కాంచనపల్లి కనకమ్మ

కాంచనపల్లి కనకమ్మ జననం సెప్టెంబరు 3, 1893లో. సంస్కృతాంధ్ర రచయిత్రి. సెప్టెంబరు 3, 1893గుంటూరు జిల్లా, పల్నాటి సీమలోని దుర్గి గ్రామంలో రంగారావు, రంగమ్మ దంపతులకు జన్మించింది. బాల్యవితంతువైన కనకమ్మ తన తండ్రి ఇంటిపేరే జీవితాంతం ఉంచుకొన్నది.[1] ఈమె బి.ఎ. ఆంగ్లములో పట్టభద్రురాలై కొంతకాలం నెల్లూరు, చెన్నైలలో లేడీ వెల్లింగ్టన్ ఉన్నత పాఠశాలలోను, క్వీన్ మేరీస్ కళాశాల లోను ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. మాక్విలన్ కంపెనీ వంటి విద్యాసంస్థల కోసం తెలుగు పుస్తకాలు రచించారు. ఆనాటి అన్ని స్త్రీల పత్రికలలోను వీరి రచనలు ప్రచురించబడ్డాయి. పద్యం, కథ, నవల, నాటకం, జీవితచరిత్ర, యాత్రాచరిత్ర వంటి ప్రక్రియలన్నిటిలోను రచనలు చేసారు.

కాంచనపల్లి కనకమ్మ
జననంసెప్టెంబరు 3, 1893
దుర్గి, గుంటూరు జిల్లా
మరణం1988
వృత్తిఉపన్యాసకురాలు
ప్రసిద్ధిసంస్కృతాంధ్ర రచయిత్రి
తండ్రికాంచనపల్లి రంగారావు
తల్లికాంచనపల్లి రంగమ్మ

రచనలు

మార్చు

కనకమ్మ పద్యం, కథ, నవల, నాటకం, జీవితచరిత్ర, యాత్రాచరిత్ర వంటి ప్రక్రియలన్నిటిలోను రచనలు చేసారు. "రంగ శతకము" ఈమె మొదటి రచన. "గౌతమ బుద్ధ చరిత్రము, "పాండవోదంతము" అను గద్య కావ్యములు, "కాశీయాత్ర చరిత్ర", "పద్య ముక్తావళి" మున్నగు గ్రంథములను రచించెను. "అమృతసారము"లో కొన్ని అమూల్యమైన సంగతులను సులభమైన రీతిలో తేలికైన మాటలలో వివరించారు.

  1. 1912లో కాశీయాత్రాచరిత్ర,
  2. 1916లో రంగశతకం,
  3. 1917లో అమృతవల్లి (నవల),
  4. 1919లో జీవయాత్ర,
  5. 1927లో పద్యముక్తావళి,
  6. 1931లో రామాయణ కథా సంగ్రహం (సంస్కృత గద్య),
  7. ఆనందసారము (1931)
  8. అమృతసారము
  9. హంసవిజయం - తెలుగు నాటకం
  10. గౌతమ బుద్ద చరిత్ర,
  11. పాండవోదంతం,
  12. చక్కని కథలు
  13. తోమాలియ (1942) ఆర్కీవు.కాం.లో తోమాలియ.

కాంచనపల్లి కనకమ్మ, కాళిదాసుఅభిజ్ఞాన శాకుంతలము” సంస్కృత నాటకాన్ని ఆంధ్రీకరించారు. వీరు కొంతకాలం మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగు పాఠ్యగ్రంథ నిర్ణాయక సమితి సభ్యులుగా పనిచేశారు.

వీరి కృషికి గుర్తింపుగా "కవితా విశారద", "కవితిలక" అనే బిరుదులు, కేసరి గృహలక్ష్మి స్వర్ణకంకణం అందుకున్నారు.[2]

మూలాలు

మార్చు
  1. Inukonda, Thirumali (2004). South India: regions, cultures, and sagas. Bibliomatrix. p. 218. ISBN 8190196421. Retrieved 25 November 2014.
  2. కనకాంబ, కాంచనపల్లి (1893-1988), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 61.
  • తెలుగు సాహిత్య చరిత్ర - ద్వా.నా. శాస్త్రి