మంచాలింక దిగండోయ్...' అనే పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి తానే రాసి స్వయంగా పాడాడు.

కళ్ళు
(1988 తెలుగు సినిమా)
Telugucinemastill Kallu.jpg
http://www.idlebrain.com/ వారి సౌజన్యంతో
దర్శకత్వం ఎం.వి.రఘు
రచన గొల్లపూడి మారుతీరావు
తారాగణం శివాజీ రాజా,
రాజేశ్వరి,
సుధారాణి,
కళ్ళు చిదంబరం
సంగీతం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
నేపథ్య గానం సిరివెన్నెల సీతారామశాస్త్రి
గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి
ఛాయాగ్రహణం ఎం.వి.రఘు
నిర్మాణ సంస్థ మహాశక్తి ఫిల్మ్స్
భాష తెలుగు

కథ సారాంశంసవరించు

ఇది కొంతమంది గుడ్డివాళ్ళ కథ. మొదట్లో వీళ్ళందరూ కలిసి జట్టుగా బిచ్చమెత్తుకుని బతుకుతూ ఉంటారు. అడుక్కోగా వచ్చింది అందరూ పంచుకుని ఒక కుటుంబంగా మెలిగేవారు. అయితే వీళ్ళందరూ గుడ్డివాళ్ళవటం చేత తమ పనులు చేసుకోవటానికి ప్రతీ సారి ఇతరుల సహాయం తీసుకోవలసి వచ్చేది. ఇది గమనించిన ఒకావిడ (సుధారాణి) వీళ్ళకు ఎలాగయినా సహాయం చేయాలనుకుంటుంది. ఈలోగా నగరానికి ఒక ప్రముఖ కంటి వైద్యుడు వస్తాడు. సుధారాణి ఆ వైద్యుడిని కలిసి వీళ్ళ గురించి వివరించిన తరువాత అతడు 500 రూపాయలకయితే కంటి వైద్యం చేయగలనని చెబుతాడు. నలుగురూ అడుక్కునేవాళ్ళవటం చేత ఎవరిదగ్గరా చిల్లిగవ్వ ఉండదు. ఆ వైద్యుడేమో ఇంకా కొన్ని రోజులు మాత్రమే నగరంలో ఉంటాడు. అప్పుడు ఈ గుడ్డివాళ్ళు అంతా సమావేశమై మొత్తమందరికీ కళ్ళురావాలంటే చాలా డబ్బులు కావాలి. అంత డబ్బు వీరు ఆ కొన్ని రోజులలో సంపాదించలేరు. కాబట్టి ఎవరికో ఒకళ్ళకు కళ్ళు తెపిస్తే మిగతావారికి ఆ కళ్ళు వచ్చినతను సహాయపడవచ్చు అని తీర్మానిస్తారు. ఆ ఒక్కడిగా వారిలో అందరికంటే చిన్నవాడు, చురుకైనవాడయిన శివాజీ రాజాను ఎన్నుకుంటారు. ఆ తరువాత కొద్దిరోజుల పాటు అడుక్కోవటంతో పాటు ఇంకొన్ని పనులు చేసి, కంటి ఆపరేషనుకు అవసరమైన డబ్బు సంపాదిస్తారు. శివాజీ రాజాకు కళ్ళు తెపిస్తారు.

కళ్ళు వచ్చిన శివాజీ రాజాకు ఈ రంగుల ప్రపంచం చాలా కొత్తగా కనిపిస్తుంది. ఎప్పుడు చిరంజివి సినిమాలను విని ఆనందించేవాడు, కళ్ళు వచ్చిన తరువాత చూస్తాడు. అయితే కళ్ళు వచ్చిన తరువాత అంతకుముందు కంటే ఇప్పుడు బోలెడన్ని అవకాశాలు కనపడతాయి. కానీ అతనికి మంచివాటి కంటే చెడ్డవే ఎక్కువ ఆకర్షనీయంగా కనపడతాయి. అది తెలిసిన మిగతా గుడ్డివాళ్ళు అందరూ కలిసి అతనిని మళ్ళీ మునుపటిలా మంచివాడిలా మార్చడానికి కళ్ళు పీకేయడంతో సినిమా ముగుస్తుంది.

పాటలుసవరించు

  • తెల్లారింది లెగండోయ్, కొక్కొరోకో, మంచాలింక దిగండోయ్, కొక్కొరొకో

పురస్కారాలుసవరించు

  1. ఉత్తమ చిత్రం, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు (ఎం.వి రఘు), ఉత్తమ నూతన నటుడు (శివాజీరాజా) లకు నంది బహుమతి, ఉత్తమ దర్శకుడి ఫిలింఫేర్ పురస్కారం వచ్చాయి.[3]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 ద హిందూ దిన పత్రికలో ఎం.వి.రఘు Archived 2008-02-15 at the Wayback Machine పై వ్యాసం. మే 26, 2007న సేకరించబడినది.
  2. 2.0 2.1 తెలుగు సినిమా.కాంలో ఎం.వి.రఘు పరిచయం Archived 2006-11-19 at the Wayback Machine. మే 26, 2007న సేకరించబడినది.
  3. విజయక్రాంతి, సినిమాలు (10 August 2018). "30 ఏళ్లుగా మరవలేని 'కళ్లు'". Archived from the original on 26 April 2019. Retrieved 26 April 2019.

బయటి లింకులుసవరించు

ఇవికూడా చూడండిసవరించు