కాటమరాయుడు 2017 మార్చి 24న విడుదలైన తెలుగు చిత్రం.[1]

గౌతమ్ నంద
కాటమరాయుడు ప్రచార చిత్రం
దర్శకత్వంకిషోర్ కుమార్ పార్థాసాని (డాలీ)
స్క్రీన్ ప్లేఆకుల శివ
కథశివ
నిర్మాతశరత్ మరార్
తారాగణంపవన్ కళ్యాణ్
శ్రుతి హాసన్
ఛాయాగ్రహణంప్రసాద్ మూరెళ్ళ
కూర్పుగౌతంరాజు
సంగీతంఅనూప్ రూబెన్స్
పంపిణీదార్లుశ్రేష్ఠ్ మూవీస్
విడుదల తేదీ
2017 మార్చి 24
దేశంభారతదేశం
భాషతెలుగు భాష

కాట‌మ‌రాయుడు(ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌), అత‌ని త‌మ్ముళ్ళు(క‌మ‌ల్ కామ‌రాజు, అజ‌య్‌, శివ‌బాలాజీ, చైత‌న్య‌కృష్ణ‌), స్నేహితుడు లింగ‌బాబు(అలీ) తో క‌లిసి నివ‌సిస్తుంటాడు. ఊరికి పెద్ద‌గా, ఆప‌ద‌లోని వారికి అండ‌గా ఉండే కాట‌మ‌రాయుడుకి ఆడ‌వాళ్ళంటే గిట్ట‌దు. అయితే త‌మ్ముళ్ళంద‌రూ ప్రేమ‌లో ప‌డినా అన్న‌కు చెప్పే ధైర్యం లేకుండా ఉంటారు. ఎలాగైనా అన్న‌య్య‌ను ప్రేమ‌లో ప‌డేలా చేయాల‌నుకుంటారు. కాట‌మ‌రాయుడు ఇంటి ఎదురుగా ఉండే ఇంట్లోకి వ‌చ్చిన అవంతిక‌(శృతిహాస‌న్‌)తో కాట‌మ‌రాయుడుని ప్రేమ‌లో పడేలా అంద‌రూ ప్రణాళిక వేస్తారు. త‌మ ప్రేమ విష‌యం చెప్ప‌డానికి అవంతిక, కాట‌మ‌రాయుడుతో క‌లిసి ఊరికి బ‌య‌లుదేరుతుంది. రైలులో కొంద‌రు కాట‌మ‌రాయుడు, అవంతిక‌పై దాడి జ‌రుగుతుంది. త‌న వ‌ల్ల అవంతిక‌కు, ఆమె కుటుంబానికి ఏ హాని జ‌ర‌గ‌కూడ‌ద‌ని భావించిన కాట‌మ‌రాయుడు, గొడ‌వ‌లు వ‌దిలేస్తాన‌ని ఆమెకు మాట ఇచ్చి ఆమె ఇంటికి వ‌స్తాడు. త‌ర్వాత ఏం జ‌రుగుతుంది? అస‌లు కాట‌మ‌రాయుడుని చంపాల‌నుకున్నదెవ‌రు? ఎలాస‌రి భాను ఎవ‌రు? ఎలాస‌రి భానుకు, అవంతిక కుటుంబానికి ఉన్న స‌మ‌స్యేంటి? చివ‌ర‌కు కాట‌మ‌రాయుడు ఆస‌మస్య‌ను ఎలా తీరుస్తాడు? అనే విష‌యాలు మిగిలిన కథలో భాగం.[1]

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • నిర్మాణ సంస్థః నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్స్
  • సంగీతం: అనూప్ రూబెన్స్‌
  • ఛాయాగ్ర‌హ‌ణంః ప్ర‌సాద్ మూరెళ్ల‌
  • కూర్పుః గౌతంరాజు
  • క‌ళః బ్ర‌హ్మ క‌డ‌లి
  • నిర్మాతః శ‌ర‌త్ మ‌రార్‌
  • ద‌ర్శ‌క‌త్వంః కిషోర్ పార్థ‌సాని(డాలీ)

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు