కాపర్(II) సల్ఫేట్
కాపర్ (II) సల్ఫేట్(Copper (II) sulfate) ' ఒక రసాయన సంయోగ పదార్థం. ఇది ఒక ఆకర్బన సమ్మేళన రసాయన పదార్థం. ఈ సంయోగ పదార్థాన్ని కుప్రిక్‌సల్ఫేట్, ‘’’copper sulphate’’’ అనికూడా పిలుస్తారు. అనార్ద్ర రసాయన సంయోగపదార్థం యొక్క రసాయన సంకేతపదం CuSO4. అయిదు జల అణువులను కలిగిన(పెంటా హైడ్రెట్) ఆర్ద్ర కాపర్(II) సల్ఫేట్ యొక్క రసాయన సంకేత పదం CuSO4•5H2O. ఈ సంయోగాపదార్థం యొక్క ఆర్ద్రీకరణం(hydration) స్థాయిబట్టి పలురూప శ్రేణులలో లభించును. నిర్జల/ అనార్ద్ర కాపర్‌సల్ఫేట్ లేత పచ్చనిరంగులో లేదా బూడిద తెలుపుగా పొడి రూపంలో ఉండును. అయిదు జల/నీటిఅణువులను కలిగిన పెంటాహైడ్రేట్ కాపర్‌సల్ఫేట్(CuSO4•5H2O), ప్రకాశమైన నీలి రంగులో ఉండును. నీటిలో ఉష్ణమోచక చర్య (తాపక్షేపక వేడిని వెలిపెట్టే) జరిపి జలసంశ్లిష్ ట(aquo complex) [Cu(H2O) 6]2+ను ఏర్పరచును. ఈ జల సంశ్లిష్ట పదార్థము పరాయస్కాంత గుణం కలిగి అష్టభుజ అణు సౌష్టావాన్ని కలిగి ఉండును.
| |||
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము
Copper(II) sulfate
| |||
ఇతర పేర్లు
Cupric sulfate
Blue vitriol (pentahydrate) Bluestone (pentahydrate) Bonattite (trihydrate mineral) Boothite (heptahydrate mineral) Chalcanthite (pentahydrate mineral) Chalcocyanite (mineral) | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [7758-98-7] | ||
పబ్ కెమ్ | 24462 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 231-847-6 | ||
కెగ్ | C18713 | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:23414 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | GL8800000 (anhydrous) GL8900000 (pentahydrate) | ||
ATC code | V03 | ||
SMILES | [O-]S(=O)(=O)[O-].[Cu+2] | ||
| |||
ధర్మములు | |||
CuSO4 (anhydrous) CuSO4·5H2O (pentahydrate) | |||
మోలార్ ద్రవ్యరాశి | 159.609 g/mol (anhydrous),[1] p. 4.62</ref> 249.685 g/mol (pentahydrate) | ||
స్వరూపం | gray-white (anhydrous) blue (pentahydrate) | ||
సాంద్రత | 3.60 g/cm3 (anhydrous) 2.286 g/cm3 (pentahydrate) | ||
ద్రవీభవన స్థానం | 110 °C (230 °F; 383 K) decomposes (·5H2O)[1] <560 °C decomposes[1] | ||
1.055 molal (10 °C) 1.26 molal (20 °C) 1.502 molal (30 °C)[2] | |||
ద్రావణీయత | anhydrous insoluble in ethanol pentahydrate soluble in methanol 10.4 g/L (18 °C) insoluble in ethanol | ||
వక్రీభవన గుణకం (nD) | 1.724–1.739 (anhydrous)[3] 1.514–1.544 (pentahydrate)[4] | ||
నిర్మాణం | |||
స్ఫటిక నిర్మాణం
|
Orthorhombic (anhydrous, chalcocyanite), space group Pnma, oP24, a = 0.839 nm, b = 0.669 nm, c = 0.483 nm.[5] Triclinic (pentahydrate), space group P1, aP22, a = 0.5986 nm, b = 0.6141 nm, c = 1.0736 nm, α = 77.333°, β = 82.267°, γ = 72.567°[6] | ||
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |||
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−769.98 kJ/mol | ||
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |||
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
5 J K−1 mol−1 | ||
ప్రమాదాలు | |||
భద్రత సమాచార పత్రము | anhydrous pentahydrate | ||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | R22, మూస:R36/38, R50/53 | ||
S-పదబంధాలు | (S2), మూస:S22, S60, S61 | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
Lethal dose or concentration (LD, LC): | |||
LD50 (median dose)
|
300 mg/kg (oral, rat)[7] | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
ఇతర కాటయాన్లు
|
Iron(II) sulfate Manganese(II) sulfate Nickel(II) sulfate Zinc sulfate | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
![]() ![]() ![]() | |||
Infobox references | |||
కాపర్ (II)సల్ఫేట్ ఇతర నామాలుసవరించు
కాపర్ సల్ఫెటును కుప్రస్‌సల్ఫేట, copper sulphate అనే కాకుండగా బ్లూస్టోన్, బ్లూవిట్రియోల్ అను పేర్లు కూడాకలవు. దీనిని తెలుగులో మైలతుత్తం అంటారు. దీనికి తుత్థాంజనం, శిఖిగ్రీవం, మయూరకం, కర్పరి అను పేర్లు కూడాకలవు. [8]
ఉత్పత్తి-ఉనికిసవరించు
పారిశ్రామిక స్థాయిలో రాగి లోహాన్ని గాఢ సల్ఫ్యూరిక్‌ఆమ్లంతో చర్య జరిపించడం వలన లేదా రాగి లోహఆక్సైడులను సజల సల్ఫ్యూరిక్‌ఆమ్లంతో రసాయనికచర్య జరిపించడం ద్వారా కాపర్ సల్ఫేట్‌ను ఉత్పత్తి చెయ్యుదురు. రాగి ఖనిజాన్ని నెమ్మదిగా గాలిలో leaching చెయ్యడం ద్వారా కుడా కాపర్ సల్ఫేటును ఉత్పత్తి కావింతురు. ఈ రకపు చర్యను వేగవంతం చెయ్యుటకు బాక్టిరియాను ఉపయోగిస్తారు. వ్యాపారస్థాయిలో ఉత్పత్తి చేసిన కాపర్ సల్ఫేట్ 98%వరకు శుద్ధత కలిగి ఉండును.మిగతా శాతం నీటిని కలిగి ఉండును. కాపర్ సల్ఫేట్ భారంలో 39.81శాతం రాగి,, 60.19 శాతం సల్ఫేటు ఉండును. ఈ రసాయన సంయోగ పదార్థాన్ని అవసర ప్రయోజనాన్ని బట్టి నాలుగురకాల స్పటిక పరిమాణాలుగా వర్గీకరణచేసారు.
పెద్దస్పటికాలు (10-40 మీ.మీ), చిన్నస్పటికాలు (2-10మీ.మీ), హిమస్పటికాలు (2.0 మి.మీ. కన్నాతక్కువ సైజు), గాలి కెగిరే పొడి/పుడి(0.15 మీ.మీ కన్న తక్కువ సైజు) అనార్ద్ర/నిర్జల కాపర్‌సల్ఫేట్ ఖనిజం అరుదుగా (chalcocyanite) గా లభిస్తుంది. జలయుత/ఆర్ద్ర కాపర్‌సల్ఫేట్ రెండు మూడు ఖనిజరూపాలలో లభ్యం. అయిదు జలఅణువులను కలిగిన chalcanthite ఖనిజం, మూడు జలఅణువులను కలిగిన bonattite, ఆరునీటి అణువులను కలిగిన boothite ఖనిజాలు.
రసాయన ధర్మాలుసవరించు
అయిదు జలఅణువులను కల్గిన (pentahydrate) కాపర్ సల్ఫెటును వేడిచేసిన, అది దాని ద్రవీభవన స్థానం 150 °C (302 °F) చేరుటకు ముందే వియోగం/విఘటన చెందును. మొదటగా 63 °C (145 °F) రెండు నీటిఅణువులను కోల్పోతుంది, తరువాత 109 °C (228 °F) వద్ద మరో రెండు జలాణువులను కోల్పోతుంది. చివరి నీటిఅణువును 200 °C (392 °F) వద్ద కోల్పోతుంది.
కాపర్(II) సల్ఫేట్ 650 °C (1,202 °F) వద్ద కాపర్(II) ఆక్సైడు(CuO),, సల్ఫర్ ట్రైఆక్సైడు(SO3) గా విడిపోవును.
కాపర్ సల్ఫేట్ గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యవలన టెట్రాక్లోరోకుప్రేట్ ఏర్పడును.
- Cu2+ + 4 Cl− → CuCl42−
కాపర్(II) సల్ఫేటు అధిక క్షయకారక లోహాలతో చర్యవలన రాగిలోహము,, సదృశ/సమానలోహ ఆక్సైడులు ఉత్పత్తి అగును.
- CuSO4 + Zn → ZnSO4 +Cu
కాపర్(II) సల్ఫేట్ 650 °C (1,202 °F) వద్ద కాపర్(II) ఆక్సైడు(CuO,, సల్ఫర్ ట్రై ఆక్సైడు(SO3) గా విడిపోవును. కాపర్ సల్ఫేట్ గాఢహైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యవలన టెట్రాక్లోరో కుప్రేట్ ఏర్పడును.
- Cu2+ + 4 Cl− → CuCl42−
కాపర్(II) సల్ఫేటు అధిక క్షయకారకలోహాలతో చర్యవలన రాగిలోహము,, సదృశ/ సమానలోహ ఆక్సైడులు ఉత్పత్తి అగును.
- CuSO4 + Zn → ZnSO4+Cu
ఉపయోగాలుసవరించు
కాపర్(II) సల్ఫేటును శిలీంధ్రనాశని గాను కీటకనాశని గాను ఉపయోగిస్తారు. ముఖ్యంగా అయిదు జలబిందువులు (pentahydrate) కలిగిన కాపర్(II) సల్ఫేటు శిలీంధ్రనాశని. కొన్ని రకాల శిలీంధ్రాలు రాగి అయానును నిలువరించే గుణాన్ని సంతరించుకొని ఉంటాయి. అందువలన సున్నంతో కలిపినా/మిశ్రమం చేసిన కాపర్(II) సల్ఫేటు మిశ్రమాన్ని బోర్డక్సుక్సుమిశ్రము (Bordeaux mixture) అంటారు. ఈ మిశ్రమ పదార్థంద్రాక్ష.పుచ్చ,, మృదుఫలం పంటతోటలను ఆశించు శిలీంధ్రాల బాగా నివారించును.
- Cu2+ + SO42- + Ca2++ 2(OH)- →Cu(OH)2+CaSO4
కాపర్(II) సల్ఫేటు, అమ్మోనియం కార్బోనేటు మిశ్రమాన్ని చెసున్ట్ కాంపౌండు (Cheshunt compound) అంటారు. ఈమిశ్రమాన్ని ఉద్యానతోటలలో నారుమొక్క చెమ్మగిలటాన్ని నివారించుటకు వాడెదరు.
ఈతకొలనులలో దీనిని శైవలనాశని(algicide) ఉపయోగిస్తారు. సజల కాపర్(II) సల్ఫేట్ ద్రావణాన్ని మత్స్యప్రదర్శనశాల(ఆక్వేరియం) లోని చేపల పరాన్నజీవులనుండి వచ్చుఅంటువ్యాధి నివారణకై వాడెదరు. అలాగే జలచర ప్రదర్శనశాలలోని నత్తలను తొలగించుటకై కూడా కాపర్(II) సల్ఫెటును వాడెదరు. రాగి ధాతువు యొక్క ఆయానులు చేపలకు హానికరం, అందుచేత అక్వేరియంలో వాడు కాపర్ (II) సల్ఫేట్ మోతాదు విషయంలో తగుజాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పలురకాలశైవల/నాచు జాతులను తక్కువమోతాదు కాపర్ సల్ఫేటు ద్రావణం నిలువరించ గలదు. బ్యాక్టీరియా పెరుగుదలనును కాపర్ సల్ఫేటు(II) చక్కగా నిరోధిస్తుంది.
ఇతర ఉపయోగాలుసవరించు
పుస్తకాలను బైండు పుస్తకాలను అతికించు జిగురు, బంక వంటి అతికించు వస్తువులలో కాపర్ (II) సల్ఫెటును, కాగితాన్ని చెదలుకాటు నుండి రక్షించుటకై ఉపయోగించేవారు.భవన నిర్మాణంలో కాపర్(II) సల్ఫెటును కాంక్రీటులో నీటి కారుదల నివారణకు,, అంటిసెప్టిక్‌గా ఉపయోగిస్తారు. మృణ్మయ పాత్రల మీద, అద్దాలమీద వెయ్యు చిత్రకళలో ఉపయోగించు రంగుల తయారిలోఉపయోగిస్తారు.
కాపర్(II) సల్ఫేటును బాణాసంచాలలో నీలిజ్వాలను/కాంతిని కల్గించు రంగుకారకంగా ఉపయోగిస్తారు.అయితే బాణాసంచాలో తయారీలో ఉపయోగించునపుడు దీనిని నేరుగా క్లోరేట్‌పదార్థాలతో మిశ్రమం చెయ్యరాదు.
విశ్లేషణాత్మక కారకంసవరించు
పలు రసాయన పరీక్షలలో కాపర్ సల్ఫేటునుఉపయోగిస్తారు. రెడ్యుసింగ్ షుగర్లను గుర్తించుటకై ఫెహేలింగ్ ద్రావణం(Fehling's solution), బెనెడిక్ట్’స్ ద్రావణం(Benedict's solution) లలో కాపర్ సల్ఫేటును ఉపయోగిస్తారు, ఇది ద్రావణియ నీలికాపర్(I) సల్ఫేటును అద్రావణియ(I) ఆక్సైడుగా క్షయిస్తుంది.ప్రోటినులను గుర్తించుటకై Biuret కారకంలో ఉపయోగిస్తారు
పాండురోగం(anemia) సమయంలో రక్తాన్ని పరీక్షించుటకు కాపర్(II) సల్ఫేటును ఉపయోగిస్తారు. రక్తం యొక్కవిశిష్ణగురుత్వాన్ని కనుగోనుటకై కాపర్(II) సల్ఫేట్ ద్రావణంలోకి రక్తాన్ని బొట్లుగా వదలెదరు. తగుమోతాదులో హిమోగ్లోబిన్‌కలిగిన రక్తపు చుక్కలు వేగంగా కాపర్(II) సల్ఫేట్ ద్రావణంలో మునిగిపోగా, తక్కువ హిమాగ్లోబిన్ కలిగిన రక్తం, కాపర్(II) సల్ఫేట్ ద్రావణం పై తేలుతూ ఉండిపోవును, లేదా నెమ్మదిగా క్రింది భాగానికి చేరును.
జ్వాలపరీక్షలో కాపర్ అయాను ముదురు నీలికాంతి ఇచ్చును.జ్వాలపరీక్షలో బేరియం అయాను వెలువరించు నీలికాంతి కన్న కాపర్ అయాను ఇచ్చు కాంతి ఎక్కువ గాఢనీలిరంగును వెలువరించును.
సేంద్రియాల సంశ్లేషణసవరించు
కాపర్(II) సల్ఫెటును మితంగా సేంద్రియసంశ్లేషణ చెయ్యుటకై ఉపయోగిస్తారు.అసెటల్(acetal) సమూహం లను ఉత్పత్తి చేయ్యుటకై నిర్జల కాపర్సల్ఫెటును డిహైడేటింగు కారకంగా ఉపయోగిస్తారు.
Etching/ లోహాదులపైని ద్రావకాదుల వలన చిత్రముచెక్కుట చెక్కడంసవరించు
ఇంటాగ్లియో ముద్రణలో(ప్రింటు మేకింగులో) జింకు లేదా రాగి ఫలకాలమీద చిత్రముచెక్కుటకు (etch) కాపర్ సల్ఫెటును ఉపయోగిస్తారు. అలాగే ఆభరణాలలో రాగిని చెక్కుటకై కాపర్ సల్ఫెటునుఉపయోగిస్తారు.
అద్దకంలో వినియోగంసవరించు
కాపర్(II) సల్ఫెటును ఉద్భిజ్జపురంగుల తయారీలో వర్ణస్థాపకముగా ఉపయోగిస్తారు. కొన్ని ప్రత్యేకవర్ణాలకు పచ్చనిచాయను పెంచుతుంది.
విషకారకప్రభావంసవరించు
కాపర్(II) సల్ఫేట్ ప్రకోపింపచెయ్యు(irritate) లక్షణాన్ని కలిగిఉన్నది. కళ్ళలో కాపర్(II) సల్ఫేటు ధూళిపడటం లేదా చర్మాన్ని కాపర్(II) సల్ఫేటు తగలటం వలన ఈ పదార్థవిషప్రభావానికి గురై అవకాశమున్నది. కాపర్(II) సల్ఫేటు యొక్క ధూళికణాలను పీల్చడం వలన కూడా దీని ప్రభావానికి గురై అవకాశమున్నది. చర్మానికి తగలడం వలన చర్మవ్యాధి/గజ్జి దురద లక్షణాలు కన్పించును. కళ్ళలో పడడంవలనకండ్లకలక( conjunctivitis, మంటతోగూడిన వాపు(inflammation) కనురెప్పల మీద కురుపులు రావడం, కార్నియా మబ్బుగా/మసగగా ఉండటం వంటి లక్షణాలు కనపడును.
నోటిద్వారా లోపలి వెళ్ళిన ఒకమోస్తరు విష ప్రభావం చూపును.కనిష్ఠ ప్రమాణంలో 11 మి.గ్రాం/ఒక కేజి మనిషి బరువు లెక్కన దేహంలోచేరిన ప్రమాదం. కాపర్ సల్ఫేట్ కడుపులోకి వెళ్ళినప్పుడు, దీనికి ప్రకోపింప చెయ్యు గుణం ఉన్నందున వాంతులు వస్తాయి.ఒకవేళ ఈ పదార్థం కడుపులో ఉండిపోయిన దీని ప్రభావం తీవ్రంగా ఉండును. 1-12 గ్రాముల కాపర్ సల్ఫేటుతినిన, చాతిలో మంటగా, విరేచనాల అవటం, వికారము, వాంతి కలగడం, తలనొప్పి, అనియత మూత్రవిసర్జన వంటి లక్షణాలు కలుగును, చర్మం పసుపుగా మారును.కాపర్(II) సల్ఫేట్ యొక్క విషప్రభావం వలన మెదడు, కడుపు, కాలేయం, మూత్రపిండాలు పాడై అవకాశం ఉంది.
పరిసరాలపై విష ప్రభావంసవరించు
కాపర్ (II) సల్ఫేటు నీటిలో త్వరగా బాగా కరిగే స్వభావం కలిగి ఉన్నందున పరిసరాలలో సులభంగా వ్యాపిస్తుంది. భూమిలోని కాపర్(II) సల్ఫేటు పరిశ్రమలనుండి, మోటారు వాహనాలనుండి వెలువడిన వ్యర్దాలవలన భూమిలో చేరును, అలాగే భవన నిర్మాణ వస్తువులనుండి కూడా కాపర్(II) సల్ఫేటు భూమిలోకి చేరు అవకాశమున్నది.కాపర్ సల్ఫేట్ ముఖ్యంగా భూఉపరితల నెలలోని సేంద్రియ పదార్థాలచే గ్రహింపబడిఉన్నది.ఎక్కువ ఆమ్ల గుణమున్న నేలలో కాపర్ సల్ఫేటు తక్కువ పిల్చబడిఉండును.
ఇవికూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 Haynes ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "b92" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Haynes, p. 5.199
- ↑ Anthony, John W.; Bideaux, Richard A.; Bladh, Kenneth W. and Nichols, Monte C., ed. (2003). "Chalcocyanite". Handbook of Mineralogy (PDF). Vol. V. Borates, Carbonates, Sulfates. Chantilly, VA, US: Mineralogical Society of America. ISBN 0962209740.
{{cite book}}
: CS1 maint: multiple names: editors list (link) - ↑ Haynes, p. 10.240
- ↑ Kokkoros, P. A.; Rentzeperis, P. J. (1958). "The crystal structure of the anhydrous sulphates of copper and zinc". Acta Crystallographica. 11 (5): 361–364. doi:10.1107/S0365110X58000955.
- ↑ Bacon, G. E.; Titterton, D. H. (1975). "Neutron-diffraction studies of CuSO4 · 5H2O and CuSO4 · 5D2O". Z. Kristallogr. 141 (5–6): 330–341. doi:10.1524/zkri.1975.141.5-6.330.
- ↑ Cupric sulfate. US National Institutes of Health
- ↑ పదనిష్పాదన కళ, తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం (2014), పుట 39[permanent dead link]
గ్రంథములుసవరించు
- Haynes, William M., ed. (2011). CRC Handbook of Chemistry and Physics (92nd ed.). Boca Raton, FL: CRC Press. ISBN 1439855110.