కాట్రగడ్డ పద్దయ్య
కాట్రగడ్డ పద్దయ్య భారతీయ పురావస్తు శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎమెరిటస్, పూణే డెక్కన్ కళాశాల మాజీ డైరెక్టర్. అతను పురావస్తు సిద్ధాంతానికి, పద్దతికీ రెండు ప్రధాన దృక్కోణాలను పరిచయం చేశాడు.[1] 2012లో భారత ప్రభుత్వం ఆయనను నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది. [2]
కాట్రగడ్డ పద్దయ్య | |
---|---|
జననం | పాములపాడు | 1943 మే 20
వృత్తి | పురాతత్వవేత్త |
పురస్కారాలు | పద్మశ్రీ |
పద్దయ్య పూణేకు చెందినవాడు. 1968లో పూణే విశ్వవిద్యాలయం నుండి పురావస్తు శాస్త్రంలో డాక్టరల్ డిగ్రీ పొందాడు.[3] డెక్కన్ కళాశాల ఆర్కియాలజీ విభాగంలో చేరి యూరోపియన్ పూర్వ చరిత్రలో లెక్చరర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. సంవత్సరాలు గడిచేకొద్దీ, అతను రీడర్‌గా, ప్రొఫెసర్‌గా, ఆ తరువాత సంస్థ డైరెక్టరుగా ర్యాంకుల్లో ఎదిగాడు.[4] పదవీ విరమణ సమయంలో, దక్కన్ కళాశాల పద్దయ్యకు ప్రొఫెసర్ ఎమిరిటస్ హోదాను ప్రదానం చేసింది.[5][4]
దక్కన్‌లోని షోరాపూర్ దోయాబ్‌లోని ప్రాచీన శిలాయుగ, నియోలిథిక్ సంస్కృతులపై పద్దయ్య విస్తృత పరిశోధనలు చేసాడు.[6][7] పురావస్తు అధ్యయనాలలో అతను సైద్ధాంతిక, పద్దతికి సంబంధించిన దృక్పథాలతో ఘనత పొందాడు. వీటిని ప్రధాన ఆవిష్కరణలుగా భావిస్తారు. [8] అతను యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్శిటీ ఆఫ్ న్యూ మెక్సికోతో కలిసి రెండు ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌లు పొందాడు. ఇది అమెరికా, భారతీయ పురావస్తు శాస్త్రవేత్తల మధ్య మెరుగైన సహకారానికి సహాయపడింది.[1] అతను మిచిగాన్ విశ్వవిద్యాలయం, ఆన్ అర్బోర్, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ నుండి సీనియర్ లెక్చర్ గ్రాంట్లు కూడా అందుకున్నాడు.[1]
ప్రఖ్యాత పండితుడు, కెన్నెత్ అడ్రియన్ రైన్ కెన్నెడీతో సన్నిహిత అనుబంధాన్ని కలిగి ఉన్న పద్దయ్య,[9] 7 పుస్తకాలు,[1] పీర్ రివ్యూడ్ పత్రికల్లో అనేక వ్యాసాలూ రచించాడు.[10][11][12] అతని ముఖ్యమైన రచనలలో కొన్ని:
- భారతీయ పురావస్తు శాస్త్రంలో ఇటీవలి అధ్యయనాలు [13]
- షోరాపూర్ దోయాబ్, దక్షిణ భారతదేశంలోని నియోలిథిక్ సంస్కృతిపై పరిశోధనలు [14]
- న్యూ ఆర్కియాలజీ అండ్ ఆఫ్టర్‌మాత్: ఎ వ్యూ ఫ్రమ్ ఔట్‌సైడ్ ది ఆంగ్లో-అమెరికన్ వరల్డ్ [15]
- భారతదేశ పూర్వ గతం అధ్యయనానికి మల్టిపుల్ అప్రోచ్‌లు: సైద్ధాంతిక పురావస్తు శాస్త్రంలో వ్యాసాలు [16]
పద్దయ్య ఇండియన్ హిస్టారికల్ రివ్యూ, జర్నల్ ఆఫ్ సోషల్ ఆర్కియాలజీ [5] వంటి పత్రికల సంపాదకీయ బోర్డులకు సేవలందించాడు. పురావస్తు శాస్త్రంపై అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు.[17] సొసైటీ ఆఫ్ యాంటిక్వేరీస్ ఆఫ్ లండన్ లో గౌరవ సహచరుడు. పద్దయ్యకు 2012లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పౌర గౌరవాన్ని అందించింది. [5] [18]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "USIEF". USIEF. 2014. Archived from the original on 28 ఆగస్టు 2015. Retrieved 17 December 2014.
- ↑ "Padma Shri" (PDF). Padma Shri. 2014. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 11 November 2014.
- ↑ Gullapalli, Praveena; Jhaldiyal, Richa (2014). "Paddayya, Katragadda". Springer. Springer. pp. 5707–5708. doi:10.1007/978-1-4419-0465-2_320. ISBN 978-1-4419-0426-3.
- ↑ 4.0 4.1 "Shanghai Archaeology Forum". Shanghai Archaeology Forum. 2014. Retrieved 17 December 2014.
- ↑ 5.0 5.1 5.2 Gullapalli, Praveena; Jhaldiyal, Richa (2014). "Paddayya, Katragadda". Springer. Springer. pp. 5707–5708. doi:10.1007/978-1-4419-0465-2_320. ISBN 978-1-4419-0426-3.Gullapalli, Praveena; Jhaldiyal, Richa (2014). "Paddayya, Katragadda". Springer. Springer. pp. 5707–5708. doi:10.1007/978-1-4419-0465-2_320. ISBN 978-1-4419-0426-3.
- ↑ K. Paddayya, ed. (January 2004). Recent Studies in Indian Archaeology (Indian Council of Historical Research Monograph, 6). Munshiram Manoharlal Publishers. p. 454. ISBN 978-8121509299.
- ↑ "Shanghai Archaeology Forum". Shanghai Archaeology Forum. 2014. Retrieved 17 December 2014."Shanghai Archaeology Forum". Shanghai Archaeology Forum. 2014. Retrieved 17 December 2014.
- ↑ "USIEF". USIEF. 2014. Archived from the original on 28 ఆగస్టు 2015. Retrieved 17 December 2014."USIEF" Archived 2015-08-28 at the Wayback Machine. USIEF. 2014. Retrieved 17 December 2014.
- ↑ Rajendran, S. (7 May 2014). "The hindu". The hindu. Retrieved 17 December 2014.
- ↑ "IISC" (PDF). IISC. 2014. Retrieved 17 December 2014.
- ↑ "Academia". Academia. 2014. Retrieved 17 December 2014.
- ↑ "Worldcat". Worldcat. 2014. Retrieved 17 December 2014.
- ↑ K. Paddayya, ed. (January 2004). Recent Studies in Indian Archaeology (Indian Council of Historical Research Monograph, 6). Munshiram Manoharlal Publishers. p. 454. ISBN 978-8121509299.K. Paddayya, ed. (January 2004). Recent Studies in Indian Archaeology (Indian Council of Historical Research Monograph, 6). Munshiram Manoharlal Publishers. p. 454. ISBN 978-8121509299.
- ↑ K. Paddayya; D. R. Shah (August 1997). Investigations into the Neolithic Culture of the Shorapur Doab, South India (Studies in South Asian Culture). Brill Academic Pub. ISBN 978-9004037694.
- ↑ K. Paddayya (1990). The New Archaeology and Aftermath: A View from Outside the Anglo-American World. Ravish Publishers.
- ↑ K. Paddayya (September 2004). Multiple Approaches to the Study of India's Early Past: Essays in Theoretical Archaeology. Aryan Books International. p. 230. ISBN 978-8173054785.
- ↑ "Deccan College". Deccan College. 2014. Archived from the original on 17 డిసెంబరు 2014. Retrieved 17 December 2014.
- ↑ "Shanghai Archaeology Forum". Shanghai Archaeology Forum. 2014. Retrieved 17 December 2014."Shanghai Archaeology Forum". Shanghai Archaeology Forum. 2014. Retrieved 17 December 2014.