కాకతీయ కాలువ

తెలంగాణ రాష్ట్రంలోని ఒక నీటి పారుదల కాలువ

18°57′53″N 78°21′02″E / 18.96472°N 78.35056°E / 18.96472; 78.35056 (Sriram Sagar Project)

కాకతీయ కాలువ
విశేషాలు
పొడవు284 km (176 miles)
భౌగోళికం
మొదలైన స్థానంశ్రీరాంసాగర్ ప్రాజెక్టు
ముగిసిన స్థానందిగువ మానేరు డ్యామ్

కాకతీయ కాలువ అనేది తెలంగాణ రాష్ట్రంలోని ఒక నీటి పారుదల కాలువ. 1091అడుగుల (90టీఎంసీ)ల పూర్తిస్థాయి నీటిమట్టం కలిగిన[1] ఈ కాలువ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి దిగువ మానేరు డ్యామ్ వరకు నీరు తరలించబడుతుంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 4.73 లక్షల ఎకరాల నీటిపారుదలకు, ప్రధాన నగరాలకు తాగునీటి అవసరాలకు ఈ కాలువ ఉపయోగపడుతోంది.

కాలువ వివరాలు మార్చు

ఈ కాకతీయ కాలువ అనేది సుమారు 284 కిమీ పొడవు 9,700 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల గుండా వెళుతోంది.[2] ఈ కాలువ గోదావరి నది నీటిని వరంగల్, ఖమ్మం జిల్లాలలోని కృష్ణా నది పరీవాహక ప్రాంతాలకు నీరు అందించేందుకు అంతర్ నదీ పరీవాహక మార్గంగా ఉంది. 36 మెగావాట్ల ఉత్పత్తికి 9 మెగావాట్ల 4 యూనిట్లు కూడా కాలువలోకి నీటిని పోయడానికి ఏర్పాటు చేయబడ్డాయి.

పునరుద్దరణ మార్చు

గతంలో పూడికతో నిండిపోయిన ఈ కాలువను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయగా, ప్రస్తుతం చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతోంది. ఎండాకాలంలో ఎస్సారెస్పీ అధికారులు విడుతల వారీగా నీటిని విడుదల చేస్తుంటారు.[3]

బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మెండోరా మండలం సోన్‌పేట్ – పోచంపాడ్ గ్రామాల మధ్య కాకతీయ కెనాల్ జీరో పాయింట్ వద్ద 1.24 కోట్ల రూపాయలతో, మెండోరదూద్‌గావ్ వద్ద కాకతీయ కెనాల్ పై 1.38 కోట్ల రూపాయలతో వంతెనలు నిర్మించబడ్డాయి.

నీటి విడుదల మార్చు

2022 జూలై 20న ఉదయం మొదట 500 క్యూసెక్కులు, సాయంత్రం వరకు విడుతల వారీగా మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదలచేయబడింది. ఈ నీటితో మైలారం జలాశయం నింపి, అక్కడినుండి సూర్యాపేట జిల్లా వరకు నీటిని అందించారు.[4]

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ABN (2022-12-17). "కాకతీయ కాలువకు నీటి విడుదల". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-06-27. Retrieved 2023-06-27.
  2. "Sri Ram Sagar Project, Stage-I". Retrieved 19 July 2015.
  3. telugu, NT News (2022-04-02). "వేసవిలోనూ నిండుగా కాకతీయ కాలువ". www.ntnews.com. Archived from the original on 2022-04-03. Retrieved 2023-06-27.
  4. telugu, NT News (2022-07-21). "కాకతీయ కాలువకు నీటి విడుదల". www.ntnews.com. Archived from the original on 2022-07-21. Retrieved 2023-06-27.