కారైకుడి మణి ఒక కర్ణాటక మృదంగ వాద్య కళాకారుడు.[1][2]

కారైకుడి ఆర్.మణి
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంగణపతి సుబ్రహ్మణ్యం
జననం (1945-09-11) 1945 సెప్టెంబరు 11 (వయసు 79)
కారైకుడు, తమిళనాడు, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వాయిద్యాలుమృదంగం

వ్యక్తిగత జీవితం

మార్చు

కారైకుడి మణి 1945, సెప్టెంబర్ 11న తమిళనాడు లోని కారైకుడిలో టి.రామనాథ అయ్యర్, పట్టమాళ్ దంపతులకు జన్మించాడు.ఇతడు తన మూడవ యేటి నుండే కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడం మొదలుపెట్టాడు. మృదంగం పట్ల ఆకర్షితుడై గాత్ర సంగీతానికి స్వస్తి పలికాడు.[3]

వృత్తి

మార్చు

ఇతడు రఘు అయ్యంగార్, టి.ఆర్.హరిహరశర్మ, కె.ఎం.వైద్యనాథన్‌ల వద్ద మృదంగ విద్యను అభ్యసించాడు. తన 18వ యేట ఇతడు మొదటి సారి జాతీయ స్థాయి పురస్కారాన్ని అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా అందుకున్నాడు. తరువాత 1999లో సంగీత నాటక అకాడమీ అవార్డును స్వీకరించాడు.

శృతి లయ

మార్చు

ఇతడు 1986లో శృతిలయ అనే సంస్థను స్థాపించాడు.[4] మూడు సంవత్సరాల తర్వాత ఇతడు శృతి లయ సేవా స్కూలును ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ స్కూలు చెన్నై, బెంగళూరు, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, లండన్ లలో శాఖలను కలిగి ఉండి అనేక మంది శిష్యులను సంగీత విద్వాంసులుగా తయారు చేస్తున్నది.

తని ఆవర్తనం

మార్చు

ఇతడు "తని ఆవర్తనం" కచేరీలను కల్పించి నిర్వహించాడు. ఈ పద్ధతిలో వయోలిన్, గాత్రం వంటి శృతి విద్వాంసులు లేకుండా ఇద్దరు తాళ వాద్యవిద్వాంసులతో మాత్రమే ప్రదర్శన ఉంటుంది. 1993లో ఇతడు మొదటి తని ఆవర్తనం కచేరీని కంజీర విద్వాంసుడు జి.హరిశంకర్‌తో కలిసి చేశాడు. ఈ ప్రదర్శన శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఒక మరపురాని సంఘటనగా నిలిచిపోయింది. ఈ పద్దతిలో అనేక మంది మృదంగవిద్వాంసులు తని ఆవర్తనం కచేరీలు చేశారు. ఇతడు కూడా ఘటం, తబలా మొదలైన వాద్య కళాకారులతో జంటగా తని ఆవర్తనం కచేరీలు నిర్వహించాడు.

అంతర్జాతీయ భాగస్వామ్యం

మార్చు

కారైకుడి మణి ఆస్ట్రేలియన్ ఆర్ట్ ఆర్కెస్ట్రాకు చెందిన "పాల్ గ్రాబౌస్కీ", ఫిన్‌లాండ్ నాద గ్రూపుకు చెందిన "ఈరో హెమ్మెనైమి",[5] "ఎలియోమార్చెసిని", ఇటలీకి చెందిన "లివియో మాగ్నినీ", అమెరికాకు చెందిన "పాల్ సైమన్" మొదలైన అంతర్జాతీయ కళాకారులతో కలిసి కచేరీలు నిర్వహించాడు. ఫిన్‌లాండ్ ఫిలాంత్రఫిక్ ఆర్కెస్ట్రాతో కలిసి లయప్రియ అనే కార్యక్రమాన్ని నిర్వహించాడు.[6] ఆస్ట్రేలియన్ ఆర్ట్ ఆర్కెస్ట్రా ఇతడు బహుదారి, రంజని రాగాలతో కూర్చిన సంగీతాన్ని జాజ్ పద్ధతిలో "ఇన్ టు ద ఫైర్" అనే పేరుతో విడుదల చేసింది. ది నాద గ్రూప్ ఆఫ్ ఫిన్‌లాండ్ బేహాగ్ రాగంలో ఇతడు కూర్చిన కృతిని జాజ్ సంగీత పద్ధతిలో మార్చి "అన్‌మాచ్‌డ్" పేరుతో విడుదల చేసింది. అంతర్జాతీయ తాళవాద్య నిపుణుడు ఈరో హెమ్మెనైమి తన నాలుగు కృతులను ఇతనికి అంకితం ఇచ్చాడు.

ఇంకా ఇతడు జపనీస్ సంగీత విద్వాంసుడు జాన్ కైకెన్ నెప్ట్యూన్‌తో కలిసి "స్టెప్స్ ఇన్ టైమ్" అనే ఆల్బం,[7] సారంగన్ శ్రీరంగనాథన్, మరి కొంతమంది ఆస్ట్రేలియా కళాకారులతో కలిసి "యూనిటీ ఇన్ డైవర్సిటీ" అనే ఆల్బం, పాల్ సైమన్‌తో కలిసి "సో బ్యూటిఫుల్ ఆర్ సో వాట్" అనే ఆల్బం చేశాడు.

ఇతడు లయమణి లయం అనే పత్రికను ప్రారంభించాడు.[8]

మూలాలు

మార్చు
  1. site., Who made this. "Project Name". bengalfoundation.org. Retrieved 28 January 2018.
  2. శంకరనారాయణ, వైజర్సు బాలసుబ్రహ్మణ్యం (1 May 2015). నాదరేఖలు (PDF) (1 ed.). హైదరాబాదు: శాంతా వసంతా ట్రస్ట్. p. 61. Archived from the original (PDF) on 24 ఏప్రిల్ 2022. Retrieved 15 March 2021.
  3. "The Hindu : Laya maestro crosses a golden milestone". www.thehindu.com. Archived from the original on 2 నవంబరు 2003. Retrieved 28 January 2018.
  4. "Sruthi Laya – Tapes/CDS". Guru Kaaraikkudi Mani. Archived from the original on 18 ఆగస్టు 2006. Retrieved 15 మార్చి 2021.
  5. "Sruthi Laya – Naada Group". Sampo Lassila.[permanent dead link]
  6. "Sruthi Laya – Finnish Group". Music Finland.[permanent dead link]
  7. "Sruthi Laya – Shakuhachi, Steps in time". Pacific Internet. Archived from the original on 26 జూన్ 2008. Retrieved 15 మార్చి 2021.
  8. "Sruthi Laya – Layamani Layam". Guru Kaaraikkudi Mani. Archived from the original on 21 నవంబరు 2008. Retrieved 15 మార్చి 2021.