కాళీఘాట్

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, కోల్‌కతా నగరంలోని ఒక ప్రాంతం.

కాళీఘాట్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, కోల్‌కతా జిల్లా, కోల్‌కతా నగరంలోని ఒక ప్రాంతం. దక్షిణ కోల్‌కతాలోని పురాతన పొరుగు ప్రాంతాలలో ఒకటైన ఈ కాళీఘాట్ ప్రాంతం జనసాంద్రతతో కూడి ఉంటుంది.[1]

కాళీఘాట్
కోల్‌కతా (కలకత్తా)లోని పరిసర ప్రాంతం
కాళీఘాట్ is located in Kolkata
కాళీఘాట్
కాళీఘాట్
కొలకత్తాలోని ప్రాంతం
Coordinates: 22°31′05″N 88°20′46″E / 22.518°N 88.346°E / 22.518; 88.346
దేశంభారతదేశం
రాష్ట్రంపశ్చిమ బెంగాల్
నగరంకలకత్తా
జిల్లాకలకత్తా జిల్లా
కలకత్తా మెట్రోజతిన్ దాస్ పార్క్ మెట్రో స్టేషన్, కాళీఘాట్ మెట్రో స్టేషన్
మున్సిపల్ కార్పోరేషన్కలకత్తా మున్సిపల్ కార్పోరేషన్
కలకత్తా మున్సిపల్ కార్పోరేషన్ వార్డులు73, 83, 84, 87
Elevation
36 అ. (11 మీ)
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
700 026
ప్రాంతపు కోడ్+91 33
లోక్‌సభ నియోజకవర్గంకలకత్తా దక్షిణ
శాసనసభ నియోజకవర్గంభబానీపూర్, రాష్‌బెహారి

కాళీఘాట్ కాళి

మార్చు

ఇక్కడ కాళీకాదేవి కోసం ప్రసిద్ధ దేవాలయం కాళీఘాట్ కాళీ దేవాలయం ఉంది. 51 శక్తి పీఠాలలో ఈ దేవాలయం కూడా ఒకటి. దాక్షాయణి (సతీ) కుడికాలి బొటనవేలు ఇక్కడ పడిందని చరిత్ర చెబుతతోంది.[2] ఇక్కడి శక్తిని దక్షిణ కాళికా అని పిలుస్తారు. ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు ఇక్కడికి వస్తారు. అయితే, మంగళవారాలు, శనివారాలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఈ రెండు రోజులలో ముఖ్యంగా సాయంత్రం వేళల్లో రద్దీ వందరెట్లు పెరుగుతుంది. విపద్ తరిణి వ్రతం సమయంలో, అమ్మవారిని రతంతిక, ఫలహారిని కాళిగా పూజించినప్పుడు మరింత ఎక్కువమంది యాత్రికులు వస్తారు.

ఇతర వివరాలు

మార్చు

అమితావ్ ఘోష్ కలకత్తా క్రోమోజోమ్ లో కొంతభాగం కాళీఘాట్‌లో నేపథ్యంలో రాయబడింది. డాన్ సిమన్స్ రచించిన సాంగ్ ఆఫ్ కాళీ, పాపీ జెడ్ బ్రైట్ రచించిన కలకత్తా, లార్డ్ ఆఫ్ నెర్వ్స్ అనే చిన్న కథలో కూడా కాళీఘాట్ ప్రస్తావన ఉంది. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో విద్యాబాలన్ నటించిన కహానీ చిత్రంలో కూడా కాళీఘాట్‌ ఉంది.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "District Census Handbook Kolkata, Census of India 2011, Series 20, Part XII A" (PDF). Pages 6-10: The History. Directorate of Census Operations, West Bengal. Retrieved 2022-11-04.
  2. Kalikshetra Kalighat, Sumon Gupta, Deep Prakashan, Kolkata, 2006, p. 13

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కాళీఘాట్&oldid=4157744" నుండి వెలికితీశారు