కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం
(కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
కామారెడ్డి జిల్లాలోని 4 శాసనసభ నియోజకవర్గాలలో కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఎన్నికైన శాసనసభ్యులు సవరించు
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 1952 విఠల్‌రెడ్డిగారి వెంకట్రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ 1957 విఠల్‌రెడ్డిగారి వెంకట్రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ 1967 మధుసూదన్‌రెడ్డి స్వతంత్ర 1972 వై.సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ 1978 బ్రహ్మణపల్లి బాలయ్య కాంగ్రెస్ పార్టీ 1983 పార్శి గంగయ్య తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ 1985 ఎ. కృష్ణ మూర్తి తెలుగుదేశం పార్టీ బి ఆర్ మల్లేష్ కాంగ్రెస్ పార్టీ 1989 షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ యూసుఫ్ అలీ తెలుగుదేశం పార్టీ 1994 గంప గోవర్ధన్ తెలుగుదేశం పార్టీ షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ 1999 యూసుఫ్ అలీ తెలుగుదేశం పార్టీ షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ 2004 షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ ఉప్పునూతుల మురళీధర్ గౌడ్ భారతీయ జనతా పార్టీ 2009 గంప గోవర్ధన్ తెలుగుదేశం పార్టీ షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ 2014 గంప గోవర్ధన్ తెలంగాణ రాష్ట్ర సమితి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ 2018 గంప గోవర్ధన్ తెలంగాణ రాష్ట్ర సమితి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ
2004 ఎన్నికలు సవరించు
2004 శాసనసభ ఎన్నికలలో కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి మహ్మద్ అలీ షబ్బీర్ తన సమీప ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థి ఉప్పునూతల మురళీధర్ గౌడ్‌పై 52763 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. షబ్బీర్‌కు 80233 ఓట్లు పోలవగా, మురళీధర్ గౌడ్‌కు 27470 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు సవరించు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున వి.మురళీధర్ గౌడ్ పోటీ చేస్తున్నాడు.[1] తెలుగుదేశం పార్టీ తరఫున గంప గోవర్ధన్ పోటీలో ఉండగా, కాంగ్రెస్ నుండి మంత్రి షబ్బీర్ అలీ పోటీలో ఉన్నాడు.[2]
నియోజకవర్గ ప్రముఖులు సవరించు
గంప గోవర్థన్:బిక్‌నూర్ మండలానికి చెందిన గోవర్థన్ తెలుగుదేశం పార్టీ తరఫున 1994లో శాసనసభ్యుడిగా విజయం సాధించాడు.